Karthika Deepam మే 3 ఎపిసోడ్: మనసులో మాట చెప్తానంటున్న నిరుపమ్- ప్రేమ సంగతి చెప్తాడని ఊహించుకుంటున్న జ్వాల
బొమ్మలు గీచే గీత ఊరి నుంచే వెళ్లిపోతుంది. దీంతో గీచిన హిమ, సౌర్య స్కెచెస్ దొరక్కుండా పోతాయి. ఇంతలో మనసులో మాట చెప్పాలని డిసైడ్ అయిన నిరుపమ్ జ్వాలకు ఫోన్ చేస్తాడు.
రోడ్డుపై జ్వాల, సౌందర్య మధ్య డిస్కషన్ నడుస్తుంది. మీ పొగరే నాకు వచ్చిందని చెబుతుంది జ్వాలా. నా పొగరు నీకు రావడమేంటని ఆశ్చర్యపోతుంది సౌందర్య. అంటే మీలాంటి వాళ్లు మా ఇంట్లో కూడా ఉంటారు కదా అని కవర్ చేస్తుంది. ఏదైనా బ్లడ్‌లో ఉంటుందంటుంది. ఇంతలో ఆమె తెచ్చన సరుకు తీసుకెళ్లి లోపల పెట్టమని ఓ వ్యక్తి చెప్తాడు. ఒరే మా నాన్నమ్మతో వెళ్లాలిరా అనుకుంటుంది జ్వాలా. ఎలాగైనా ఇవాళ వాళ్లు ఇల్లు కనిపెట్టాలని మనసులో అనుకుంటుంది. మొత్తానికి ఇద్దరూ కాసేపు వాదులాడుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఒకరికి తెలియకుండా ఒకరు బొమ్మ గీచే ఆఫీస్‌కు వస్తారు. అక్కడ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆఫీస్‌లోపలికి వెళ్లాక బొమ్మలు గీచే ఆమె అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు అక్కడి వాళ్లు సమాచారం ఇస్తారు. దీంతో జ్వాలా, సౌందర్య ఇద్దరూ అసంతృప్తికి గురి అవుతారు. ఆఫీస్ వద్ద ఇద్దరి మధ్య మరోసారి చిన్న సైజ్ వార్ నడుస్తుంది. అక్కడి నుంచి ఇద్దరూ బయల్దేరుతారు. సౌందర్యను ఫాలో అవుదామని అనుకుంటుంది కానీ అలా జరగదు.
సీన్ కట్ చేస్తే జ్వాల ఇంటి వద్ద హిమ వెయిట్ చేస్తుంటుంది. తన బొమ్మ జ్వాల గీస్తుందేమో అన్న టెన్షన్ ఆమెను వెంటాడుతుంది. ఇంతలో జ్వాల వస్తుంది. ఎలాంటి బాంబు పేలుస్తుందోనని హిమ ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. సీరియస్‌గా అందర్నీ లోపలికి పంపించేసి... హిమతో జ్వాల సీరియస్‌గా మాట్లాడుతుంది. బొమ్మ గీచిన గీత వెళ్లిపోయిందని చెబుతుంది. అయినా వదలకుండా బొమ్మ పట్టుకున్నానని.. అదే నువ్వే కదా అంటూ బాంబు పేలుస్తుంది. ఒక్కసారిగా షాక్ తిన్న హిమకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో గట్టిగా నవ్వుతుంది జ్వాల. ఊరికే జోక్ చేశానని.. ఆ బొమ్మ దొరకలేదని అసలు విషయం చెబుతుంది. అప్పుడు హిమ ఊపిరి పీల్చుకుంటుంది.
నిరుపమ్ ఉదయం జాగింగ్ చేస్తుంటే హిమ గుర్తుకు వస్తుంది. రోజూ పక్కపక్కనే ఉంటున్నా ప్రేమ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నానని అనుకుంటాడు. దీని కోసం జ్వాల హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు. జ్వాలకు ఫోన్ చేస్తాడు. నీతో పని ఉంది పర్శనల్‌గా కలవాలని చెప్తాడు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్పాలంటాడు. మనసులో ఉన్న మాట పంచుకోవాలని చెప్తాడు. ప్రేమిస్తున్నట్టు నిరుపమ్ చెప్తాడేమో అని ఊహించుకుంటుంది జ్వాల.
ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్న కేఫ్‌కు వెళ్లే మధ్య దారిలో డీజిల్ అయిపోతుంది. ఆటో ఆగిపోతుంది. కనిపించిన వెహికల్స్‌ను ఆపి లిఫ్ట్ అడుగుతుంది జ్వాల. ఎవరూ ఆపరు. ఎపిసోడ్ అయిపోతుంది...
రేపటి ఎపిసోడ్
లిఫ్ట్ కోసం రోడ్డపై ఉన్న జ్వాలకు ఎదురుగా సౌందర్య కారు వచ్చి ఆగుతుంది. రిక్వస్ట్ చేసి ఆమె వద్ద నుంచి డీజిల్ తీసుకుంటుంది జ్వాల.