Jagadhatri Serial Today October 24th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి కన్నతల్లి వైజయంతా! మరి సుహాసిని! కేథార్, జగద్ధాత్రికి ఏం తెలిసింది?
Jagadhatri Serial Today Episode October 24th శ్రీవల్లిని ఆశ్రమంలో వదిలింది వైజయంతి అని కేథార్, జగద్ధాత్రికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode శ్రీవల్లి మీద వైజయంతి దొంగతనం నింద మోపుతుంది. ఇంటి నుంచి వెళ్లిపోమని తిడుతుంది. దొంగతనం బిరుదు ఇచ్చారు కదా అదే చాలు అని శ్రీవల్లి బాధతో వెళ్లిపోతుంది. కౌషికితో అక్క ఇక మీకు జీవితంలో కనిపించను అని వెళ్లిపోతుంది.
వైజయంతి దరిద్రం వదిలిపోయింది అని అంటుంది. కౌషికి, సుధాకర్ బాధగా వెళ్లిపోతారు. శ్రీవల్లి ఏడుస్తూ బ్యాగ్ తీసుకొని వెళ్తుంది. కీర్తి పాప చూసి ఏడుస్తుంది. శ్రీవల్లి బయటకు వెళ్లిపోయిన తర్వాతా కేథార్, జగద్ధాత్రి ఇంటికి వస్తారు. కీర్తి పాప బాధగా ఉండటం చూసి ఏమైందని సైగలు చేసి అడుగుతారు. శ్రీవల్లి అక్క ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని వైజయంతి అమ్మమ్మ శ్రీవల్లి బ్యాగ్‌లో డబ్బులు పెట్టేసిందని కీర్తి పాప సైగ చేసి జగద్ధాత్రితో చెప్తుంది. జగద్ధాత్రికి విషయం మొత్తం అర్థమైపోతుంది. అత్తయ్య గారు ఇంత పని చేశారా అని శ్రీవల్లిని వెతకడానికి వెళ్తారు.
కేథార్, జగద్ధాత్రి ఇద్దరూ రోడ్డు మీద వెతుకుతూ ఆశ్రమానికి వెళ్లిందేమో అని వెళ్తారు. అక్కడికి వెళ్లి అడిగితే శ్రీవల్లి రాలేదని చెప్తారు. జగద్ధాత్రి, కేథార్ షాక్ అయిపోతారు. శ్రీవల్లిని ఆశ్రమానికి ఎవరు తీసుకొచ్చారు అని డిటైల్స్ అడుగుతారు. ఆశ్రమం అతను ఫొటో చూపిస్తాను అని ఫైల్ వెతికి చూపిస్తారు. వైజయంతి శ్రీవల్లిని అప్పగించే అప్పటి ఫొటో చూసి బిత్తరపోతారు. వైజయంతికి పెళ్లికి ముందు బిడ్డ పుట్టుండొచ్చు ఆ రహస్యం వల్ల తన పెళ్లికి ఇబ్బంది అవుతుందేమో అని ఇలా ఆశ్రమంలో వదిలేసుంటారని అంటారు. జగద్ధాత్రి, కేథార్ ఫొటోని ఫోన్‌లో తీసుకొని వెళ్లిపోతారు.
జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ పిన్ని అంటే నమ్మలేకపోతున్నాం.. అందుకే శ్రీవల్లిని గెంటేయాలని చూశారని అనుకుంటారు. శ్రీవల్లి ఆశ్రమానికి రాలేదు అంటే టెన్షన్‌గా ఉందని రమ్యకి విషయం చెప్పాలి అని శ్రీవల్లి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని చెప్తుంది. జగద్ధాత్రి, కేథార్ కూడా వెతుకుతూ ఉంటారు. సోషల్ మీడియాలో శ్రీవల్లి ఫొటో వైరల్ కావడంతో ఓ వ్యక్తి శ్రీవల్లిని గుర్తు పడతాడు. వెంటనే రమ్యకి కాల్ చేసి విషయం చెప్పి లొకేషన్ చెప్తాడు. దాంతో రమ్య జగద్ధాత్రికి చెప్తుంది. కేథార్, జగద్ధాత్రి ఇద్దరూ అటుగా బయల్దేరుతారు. శ్రీవల్లి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లినట్లుంది త్వరగా పద కేథార్ అని జగద్ధాత్రి అంటుంది.
శ్రీవల్లి కొండ మీదకు వెళ్లి అమ్మా నన్ను ఎందుకు అనాథని చేశావ్.. నన్ను భరించరాని బాధ పెడుతున్నారు. నన్ను దొంగని చేశారు.. నేను నీ దగ్గరకు వచ్చేస్తా అని దూకేయబోతుంది. ఇంతలో కేథార్, జగద్ధాత్రి శ్రీవల్లిని అడ్డుకుంటారు. మీ అమ్మ కోసం నువ్వు బతకాలి మీ అమ్మ బతికే ఉంది అని అంటారు. ఏ ఆధారంతో చెప్తున్నారు అని శ్రీవల్లి అడిగితే కేథార్ శ్రీవల్లికి ఫొటో చూపిస్తాడు. అది చూసి శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఆశ్రమంలో నన్ను వదిలింది వైజయంతి అమ్మగారా.. అంటే నా కన్నతల్లి వైజయంతి గారేనా అని అంటుంది. ఆవిడ అవునో కాదో తెలీదు కానీ జగద్ధాత్రి అంటుంది. దాంతో శ్రీవల్లి మరి నా దగ్గర ఉన్న ఫొటో ఎవరిది.. అని అంటుంది. ఆవిడ నా కన్న తల్లి అయితే నన్ను గెంటేయాలి అనుకోవడం ఏంటి అని అడుగుతుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని శ్రీవల్లి అంటుంది. ముగ్గురు ఆశ్రమానికి వెళ్తారు. ఆశ్రమంలో గురువుగారికి సుహాసిని ఫోటో గురించి అడిగితే అది వైజయంతి తప్పు దోవ పట్టించడానికి ఇచ్చుండొచ్చు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















