Jagadhatri Serial January 19th - 'జగద్ధాత్రి' సీరియల్: తన కుటుంబాన్ని సేవ్ చేసిన యువరాజ్, మీనన్ ఆట కట్టించిన ధాత్రి టీం
Jagadhatri Serial Today Episode: మీనన్ ఆర్డర్ పాటించకుండా తన కుటుంబాన్ని సేవ్ చేసుకుంటాడు యువరాజ్. ఆపై మీనన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మా డిమాండ్లను తీర్చండి లేదంటే గంట తర్వాత పది నిమిషాలకి ఒక శవాన్ని మీ దగ్గరికి పంపిస్తాను అంటాడు మీనన్. పోలీసులు చెప్తున్నది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు.
ధాత్రి టీం : పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని పోలీసులకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి ధాత్రి వాళ్ల దగ్గరికి బయలుదేరుతారు.
బయటికి వచ్చిన ధాత్రి వాళ్లు మన దగ్గర వెపన్స్ లేవు ఏం చేద్దాం అని ఆలోచనలో పడతారు.
ధాత్రి: మన చీఫ్ ఈపాటికే మన టీం ని పంపించి ఉంటారు అంటూ ఉండగానే అక్కడికి వాళ్ళ టీం చేరుకుంటారు. అప్పుడు ధాత్రి, కేదార్ ఇద్దరు యూనిఫామ్స్ మార్చుకొని బయటికి వచ్చి మిగిలిన ఇద్దరితో లోపల చాలామంది మనుషులు ఉన్నారు ఏ చిన్న మిస్టేక్ జరిగినా గవర్నర్ గారి ప్రాణాలకి అపాయం అందుకే మేము లోపలికి వెళ్తాము మీరు బయట అలెర్ట్ గా ఉండండి అని చెప్పి ధాత్రి, కేదార్ ఇద్దరు మాస్కులు పెట్టుకొని లోపలికి ప్రవేశిస్తారు.
అప్పటికే మీనన్ కొందరు స్టేజ్ మీదకి రండి ఒక గేమ్ ఆడదాం అని ముందు వరుసలో ఉన్న యువరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ ని స్టేజ్ మీదకి తీసుకురమ్మని చెప్తాడు.
యువరాజ్: వాళ్లు మా ఫ్యామిలీ మెంబర్స్ బాయ్ వాళ్ళ జోలికి వెళ్లొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు.
మీనన్ : వాళ్ల ప్రాణాలు పోకుండా చూసే బాధ్యత నాది అని యువరాజ్ కి చెప్తాడు. మనసులో మాత్రం అవసరం అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ నే వదిలిపెట్టను ఇంక వీడి ఫ్యామిలీ ఒక లెక్కా అని అనుకుంటాడు.
యువరాజ్: భాయ్ ని నమ్మటానికి లేదు ఎలాగైనా నా ఫ్యామిలీ మెంబర్స్ ని కాపాడుకోవాలి అనుకుంటాడు.
అంతలోనే స్టేజ్ మీదకు వచ్చిన అందరినీ రౌండ్ గా నిల్చబట్టి వాళ్ళకి ఒక బాల్ ఇస్తాడు మీనన్. దానిని ఒకరికి ఒకరు పాస్ చేసుకుంటూ ఉండండి నేను మ్యూజిక్ ఆఫ్ చేసినప్పుడు ఎవరి చేతిలో బాల్ ఆగిపోతుందో వాళ్లని చంపేస్తాను అంటాడు.
వాళ్లు గేమ్ ఆడుతూ ఉండగానే ధాత్రి వాళ్లు కామ్ గా లోపలికి ప్రవేశిస్తారు.
కేదార్: వాళ్లని చంపేస్తాడేమో అంతకన్నా ముందే మనం మీనన్ ని షూట్ చేద్దాం అంటాడు.
ధాత్రి : వద్దు, ఏ చిన్న పొరపాటు జరిగినా గవర్నర్ ప్రాణాల మీదికి వస్తుంది నేను చెప్పే వరకు వెయిట్ చెయ్యు అంటుంది.
బాల్ ఒకరికి ఒకరు పాస్ చేసుకుంటూ ఉంటే సురేష్ దగ్గర నుంచి బాల్ ని కౌషికి కి ఇవ్వాల్సి వస్తుంది అయితే బాల్ ఎక్కడ కౌషికి చేతిలో ఆగిపోతుందో ఎక్కడ కౌషికిని మీనన్ చంపేస్తాడో అని బాల్ పాస్ చేయకుండా చేత్తో పట్టుకుంటాడు సురేష్. అయితే కౌషికి అతని దగ్గర నుంచి బాల్ లాక్కొని పక్క వాడికి వేస్తుంది అంతలోనే మ్యూజిక్ ఆగిపోవడంతో వాడిని చంపేస్తాడు మీనన్.
ఆ న్యూస్ బయటికి స్ప్రెడ్ అవుతుంది. పోలీసులు ధాత్రి టీమ్ మెంబర్స్ కి ఫోన్ చేస్తారు. మీడియా వాళ్లకి మేం సమాధానం చెప్పుకోలేము ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూసుకోండి అని చెప్తారు.
మళ్లీ బాల్ రివర్స్ లో పాస్ చేయమంటాడు మీనన్. అప్పుడు కౌషికి సురేష్ కి బాల్ ఇవ్వటానికి భయపడుతుంది. కానీ కౌషికి దగ్గర బలవంతంగా బాల్ లాక్కుంటాడు. అప్పుడే మ్యూజిక్ ఆగిపోవడంతో సురేష్ ని చంపటానికి ప్రయత్నిస్తాడు మీనన్. అప్పుడు ధాత్రి వాళ్లు మీనన్ మీద అటాక్ చేస్తారు. గలాటాలో మాస్క్ వేసుకొని ఉన్న యువరాజ్ తన ఫ్యామిలీ పై గన్ గురిపెట్టిన వ్యక్తులంతో ఫైట్ చేసి వెనుక డోర్ ఓపెన్ చేసి ఉంది అక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి వాళ్లని సేవ్ చేస్తాడు.
ఆ తర్వాత మీనన్ టీమ్ మెంబర్స్ అందరినీ చంపేస్తారు ధాత్రి వాళ్లు . మిగిలిన ఇద్దరూ ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తారు పదండి బాస్ కానీ మీనన్ ని లాక్కొని వెళ్ళిపోతారు.
గవర్నర్ గారు మీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు అని చెప్పి ధాత్రి వాళ్ళని అప్రిషియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read : ఈ మౌత్ వాష్లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి