అన్వేషించండి

DIY Mouth Washes : ఈ మౌత్​ వాష్​లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి

Homemade Mouthwash : నోటి శుభ్రతలో మౌత్​వాష్​లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. మార్కెట్​లో మీరు మంచి వాటి​ని వెతుక్కునే బదులు.. ఇంట్లోనే ఎఫెక్టివ్​గా పనిచేసే మౌత్​వాష్​లను తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

Homemade Mouthwash Making Process : నోటి శుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం తీసుకున్నా.. అది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఓరల్ హెల్త్​లో ఎప్పుడు కాంప్రిమైజ్ కాకూడదు. అలా అని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం కొందరికి కష్టంగానే ఉంటుంది. అలాంటివారు ఇంట్లోనే మౌత్​వాష్​లు తయారు చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే వాటితో దంత సంరక్షణలో ఎఫెక్టివ్​గా పనిచేసే, ఎలాంటి హానికరమైన రసాయనాలు లేని మౌత్​వాష్​లు స్వయంగా తయారు చేయవచ్చు. ఇవి మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా.. సహజంగా మీ దంతాలను రక్షిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే మౌత్​ వాష్​లు ఏంటో.. వాటిని ఎలా తయారు చేయాలో.. ఏ సమస్యకు దేనిని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

నోటి పూత ఉన్నప్పుడు పసుపుతో..

పసుపు ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనితో తయారు చేసిన మౌత్​ వాష్ ఉపయోగిస్తే మీకు నోటి పూత, అల్సర్ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. ఈ మౌత్​ వాష్ తయారు చేయడం కోసం 4 లవంగాలను కప్పు నీటిలో నానబెట్టాలి. దానిలో పసుపు, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. అంతే మౌత్​ వాష్ ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంది. దీనిని నోట్లో వేసుకుని కనీసం 30 సెకన్లు పొక్కిలించి.. ఉమ్మేయాలి. ఇలా రెగ్యూలర్​గా చేస్తే నోటి అల్సర్ సమస్య దూరమవుతుంది.

పంటి నొప్పి ఉన్నప్పుడు సాల్ట్ వాటర్

పంటి నొప్పిని తగ్గించుకోవడంలో దీనిని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. సాల్ట్ వాటర్ నొప్పిని, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఉప్పులోని సోడియం కంటెంట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. దంతాల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. టేబుల్ స్పూన్ ఉప్పును.. గ్లాస్​ నీటిలో కలిపితే సాల్ట్ వాటర్ మౌత్​ వాష్ రెడీ. కానీ దీనిని రెగ్యూలర్​గా కాకుండా వారంలో రెండు రోజులు చేస్తే సరిపోతుంది. 

దంతక్షయకు ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ చెడు బ్యాక్టీరియాతో పోరాడి దంత క్షయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే యాపిల్ సైడర్​ వెనిగర్​లో కాల్షియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. దీనికోసం మీరు ఒక గ్లాస్​ నీటిలో రెండు టేబుల్​ స్పూన్ల్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మౌత్​వాష్​ని వారంలో మూడుసార్లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు దక్కుతాయి. 

నోటి దుర్వాసన ఉంటే కొబ్బరి నూనె

ఆయిల్ పుల్లింగ్​ అంటూ ఎన్నో ఏళ్లుగా కొబ్బరి నూనె నోటి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. కానీ దీనికోసం మీరు ప్యూట్ కొబ్బరి నూనె వాడితే మంచిది. ఇది ఓ ఇంటి నివారణగా కూడా చెప్పవచ్చు. కొబ్బరి నూనెను మీ నోట్లో వేసుకిని పదిహేను నిమిషాలు పొక్కిలించండి. ఇది మీ నోటి సంరక్షణలో ఎన్నో మిరాకిల్స్ చేస్తుంది. 

సెన్సిటివిటీని దూరం చేసే సోడా, సాల్ట్

దంతాల సెన్సిటివిటీ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సాల్ట్, బేకింగ్ సోడాతో తయారు చేసుకోగలిగే మౌత్​ వాష్​ మీకు మంచి ఓదార్పు ఇస్తుంది. ఇది యాంటీ బ్యాక్టిరీయల్ లక్షణాలు కలిగి ఉండి మీకు ఉపశమనం అందిస్తుంది. గ్లాస్ నీటిలో అర చెంచా సాల్ట్, అర చెంచా బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీరు వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దానితో నోటిని శుభ్రం చేసుకోవచ్చు. 

చిగురువాపు ఉన్నప్పుడు అలోవెరాతో.. బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు పెప్పర్, లవంగంతో.. తాజా శ్వాస కోసం పిప్పర్ మింట్ ఆయిల్ ఉపయోగించి మౌత్​వాష్​లు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా ఎఫెక్టివ్​గా పని చేసి దంత సంరక్షణలో మెరుగైన ఫలితాలు ఇస్తాయి. 

Also Read : ఛీ ఛీ.. నాచు తినడమేంటి అనుకోకండి.. దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో లెక్కే లేదు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget