అన్వేషించండి

Jagadhatri December 28 Episode: కేదార్‌కి హ్యాండ్ ఇచ్చిన సూరి మామ.. నిజం చెప్పమంటూ తండ్రిని నిలదీస్తున్న యువరాజ్!

Jagadhatri Today Episode: తండ్రిని నిలదీస్తున్న యువరాజ్ ని  కౌషికి వచ్చి వారిస్తుంది అయినా వినక పోవడంతో చెంప దెబ్బ కొడుతుంది. కోపంతో యువరాజ్ గన్ తీయడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.  

Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అతడే నీ తండ్రి అని ఒప్పుకున్నాడా అని అడుగుతాడు సూరి.

ధాత్రి: ఆయన అలా ఒప్పుకొని ఉంటే మేము ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళం కాదు.

కేదార్: ఆయన తన కొడుకు అని సాక్ష్యాలు తీసుకు రమ్మంటున్నారు అంటాడు.

 సూరి: నేను ప్రత్యక్ష సాక్షిని, నా ఎదురుగానే మీ నాన్న మీ అమ్మ మెడలో తాళి కట్టాడు. నా దగ్గర సాక్షాలు ఉన్నాయి  ఇప్పుడే వెళ్లి తీసుకు వస్తాను అని లోపలికి వెళ్తాడు.

యువరాజ్: ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది మా నాన్న గురించేనా అని కోపంతో రగిలిపోతాడు అప్పుడే అతని చెయ్యి తగిలి ఒక ఫోటో కింద పడిపోతుంది ఆ ఫోటో సుధాకర్, కేదార్ వాళ్ళ అమ్మ మరో ఇద్దరు ఫ్రెండ్స్ ది. అది చూసి మరింత  కోపంతో ఆ ఫోటోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

సూరి: గదిలోకి వెళ్ళిన తర్వాత అసలు వచ్చినతను సుహాసిని కొడుకేనా లేదంటే సుధాకర్ సాక్షాల కోసం మరెవరినైనా పంపించాడా అనుకొని వెనక్కి వచ్చి మీ అమ్మ ఫోటో ఉందా అని కేదార్ ని అడుగుతాడు. కేదార్ ఇంట్లో ఉంది ప్రస్తుతం లేదు అని చెప్పడంతో   సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి తన కూతుర్ని తీసుకుని వెనుక ద్వారం గుండా బయటికి వెళ్లిపోతాడు.

ఎంతసేపటికి సూరి బయటికి రాకపోవడంతో ధాత్రి వాళ్లు లోపలికి వెళ్లి వెతుకుతారు. అక్కడ సూరి కనిపించకపోవడంతో

ధాత్రి : నువ్వు సుహాసిని కొడుకువి అవునో కాదో అని డౌట్ వచ్చినట్లుగా ఉంది అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ వరకు వచ్చాం కదా నిజాన్ని తొందర్లోనే తెలుసుకుంటాం అని కేదార్ కి ధైర్యం చెప్తుంది.

మరోవైపు ఆఫీసులో కూర్చొని నేనే కాబోయే సీఈఓ ని అంటూ గొప్పలు మాట్లాడుతూ ఉంటుంది నిషిక. అప్పుడే అక్కడికి వస్తుంది కౌషికి.

కౌశికి : ఏం జరుగుతుంది ఇక్కడ మీ అందరూ  ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ స్టాఫ్ ని మందలించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ని పిలిచి నీకు మేనేజర్ గా ప్రమోషన్ ఇస్తున్నాను అంటుంది.

నిషిక : ఆయనకి ప్రమోషన్ ఇస్తే ఆయన పని ఎవరు చేస్తారు అని అడుగుతుంది.

కౌషికి: నువ్వే చేస్తావు.

నిషిక: ఆయన పని నేను చేయటం ఏంటి అని కోపంగా అంటుంది.

కౌషికి : కంపెనీకి సీఈఓ అవడం అంటే మాటలనుకుంటున్నావా ముందు కంపెనీ గురించి తెలుసుకో పని నేర్చుకో అని చెప్పి అసిస్టెంట్ మేనేజర్ కి  ఈమెకి పని చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అసిస్టెంట్ మేనేజర్ నిషికకి శాలరీస్ బాధ్యత అప్పజెప్తాడు. ఆ పని చేయటం చేతకాక కుడితిలో పడ్డ ఎలుక లాగా కొట్టుకుంటూ ఉంటుంది నిషిక. వాటర్ తాగటానికి క్యాబిన్ నుంచి బయటికి వస్తుంది.

కౌషికి: పొద్దున్న నువ్వు చేసిన పని ఇప్పుడే తెలిసింది అంటూ వాచ్మెన్ కి క్షమాపణ చెప్పమని నిషిక కి చెప్తుంది.

నిషిక కోపంగా అతనికి సారీ చెప్తుంది మనసులో మాత్రం కౌషికి మీద ఇంతకి ఇంత పగ తీర్చుకుంటాను అనుకుంటుంది.

మరోవైపు తండ్రి దగ్గరికి వచ్చిన యువరాజ్ ఈరోజు నీ ఓల్డ్ ఫ్రెండ్ అని కలిశాను పేరు సూరి మామ అంటాడు.

సుధాకర్: చమటలు కక్కుకుంటూ సూరి అనేవాడు నాకు తెలియదు అంటాడు

యువరాజ్: తను సూరి ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన ఫోటో చూపించి ఇది మీ ఫోటో నాకు తెలుసు ఆ పక్కన ఉన్నది కేదార్ వాళ్ళ అమ్మే కదా అందుకే కదా వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు నిజం చెప్పండి అని నిలదీస్తాడు.

ఆ హడావిడి కి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. యువరాజ్ ని మందలిస్తుంది కౌషికి.

యువరాజ్: మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న, కేదార్ నీ కొడుకే అందుకే వాడిని ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్లు కూడా అందుకే ఇంట్లోంచి కదలము అని అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు తర్వాత ఆస్తిలో వాటా అంటారు ఆపై ఆస్తికి అసలు వారసుడు వాడే అంటారు అంటూ తండ్రి మీద కోపంతో రెచ్చిపోతాడు.

ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యువరాజ్ చెంప పగలగొడుతుంది కౌషికి. కోపంతో యువరాజ్ గన్ బయటికి తీస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget