Jagadhatri December 12th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: ధాత్రి కేదర్‌లను ఇరికించేసిన రిసార్ట్ ఓనర్, యువరాజ్‌లో మొదలైన అనుమానం!
Jagadhatri Today Episode: రిసార్ట్ ఓనర్ ఇంటికి వచ్చి ధాత్రి దంపతుల ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతాడు దాంతో యువరాజ్ కి అనుమానం రావడంతో కథలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పోలీసులు బెదిరించడంతో హత్య నేనే చేశాను అని ఒప్పుకుంటాడు భరత్.
కేదార్: హత్య చేసింది నువ్వైతే నేరాన్ని మాధురి మీదికి ఎందుకు నెట్టాలని చూసావు.
అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు భరత్. గతంలో తను ఫ్రెండ్ ద్వారా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు.
మాధురి: రెండేళ్ల నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ వాడిని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. ఈ విషయం నువ్వే వాడికి చెప్పు అని ఫ్రెండ్ తో చెప్తుంది మాధురి.
కానీ ఆ ఫ్రెండ్ ఇంకో నాలుగు నెగటివ్ మాటలు చేర్చి భరత్ కి చెప్తుంది. కోపంతో రగిలిపోతాడు భరత్. కానీ మాధురి దగ్గరికి వెళ్లి లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అంటాడు. అందుకు ఒప్పుకుంటుంది మాధురి.
భరత్: నా లవ్ నీ యాక్సెప్ట్ చేయకుండా అవమానిస్తావు కదా, అవకాశం దొరికినప్పుడు నిన్ను లైఫ్ లో తలెత్తుకోనీయకుండా చేస్తాను అని మనసులో అనుకుంటాడు .
భరత్ ఈ మాటలు చెప్తుంటే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
మాధురి: నిన్ను ఎంత నమ్మాను అంటూ భరత్ చెంప పగలగొడుతుంది.
పోలీసులు భరత్ ని తీసుకెళ్లి పోతారు. అప్పుడు
కౌషికి : ఇప్పటికైనా అర్థమైందా దివ్యాంక నా చెల్లెలు తప్పు చేయలేదని.
దివ్యాంక: నాకు ఇదంతా కట్టుకథలా అనిపిస్తుంది.
కేదార్: ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడటానికి మీడియాని వాడండి అంతేగాని అమాయకుల మీద ప్రయోగిద్దాం అనుకుంటే ఇలాగే బొక్క బోర్లా పడవలసి వస్తుంది అంటాడు.
ఎప్పుడు ఎలా వాడాలో నాకు తెలుసు అనుకుంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది దివ్యాంక.
నిషిక: భరతే హత్య చేశాడని నీకు ఎలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది.
ధాత్రి : కేదార్ కి తెలిసిన పోలీస్ ఫ్రెండ్ ఉన్నారు ఆయన ద్వారానే తెలిసింది.
నిషిక ఇంకా ఏదో అడగబోతుంటే బిడ్డ ప్రమాదం నుంచి బయటపడింది.. అంతేచాలు అని వైజయంతి అనటంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
మాధురి: థాంక్యూ అన్నయ్య.. పోలీసులు ఇంటికి వచ్చినా, నన్ను గుమ్మం దాటకుండా ఆపేసావు చాలా థాంక్స్. నా సొంత అన్నయ్య కూడా నాకు ఇవ్వని సపోర్టు నువ్వు ఇచ్చావు. వచ్చే జన్మలో అయినా నీకు చెల్లెలుగా పుట్టాలి అంటుంది.
మాధురి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ఇంట్లో స్థానం దొరుకుతుందో లేదో అని భయపడ్డావు.. చూసావా ఇప్పుడు మాధురి మనసులో స్థానం సంపాదించావు అంటుంది ధాత్రి.
కేదార్: నామీద నాకు నమ్మకం కన్నా నువ్వు నన్ను గెలిపిస్తావనే నమ్మకం నాకు ఎక్కువ అంటాడు.
ఆ తర్వాత రిసార్ట్ ఓనర్ ఇంటికి వచ్చి ధాత్రి దంపతులకి థాంక్స్ చెప్తారు.
యువరాజ్: వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి థాంక్స్ చెబుతున్నారు.
రిసార్ట్ ఓనర్: ఈ కేసు విషయంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని బయటకు తీశారు, మా రిసార్ట్ కి వచ్చిన చెడ్డ పేరు తొలగించారు.
ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటే ఈయన ఏమిటి మన గురించి ఇలా మాట్లాడుతున్నారు అని కంగారు పడతారు ధాత్రి దంపతులు.
ధాత్రి : మీరు మరీ పొగిడేస్తున్నారు కానీ మేము చేసింది ఏమీ లేదు.
రిసార్ట్ ఓనర్ : అదేంటి మేడం అలా అంటారు. అక్కడికి వచ్చి క్లూలన్ని కలెక్ట్ చేసి.. మిమ్మల్ని అడ్డుకున్న రౌడీలని చితక్కొట్టారు అని అంటాడు.
నిజం తెలిసిపోతుందేమో అని కంగారు పడతారు ధాత్రి దంపతులు. భాయ్ చెప్పిన పోలీసులు వీళ్ళు గాని కాదు కదా అనుకుంటాడు యువరాజ్.
నిషిక: అయినా మీరు ఎందుకు అక్కడికి వెళ్లారు.. ఆ కేసు మీరు ఇన్విస్టిగేషన్ చేశారా?
మాధురి: నేనే హెల్ప్ చేయమని అడిగాను.
ధాత్రి : కేదార్ కి ఉన్న పోలీస్ ఫ్రెండ్ సహాయంతో ఇవన్నీ తెలుసుకున్నాం.
మరొకసారి థాంక్స్ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిసార్ట్ ఓనర్.
నిషిక : ధాత్రి వైపు చూస్తూ బొద్దింకని చూస్తేనే భయపడతావు.. నువ్వు మనుషుల్ని కొట్టడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో ఆ ఓనర్.
యువరాజ్: మీరిద్దరూ ఎవరిని కొట్టలేదా అని అనుమానంగా ధాత్రిని అడుగుతాడు.
కేదర్: కొట్టింది తను కాదు నేను. ధాత్రిని కామెంట్ చేశాడు.. అందుకే కొట్టాను ఏం తప్పా అని అడుగుతాడు.
వైజయంతి : మీరు వజ్రపాటి వారి ఇంట్లో ఉంటున్నారు.. ఇలా ఎక్కడపడితే అక్కడ గొడవలు పడి ఇంటి పరువు తీయకండి.
సరే అంటుంది ధాత్రి. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాక భాయ్ చెప్పినట్లే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోలీసులు అయి ఉంటారా? ఎందుకైనా మంచిది వీళ్ళ మీద ఓ కన్నేసి ఉంచాలి అని యువరాజ్ అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.