అన్వేషించండి

Devatha August 9th Update: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ

మాధవ మీద కారు ఎక్కించి తొక్కించబోతుంది రుక్మిణి. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఆ బాక్స్ లో ఏముందని దేవి అలా చూస్తున్నవని సత్య అడుగుతుంది. మాయమ్మ దగ్గర కూడా ఇలాంటి ఫోన్ ఉందని దేవి చెప్పడంతో సత్య షాక్ అవుతుంది. ఫోన్ ఎవరికి కొన్నవంటే ఆఫీసులో వాచ్ మెన్ కి అని చెప్పాడు.. దేవి ఏమో అక్క దగ్గర ఇలాంటి ఫోనే ఉందని చెప్తుంది.. అంటే ఆదిత్య నాకు అబద్ధం చెప్పాడా.. అసలు ఏం జరుగుతుంది.. నాకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని సత్య ఆలోచనలో పడుతుంది. రుక్మిణి ఆదిత్యని కలుస్తుంది. మనం ఒకచోటుకి వెళ్లాలి అంటే నేను కారులో కూర్చున్నా సీదా మన ఇంటికి తీసుకొచ్చాడని రుక్మిణి చెప్తుంది.  

ఆదిత్య: ఇంటికి తీసుకొచ్చి ఏం చెయ్యాలని నిన్ను బెదిరించాలనా లేక నువ్వు ఉన్నావని ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలనా?

రుక్మిణి: నాకు గదే అర్థం కాలేదు పెనీవీటి..ఇంటి ముంగటకి రాగానే అత్తమ్మ  అగుపించింది. ఎక్కడ నన్ను చూస్తుందో అని ఏమవుతాదో అని మస్త్ పరేషాన్ అయినా.. ఇక అత్తమ్మ నన్ను చూస్తాది అనుకునే టైం కి దేవమ్మని ఇంట్లోకి పొమ్మని నన్ను అక్కడ నుంచి తీసుకెళ్లిపోయాడు.

ఆదిత్య: ఇంటి వరకు తీసుకొచ్చి అమ్మ చూస్తుందని తీసుకెళ్లిపోయాడా.. అంటే నిన్ను భయపెట్టడానికి తీసుకొచ్చాడా.. అయినా ఆ మాధవకి నిన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది

రుక్మిణి: ఆ మాధవ సారుకు నేను మన ఇంటికి పోకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి.. అందుకే ఇసువంటి కథలు పడుతున్నాడు. నువ్వు తన్నినవ్.. నేను అయితే ఏకంగా కారు ఎక్కించి తొక్కించబోయిన అని జరిగింది అంతా చెప్తుంది. మాధవ సారు ఇన్నేళ్ళు బాగానే ఉన్నాడు ఇప్పుడే బుద్ధి గడ్డి తింటుంది. బిడ్డ మొహం చూసి ఊరుకుంటుంటే అది నా బలహీనత అనుకుంటున్నాడు. అందుకే పానం తీస్తా అని చెప్పినా

ఆదిత్య: నేను కొట్టినా నువ్వు తిట్టినా అలాగే ప్రవర్తిస్తున్నాడంటే అసలు ఏం కావాలి వాడికి. తన కూతురుకి తల్లి కావాలని చెప్పి మరో బిడ్డకి తండ్రిని దూరం చేస్తాడా( తన కూతురుకి తల్లి కాదు తనకి నేను కావాలే.. నీకు ఎట్లా చెప్పాలి పెనిమిటి అని రుక్మిణి మనసులో అనుకుంటుంది. అందుకోసం ఎన్ని కథలు పడుతున్నావో ఎంత సతాయిస్తున్నాడో చెప్తే నువ్వు ఊరుకుంటావా వెళ్ళి వాడిని కోస్తావ్ అందుకే గా మాట చెప్పలేకపోతున్నా అని రుక్మిణి మనసులో అనుకుంటుంది ) ఏంటి రుక్మిణి ఏం మాట్లాడవ్. నా బిడ్డ నన్ను ద్వేషిస్తుంది. నా భార్య మరొకరి భార్యగా బతకాల్సి వస్తుంది. అయినా చేతకానీ వాడిలా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోతున్నా

రుక్మిణి: నా కష్టం నీకు కాక ఎవరికి చెప్పుకుంటా.. అందుకే నీకు చెప్తున్నాగాని నిన్ను బాధపెట్టాలని కాదు

ఆదిత్య: నువ్వు నాన్ను బాధపెట్టడం లేదు.. నేనే ఏమి చేయలేకపోతున్నా అని బాధపడుతున్నా. అమ్మకి చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి.. దేవికి మీ నాన్నని నేనే అని చెప్పలేని పరిస్థితి నా రుక్మిణి బతికే ఉందని నాకు తప్ప ఎవరికి చెప్పలేని పరిస్థితి

రుక్మిణి: ఈ బాధలన్నీటికి నేనే పరిష్కారం చూపిస్తా.. బిడ్డని నీకు దూరం కానివ్వను అనేసి వెళ్ళిపోతుంది.

Also Read: తల్లి కాబోతున్న కాంచన- వేద మీద కోపంతో రగిలిపోతున్న మాలిని, బాధలో చిత్ర

నీకు ధైర్యం చెప్పాల్సిన నాకే నువ్వు ధైర్యం చెప్తున్నవా రుక్మిణి అని ఆదిత్య ఫీల్ అవుతాడు. మాధవ కోపంగా జరిగింది అంతా తలుచుకుని రగిలిపోతాడు. మారిపోయింది రాధ పవర్తిగా మారిపోయింది కారుతో నన్నే గుద్దించాలని చూసింది. ఇలాగే ఉంటే పరిస్థితి చెయ్యి జారీ పోతుంది. రాధ నా మాట వినాలంటే ఇంకేదో చెయ్యాలి అనుకుంటుండగా సత్య దేవిని తీసుకుని వస్తుంది. అక్క ఏది అని సత్య అడుగుతుంది. ఎవరో ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడి వస్తా అని వెళ్ళిందని చెప్తాడు.

అక్క ఎక్కడికి వెళ్ళిందని సత్య మరోసారి అడుగుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్ కనిపిస్తే వెళ్ళిందని అంటాడు. నాకు కూడా దేవికి చెప్పినట్టు అబద్ధం చెప్పకూ బావా అక్కకి ఈ ఊరిలో ఫ్రెండ్స్ ఎవరు లేరని నాకు తెలుసు నిజం చెప్పమని అడుగుతుంది. కొన్ని నిజాలు చెప్పాలంటే భర్తకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని అంటాడు. అక్కా బావా అని అభిమానంగా ఉంటున్నావ్ కాబట్టి నిజం చెప్పకుండా నిన్ను పరాయిదాన్ని చెయ్యలేను. ఈ మధ్య రాధ ప్రవర్తన చాలా మారిపోయింది. ఇంటిని నన్ను పట్టించుకోకపోయిన పరవాలేదు కానీ పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు ఎప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు అని అడిగితే ఫ్రెండ్స్ అంటుంది.. తనకి ఫ్రెండ్స్ లేరని నీకే కాదు నాకు తెలుసు. ఉన్నట్టుండి బయటికి వెళ్తుంది ఎక్కడికి అని అడిగితే పని ఉందని చెప్తుంది. ఎవరితో వెళ్తుందో కూడా చెప్పడం లేదు..  ఈ మాట నీకు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు రాధ మన చెయ్యి జారీ పోతుంది. అలా అని గట్టిగా తనని ఆడగలేను ఏమి అనలేను ఎందుకంటే తను బాధపడితే చూడలేను. సత్య రాధ లేకుండా నేను ఉండలేను. కానీ తను నన్ను పట్టించుకోకుండా అలా ఉంటుంటే చాలా బాధగా ఉండని అంటాడు. అక్క దగ్గర ఫోన్ గురించి కనుక్కుందామని నేను వస్తే ఈ మాధవ ఏంటి ఇలా చెప్తున్నాడు. ఇక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఫోన్లు మాట్లాడటం ఉన్నట్టుండి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. అంటే ఫోన్ మాట్లాడుతుంది అక్కతోనేనా.. బయటకి వెళ్తుంది అక్కని కలవడానికేనా అని సత్య మనసులో అనుమానపడుతుంది.

Also Read: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

దేవి ఫోటోకి మీసాలు పెట్టిన ఫోటో దేవుడమ్మ చూస్తుంది. అదేంటో మీసాలతో దేవిని చూస్తుంటే నిన్ను చూస్తునట్టే అనిపిస్తుందని అంటుంది. అది విని ఆదిత్య మురిసిపోతాడు. మాధవ రాధ వైపు కసిగా చూస్తుంటే తిడుతుంది. నాకు ఇక్కడకి రాకముందే ఒక బతుకు ఉందని అంటుంది. నన్ను ఆ విధంగా రోడ్డు మీద వదిలేసి వచ్చావ్ ఏంటి రాధ నేను ఇచ్చిన ఆఫర్ నీకు నచ్చలేదా అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చే ఆఫర్.. నాతో కాదు సారు నన్ను సతాయిస్తే బాగోదని ముందే చెప్పినా కదా.. అని రాధ కోపంగా హెచ్చరిస్తుంది.

          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget