Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు
జానకి ఐపీఎస్ చదువుకోవడానికి జ్ఞానంబ ఒప్పుకోవడంతో మల్లిక అది చూసి ఏడుస్తుంది. ఎలాగైనా జానకిని తిట్టించాలని ప్లాన్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబతో జానకిని తిట్టించేందుకు మల్లిక కుట్ర పన్నుతుంది. జ్ఞానంబ పవిత్రంగా చూసుకునే తోరాలు కిందపడేసి జానకి పుస్తకాలు అక్కడ పెడుతుంది. తినదో జ్ఞానంబ జానకిని గట్టిగా అరిచి పిలుస్తుంది. ఈ పుస్తకాలు నీవేనా అని అడుగుతుంది. వంశపారపర్యంగా వస్తున్న తోరాలు ఇవి మనం చల్లగా ఉండేందుకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన పవిత్రమైనవి అలాంటి వాటిని నీ పుస్తకాలు పెట్టేందుకు కిందపడేస్తావా అని తిడుతుంది. తరతరాలుగా వస్తున్న నమ్మకాన్ని నేలపాలు చేస్తావా.. అని అడుగుతుంటే రామా అడ్డుపడతాడు. ఇది మన కుటుంబ సంప్రదాయానికి సంబంధించిన విషయం.. ఇవి ఎంత ముఖ్యమైనవో నీకు తెలుసు నువ్వు మద్యలో నీ భార్యని వెనకేసుకుని రాబాకు అని అంటుంది. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కాబోతుంది కదా అందుకని ఈ ఇంట్లో నాకు ఎదురు లేదు తిరుగు లేదు అని అనుకుంటుందేమో అని పెట్రోల్ మల్లిక పుల్ల పెడుతుంది. జానకి ఇప్పుడే ఇలా ఉందంటే పోలీసు ఆఫీసర్ అయినక ఎలా ఉంటుందో నెత్తి మీదకి టోపీతో పాటు కళ్ళు కూడా వస్తాయేమో అని అంటుంది. మల్లిక ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అని జానకి తిడుతుంది.
నీ నెక్లెస్ గురించి నాకు తెలియదు తెలియదు తెలియదు అని మల్లిక అరుస్తుంది. నేను పసుపు కుంకుమ పూసి బాక్స్ లో పెట్టాను అని జానకి అంటుంది. నాకు తెలియదంటే వినవెంటీ అని మల్లిక అంటే మరి నీ చేతులకి పసుపు కుంకుమ ఎలా అంటుకుందని జానకి నిలదిస్తుంది. ఆవేశంలో ఎందుకంటే ఆ తోరాలు కిందపడేసినప్పుడు వాటికి ఉన్న పసుపు కుంకుమ నా చేతులకి అంటుకుంది ఇప్పటికైనా అర్థం అయ్యిందా నీకు అని అనేస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ బిత్తరపోతారు. అమ్మా మల్లిక అందరూ నిన్ను బాగా స్టాండింగ్ అమ్మా అని అంటాడు. అప్పుడు అసలు విషయం గ్రహించిన మల్లిక బిక్క మొహం వేస్తుంది. వెంటనే ఏడ్చుకుంటూ జ్ఞానంబ కాళ్ళ మీద పడి అత్తయ్యగారు అని ఏడుపు మొదలు పెడుతుంది. మేము పట్నం వెళ్ళి కాపురం పెడతామంటే ఒప్పుకోలేదు జానకి చదువుకుంటాను అంటే ఒప్పుకున్నారు అందుకే ఆ బాధతోనే ఇలా చేశాను అత్తయ్యగారు నన్ను కొట్టొద్దు అత్తయ్యగారు అని ఏడుస్తుంది.
Also Read: తల్లి కాబోతున్న కాంచన- వేద మీద కోపంతో రగిలిపోతున్న మాలిని, బాధలో చిత్ర
కాళ్ళ మీద నుంచి లేచిన మల్లిక మీదకి చెయ్యే ఎత్తుతుంది జ్ఞానంబ. సాటి ఆడదన్న కనీసపు ఆలోచన కూడా లేకుండా ఇలాంటి నీచమైన పని చేస్తావా. మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అంటారు. అలాంటిది ఇప్పటికీ నీకు ఎన్నిసార్లు చెప్పినా అది నా కంఠ శోష తప్ప నీకు అర్థం కావడం లేదు నీలో మార్పు రావడం లేదు అసలు నువ్వు చేస్తున్న పనులకి ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంకోసారి నీ వైపు నుంచి ఏ చిన్న తప్పు జరిగినా సహించేది లేదఅని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను అపార్థం చేసుకున్నాను క్షమించమ్మా అని జ్ఞానంబ జానకికి చెప్తుంది.
పెళ్ళాం మాట వింటారా లేదంటే విడాకులు ఇస్తారా అని మల్లిక విష్ణుని అడుగుతుంది. వింటాలే అని అంటాడు. సాయంత్రం చికెన్ బిర్యానీ తీసుకుని రా అని విష్ణుకి చెప్తుంది. ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరు కావాలంటే బయట తిను అనవసరంగా ఇంట్లోకి తెచ్చి అమ్మతో తిట్లు తినకు అని నచ్చజెప్పడానికి చూస్తాడు కానీ మల్లిక మాత్రం వినదు. ఇక రామా షాప్ లో తల్లి పెట్టిన షరతుల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నారని జానకి అడుగుతుంది. పరధ్యానం కాదు వెంటాడుతున్న భయం గోడ మీద అమ్మ గీసిన గీతాలు నాకు కనపడుతూనే ఉన్నాయని అంటాడు. వాటి గురించి మీరు ఏమి ఆలోచించకండి నేను చూసుకుంటాను అని జానకి చెప్తుంది. కానీ రామా మాత్రం తన భయాన్ని చెప్తాడు. నేను ఇంటి సమస్యలకే భయపడితే ఇంక ఐపీఎస్ ఏం చదువుతాను అని జానకి అంటుంది.