Nindu Noorella Saavasam Serial Today march 10th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని అసలు నమ్మొద్దన్న చంభా – చంభాను తిట్టిన భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode march 10th: భాగీ అమర్ కు దగ్గరయ్యేందుకు వచ్చిందని అసలు నమ్మొద్దని చంభా, మనోహరికి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: హాల్లో జుట్టు ఆరబోసుకుంటూ ఉన్న భాగీని వెనక నుంచి చూసిన అమర్‌కు పాత విషయాలు గుర్తుక వస్తాయి. అయినా మనసును కంట్రోల్ చేసుకుంటూ కిందకు రాగానే.. భాగీ కాలు అడ్డుగా పెడుతుంది. దీంతో అమర్ కింద పడబోతూ భాగీని పట్టుకుంటాడు. అప్పుడే తన రూంలోంచి వచ్చిన మనోహరి, చంభా చూస్తారు.. మనోహరి ఇరిటేటింగ్ గా రూంలోకి వెళ్తుంది. వెనకాలే చంభా వెళ్తుంది.
చంభా: నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే నమ్మలేదు. ఇప్పుడు చూడు.. భాగీ వచ్చింది నీకు అమరేంద్రకు పెళ్లి చేయడానికి కాదు.. అమరేంద్రను మళ్లీ తన వైపుకు తిప్పుకోవడానికి
మనోహరి: అంతే అంటావా..?
చంభా: అంతే అంటాను నీకు డౌటుగా ఉంటే వెళ్లి తననే అడిగి చూడు
మనోహరి: అయితే ఇప్పుడే వెళ్లి అడుగుతాను నువ్వు కూడా నాతో రా
ఇద్దరూ భాగీ దగ్గరకు వెళ్తారు. భాగీ రూంలో అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటుంది.
మనోహరి: ఏం చేస్తున్నావు భాగీ నువ్వు
భాగీ: తల దువ్వుకుంటున్నాను
చంభా: ఇప్పుడు కాదు మేడం ఇందాక ఏం చేశారు అని
భాగీ: నేనేం చేశాను
మనోహరి: అమర్‌తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావేంటి..?
భాగీ.. నేనా..?
చంభా: మీరు పడిపోవడం.. సారు పట్టుకోవడం మేము చూశాము
మనోహరి: నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావా..? భాగీ.. నన్ను అమర్‌ను ఒకటి చేస్తానని చెప్పి నువ్వు చేసిన పని ఇదా..?
భాగీ: అంటే నన్నే అనుమానిస్తున్నావా..? మనోహరి.. నన్నే అనుమానిస్తున్నావా..?
చంభా: మీరు అలా చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. మీరు మనోహరి గారిని బకరాను చేస్తున్నారు. పిచ్చి పుల్లమ్మను చేసి చెవిలో పువ్వు పెడుతున్నారు.. మనోహరి గారు వెర్రి వెంగళమ్మ అవుతున్నారు.
మనోహరి: యాదమ్మ నువ్వు ఆపుతావా..? భాగీ అలాంటివి ఏమీ చేయదు
చంభా: మరి సారుతో ఎందుకు అంత చనువుగా ఉందో అడగండి
మనోహరి: చెప్పు భాగీ అమర్‌ను నవ్వు ఎందుకు పట్టుకున్నావు.
భాగీ: నేను పట్టుకోలేదు ఆయనే నన్ను పట్టుకున్నారు..
మనోహరి: అదే ఎందుకు..?
భాగీ: ఎందుకంటే.. నేను అందంగా ఉంటాను.. ఆకర్షణీయగా ఉంటాను.. ముద్దు ఇస్తాను.. పైగా ఆయన భార్యను ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా..?
చంభా: అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం మనోహరి గారు అందంగా ఉండరనా..? చెండాలంగా దరిద్రంగా అసహ్యంగా రేవులో తాటి చెట్టులా ఉంటారనా..?
మనోహరి: యాదమ్మా.. భాగీ అన్ని మాటలు అనలేదు.. నువ్వు ఆపు.. భాగీ నువ్వు చెప్పు నాలో ఏం తక్కువ అయిందని.. నీకంటే బాగానే ఉంటాను కదా..?
భాగీ: నువ్వు అనుకుంటే సరిపోతుందా..?
మనోహరి: మరి ఎవరు అనుకోవాలి..?
భాగీ: ఆయన అనుకోవాలి కదా..?
మనోహరి: అంటే నేను అందంగా లేనా..? నాలో ఆకర్షణ లేదా..?
భాగీ: నిజం చెప్పాలంటే నువ్వు సరిగ్గా మెయింటెన్ చేయడం లేదు మనోహరి అందం మీద కాంసన్‌ట్రేట్ చేయడం లేదు.. నన్ను చూడు ఒక బిడ్డకు తల్లిని అయినా ఇంత స్లిమ్‌గా ఎంత స్టైల్‌గా ఉన్నానో.. నువ్వేమో ఈ ముతక చీర కట్టి పాత ముసలమ్మలా ఉన్నావు.. ఇంక నిన్ను ఎవరు చూస్తారు చెప్పు
మనోహరి: నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను కదా ఇంకెలా ఉండాలి..?
భాగీ: ఫ్యాషన్ గా ఉండాలి.. ట్రెండీగా ఉండాలి. మోడ్రన్ డ్రసెస్ వేసుకోవాలి. టిప్ టాప్ గా రెడీ అవ్వాలి
మనోహరి: కానీ అమర్‌కు అలా ఉండటం నచ్చదు కదా
భాగీ: అని ఎవరు చెప్పారు..?
మనోహరి: అమర్‌కు శారీస్ అంటేనే ఇష్టం
భాగీ: ఒక్కసారి మోడ్రన్‌గా రెడీ అయి ఆయనకు కనిపించి చూడు నచ్చుతావో లేదో తెలుస్తుంది
మనోహరి: అంతే అంటావా..?
భాగీ: ట్రై చేయడంలో తప్పు లేదు మనోహరి ఇదంతా నేను నీ కోసమే చెప్తున్నాను.. ఆయన దృష్టి నా మీద నుంచి నీ మీదకు మళ్లాలి అంటే నీలో సమ్‌థింగ్ చేంజ్ ఉండాలి. నువ్వు స్పెషల్ గా ఉండాలి
అని చెప్పగానే.. మనోహరి సరే భాగీ నువ్వు అన్నట్టు నేను మోడ్రన్‌గా రెడీ అయి అమర్‌కు కనిపిస్తాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















