అన్వేషించండి

Chinni Serial Today March 10th: మ్యాడీకి తెలియకుండానే అతని కంపెనీలో జాబ్‌ కొట్టేసిన చిన్ని...దేవా ప్లాన్‌ తెలిసిన నాగవల్లి ఏం చేసింది...?

Chinni Serial Today Episode March 10th:మ్యాడీకి తెలియకుండానే అతని కంపెనీలో జాబ్‌ కొట్టేసిన చిన్ని...దేవా ప్లాన్‌ తెలిసిన నాగవల్లి ఏం చేసింది...?

Chinni Serial Today Episode: తండ్రి వద్ద నుంచి చిన్నిని తీసుకొచ్చిన మ్యాడీ...తన కారులో ఆఫీసు వరకు తీసుకొచ్చి వదిలేస్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లిపొమ్మని అంటే...నేను ఎలా వెళ్తాను నువ్వే మా ఇంటి దగ్గర దింపాలని చిన్ని కోరుతుంది. ఆ మాటలకు కోప్పడిన మ్యాడీ...అది ఎట్టిపరిస్థితుల్లోనూ  జరగదని నువ్వే వెళ్లిపొమ్మని చెప్పి ఆఫీసులోకి వెళ్లిపోతాడు. ఇదే మంచి తరుణమని భావించిన చిన్ని...ఓ ఆటో తీసుకుని తన తండ్రిని దాచిపెట్టిన డెన్‌ కోసం వెతుకుతూ వెళ్తుంది. 

ఇంతలో నాగవల్లి మ్యాడీకి ఫోన్‌ చేసి  ఆఫీసులో అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. బాగా  చిరాకులో ఉన్న మ్యాడీ మూడీగా సమాధానం చెప్పడంతో ఏం జరిగిందని నాగవల్లి నిలదీస్తుంది. ఆ చిన్ని కనిపించిందని అందుకే  చాలా చిరాకుగా ఉన్నానని అంటాడు. ఆఫీసుకు వచ్చిందా అని అడగ్గా...లేదమ్మా నాన్న కారులో తీసుకెళ్తుంటే చూసి వెళ్లానని అంటాడు. చిన్ని నాన్న కారులో వెళ్లడం ఏంటని అడగ్గా....వాళ్ల నాన్నను నాన్నే కిడ్నాప్ చేసి దాచిపెట్టాడని గొడవ చేసిందంటా...అందుకే కారులో తీసుకెళ్లాడని అది చూసి నేను వెళ్లి ఆ చిన్నికి బుద్ధి చెప్పి తీసుకొచ్చేశానని అంటాడు. దీంతో నాగవల్లికి అసలు విషయం అర్థమైపోతుంది. నువ్వు అవేమీ పట్టించుకోకుండా హాయిగా నీ పని నువ్వు చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

కోపంతో ఇంటికి వచ్చిన దేవాను చూసి నాగవల్లి ఏం జరిగిందని అడుగుతుంది. అతను సమాధానం చెప్పకపోయేసరికి ఆ చిన్నిని చంపడం కుదరకపోవడంతో చిరాకులో ఉన్నారా అని అంటుంది. మ్యాడీ చెప్పాడా అని అడగ్గా....ఎవరు చెబితే ఏం ఉంది కానీ ఆచిన్నిని ఎందుకు తీసుకెళ్లారని నిలదీస్తుంది. వాళ్ల నాన్నతో కలిసి ఇద్దరినీ చంపేయడానికే తీసుకెళ్లానని అంటాడు.మ్యాడీ, శ్రేయల పెళ్లి అయ్యేవరకు ఇలాంటి పని చేయవద్దనే కదా మీకు చెప్పింది...మరి ఎందుకు ఈ పనిచేశారని అడుగుతుంది.మరి ఏం చేయమంటావు...ఆ చిన్ని నేరుగా పార్టీ ఆఫీసుకు వచ్చి మానాన్నను మీరే కిడ్నాప్ చేశారంటూ డైరెక్ట్‌గా నన్నే అడిగిందని  అంటాడు.

ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే నా పొలిటికల్ కెరీర్‌ మొత్తం నాశనం అవుతుందని అంటాడు. అందుకే దాన్ని తీసుకెళ్లి వాళ్ల నాన్నతో కలిపి చంపాలని ప్లాన్ చేశానంటాడు. ఇంతలో మ్యాడీ రావడంతో బతికిపోయిందని అంటాడు. మ్యాడీ రావడం వల్ల బతికిపోయింది అది కాదని...మనం అని అంటుంది నాగవల్లి. మిమ్మల్ని రోడ్డుమీదే చూశాడు కాబట్టి వాడు బయటే ఆపేశాడని...అదే మీరు లోపలికి వెళ్లిన తర్వాత వచ్చి చూసి ఉంటే ఏం చేసేవారని ప్రశ్నిస్తుంది. అందుకే మ్యాడీ, శ్రేయల పెళ్లి అయ్యేవరకు ఆగి వాళ్లు హానీమూన్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరినీ చంపేస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం రాదని నాగవల్లి భర్తకు చెబుతుంది.

తండ్రి కోసం వెతుకుతూ ఊరంతా తిరిగిన చిన్నికి  అడ్రెస్‌ తెలియకపోవడంతో ఉసూరుమంటుంది. కరెక్ట్‌గా ఆటో మ్యాడీ వాళ్ల కంపెనీ ఇంకో బ్రాంచ్‌ ముందు ఆగుతుంది. అక్కడ దిగేసి విశ్వప్రసాద్‌గారిని చూస్తుంది. ఆయన్ను పట్టుకుని ఈ కంపెనీలో జాబ్‌ కొట్టేస్తే...మ్యాడీకి దగ్గరగా ఉండొచ్చని అనుకుంటుంది. అలాగే మ్యాడీకి ఆ డెన్‌ అడ్రెస్‌ తెలుసు కాబట్టి మానాన్నను కూడా కనిపెట్టొచ్చని భావిస్తుంది. 

అదేరోజు అసిస్టెంట్ మేనేజర్‌ జాబ్ కోసం ఇంటర్వూలు జరుగుతుండగా...చిన్ని లోపలికి వెళ్లి తన టాలెంట్‌ చూపించి ఆ జాబ్‌ సంపాదిస్తుంది. ఆ ఆనందంతో ఇంటికి వెళ్లి అందరికీ స్వీట్లు పంచుతుంది. తనకు తన భర్త ఆఫీసులోనే ఉద్యోగం వచ్చిందని చెబుతుంది. ఈ మాటలకు ఆమె తల్లిదండ్రులు ఎంతో భయపడతారు. నువ్వు చిన్ని అని తెలిస్తేనే ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని...ఇప్పుడు ఆఫీసులోకి ఎలా రానిచ్చాడని అడుగుతారు. నా భర్తకు తెలియకుండానే ఈ జాబ్ సంపాదించానని చిన్ని అంటుంది. రేపు ఏదైనా జరిగితే ఏం చేస్తాం అని ప్రశ్నించగా...ఆయనకు తెలియకుండా ఆయన కంపెనీలోనే జాబ్‌ కొట్టేసిన దాన్ని ఆయన్ను ఎలా  ఒప్పించాలో నాకు తెలియదా అని అంటుంది. మీరు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దని చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget