Karthika Deepam 2 Serial Today January 14th: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : జోత్స్నను కొట్టిన దీప – అసలు నిజం బయటపెట్టాలనుకున్న దాసు
Karthika Deepam 2 Today Episode: టిఫిన్ బండి తగులబెట్టించింది జోత్స్న అని తెలుసుకున్న దీప కోపంగా జోత్స్న ను కొట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Karthika Deepam 2 Serial Today Episode: లాగిపెట్టి కొట్టాలనుంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్. బయటకు మాత్రం.. మా చావు మేం చస్తాం.. మా బతుకు మేం బతుకుతాం ఇక నువ్వు వెళ్లు అంటూ కోప్పడతాడు కార్తీక్. కష్టాల్లో నిన్ను వదిలేసి నేను వెళ్లనని కావాలంటే చెప్పు అప్పుగానైనా నీకు డబ్బులు ఇస్తానంటుంది జ్యోత్స్న. నాకు అప్పు ఇస్తే నష్టపోయేది నువ్వేనని కార్తీక్ బదులిస్తాడు. కార్తీక్ ఎంత చెప్పిన జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లదు. కార్తీక్ కోపాన్ని చూసి దీప షాకవుతుంది. జ్యోత్స్నును వెళ్లిపొమ్మని చెప్తుంది.
జ్యోత్స్న: నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నేనే వెళ్లిపోతాను కానీ నా సాయం నువ్వు తీసుకునే వరకు వస్తూనే ఉంటాను. నువ్వు ఎంత పొమ్మన్న నిన్ను వదలను.
అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది. కార్తీక్ వెనకాలే కోపంగా బైక్ తీసుకుని దీపను ఎక్కించుకుని వెళ్తాడు. జోత్న్స కారుకు అడ్డుగా బైక్ అపుతాడు.
కార్తీక్: కారు దిగు జోత్స్న..
జోత్స్న: కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి..? ( మనసులో అనుకుంటుంది)
కార్తీక్: ఎందుకు చేశావు ఆ పని..
జోత్స్న: నేనేం చేశాను. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు
కార్తీక్: లాగి పెట్టి కొట్టానంటే..
దీప: కార్తీక్ బాబు ఆగండి..
కార్తీక్: లేదు దీప మన టిఫిన్ బండి కాలిపోవడానికి కారణం జ్యోత్స్న..
దీప: ఏమంటున్నారు బాబు..
కార్తీక్: అవును.. బండి తగలబెట్టిన రౌడీని ఛేజ్ చేస్తుంటే అతడి ఫోన్ దొరికింది. ఆ రౌడీకి అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసేలోపు రౌడీ ఫోన్ లాక్కొని పారిపోయాడు.
అని కార్తీక్ నిజం చెప్పగానే దీప కోపంతో జోత్స్న ను కొడుతుంది. పిచ్చతిట్టుడు తిడుతుంది.
దీప: టిఫిన్ సెంటర్ పెట్టుకొని మన బతుకు ఏదో మనం బతికితే జ్యోత్స్న ఎందుకు ఓర్చుకోలేకపోతుంది. ఇంత నీచమైన స్థాయిన దిగజారుతుందని అనుకోలేదు.
కార్తీక్: టిఫిన్ సెంటర్ కాలిపోతే మన జీవితాలు ఏం ఆగిపోవు దీప. ఇంటి దగ్గర నీ మాటలు విన్న తర్వాత నీకు బుద్ధి చెప్పకుండా వదిలేయడం తప్పనిపించింది, నీ చెంప పగలగొట్టాలని వచ్చాను.. ఆ పని నా భార్య చేసింది. మా జోలికి రావద్దు..ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.
దీప: ఇంకోసారి ఇదే రిపీట్ అయితే బట్టల్ని బండ మీద ఉతికినట్లు ఉతికి ఆరేస్తాను. నువ్వు ఎంత తొక్కితే మేము అంత ఎదుగుతాము.
అంటూ దీప వార్నింగ్ ఇవ్వడంతో పలకుండా దీప ఇంటికి రాకుండా ఇక్కడ గొడవ చేయడమే నయం అయింది. లేకపోతే ఇంట్లో నిజం తెలిసేది. అయినా దీపను చంపేయాలి అని మనసులో అనుకుంటుంది జోత్స్న.
కార్తీక్: తక్కువ రోజుల్లోనే ఆ బండి మన ఫ్యామిలీలో ఒక మెంబర్లా మారింది. అలాంటి బండిని జోత్స్న జ్యోత్స్న కాల్చేయడం బాధ కలిగిస్తుంది.
దీప: ఈ బాధలేవో మనమే పడదాం బాబు.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు..
అని కార్తీక్ ను ఓదారుస్తుంది దీప. వీళ్లిద్దరి మాటలను చాటు నుంచి వింటాడు దాసు. శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు ఎవరనే నిజం బయటపెట్టే టైమ్ వచ్చిందని అనుకుంటాడు దాసు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















