అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today October 24th: నువ్వుంటే నా జతగా: దేవాకి 16 ఏళ్ల జైలు శిక్ష! అల్లుడి కోసం కోర్టులో ట్విస్ట్ ఇచ్చిన హరివర్ధన్!

Nuvvunte Naa Jathaga Serial Today Episode October 24th జడ్జి హరివర్ధన్ లాయర్‌లా మారి దేవా కోసం వాదించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున బోనులోకి వెళ్లి దేవా తన భర్త అని గుడికి వెళ్లి తిరిగి వస్తుంటే దేవా ఓ కుర్రాడిని చితక్కొట్టి కొట్టిన విషయం చెప్తుంది. లాయర్ ఆదిత్య మిథున దేవా భార్య అయినా సరే తను చూసింది చెప్పారు ఇంత కంటే ఇంకేం సాక్ష్యం కావాలి.. రణధీర్ హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.. ఇతనికి శిక్ష వేయాలి అని ఆదిత్య చెప్తాడు.

జడ్జి ఏం తీర్పు ఇస్తారా అని అందరూ అనుకుంటూ ఉంటారు. జడ్జి హరివర్ధన్ దేవా తరుఫు లాయర్‌ని వాదనలు వినిపించమని అంటారు. నా తరుఫున ఎవరూ లాయర్ లేరు సార్ అని  దేవా చెప్తాడు. పీపీని ఏర్పాటు చేయమంటారా అని హరివర్ధన్ అడిగితే వద్దు సార్ అని దేవా చెప్తాడు. ఒకవైపు వాదనలు విని తీర్పు ఇవ్వడం చట్టరీత్యా విరుద్ధం.. అందుకే నీకు ఒక గంట టైం ఇస్తున్నా లాయర్‌లో రావాలని జడ్జి చెప్తారు. 

అందరూ బయటకు వెళ్తారు. శారద ఏడుస్తుంటే మిథున అక్కడికి వెళ్తుంది. నీ పగ తీర్చేసుకున్నావా.. నీ కళ్లు చల్లబడ్డాయా అని శారద అడుగుతుంది. నీలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటారా అనుకున్నా కానీ నువ్వు నా కొడుకు జీవితం నాశనం చేసేశావ్ అని తిడుతుంది. అందరినీ ఎదిరించి నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి నేను చేతులారా చేసుకున్నా.. ఈ చేతులతో ఎన్ని సార్లు అన్నం పెట్టాను.. ఒక అమ్మలా నా ఒడిలో పెట్టుకొని పడుకోపెట్టుకున్నా.. నువ్వు నన్ను అమ్మా అని పిలిస్తే పొంగిపోయా.. నువ్వు నా కన్న కూతురు అనుకున్నా కానీ నమ్మించి మోసం చేస్తావా అని ఏడుస్తుంది. 

భాను కూడా మిథునని తిడుతుంది. నీ ప్రేమ చూసి నేను ఆలోచనలో పడిపోయా.. ఎంత వగలాడివే నువ్వు అని అంటుంది. ముందునుంచి చెప్తున్నా మీరు వినలేదు అని కాంతం అంటుంది. మిథున ఏం మాట్లాడకుండా తల దించుకొని ఉంటుంది. నీ అడుగు పడిన చోటు పచ్చ గడ్డి కూడా భగ్గుమంటుంది. నా కొడుకుని నాకు దూరం చేశావ్.. నువ్వు బాగు పడతావా.. ప్రశాంతంగా ఉంటావా.. ఈ కన్నతల్లి కన్నీటి ఉసురు నీకు తగలకుండా ఉంటుందా.. చూడు నీకు అమ్మలా ప్రేమని పంచిన పాపానికి చివరకు గుండెల్లో పొడిచేశావ్.. ఈరోజు నుంచి నువ్వు ఎవరో నేను ఎవరో..  ఇక నుంచి నీ ముఖం చూపించకు. నా ఇంటి గుమ్మం తొక్కకు అని శారద అనేసి వెళ్లిపోతుంది. 

కోర్టు సీన్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఈ సారి జడ్జిగా మిథున తండ్రి హరివర్ధన్ రాకుండా మరో జడ్జి వస్తారు. అందరూ షాక్ అయిపోతారు. జడ్జి మారిపోయారు ఏంటా అని అందరూ కంగారు పడతారు. ఈ కేసులో ప్రధాన సాక్షి మిథున జడ్జి గారి కూతురు అవ్వడం వల్ల కేసు అతని కుటుంబానికి సంబంధించినది కావడం వల్ల జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా తప్పుకున్నారని కోర్టులో బంటు చెప్తారు. 

కొత్త జడ్జి మళ్లీ కేసు విని ఎమ్మెల్యే గారి అబ్బాయిని దేవా రాజకీయ కక్ష పూర్వకంగానే కొట్టాడని కోర్టు నమ్మిందని జడ్జి చెప్తారు. అందుకు దేవాకి 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. శారద, సత్యమూర్తి, భాను వాళ్లు షాక్ అయిపోతారు. కరెక్ట్‌గా తీర్పు ఇచ్చే టైంకి జడ్జి హరివర్ధన్ లాయర్‌గా ఎంట్రీ ఇస్తారు. అందరూ బిత్తరపోతారు. ఈ కేసులో దేవా తరుఫున నేను వాదనలు వినిపిస్తున్నా అని చెప్తారు. మిథున కూడా షాక్ అయిపోతుంది. ఏం అర్థం కాక అందరూ బిత్తరపోయి చూస్తారు. 

లాయర్ ఆదిత్య ముగిసిపోయిన కేసుకి మళ్లీ వాదనలు అవసరం లేదు అని అంటాడు. దానికి హరివర్ధన్ ఏ కేసులోనూ కేసు రెండు వైపులా వినకుండా తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్తాడు.  హరివర్ధన్ మిథునని ప్రశ్నిస్తాను అని మిథున పెళ్లి ఎలా జరిగిందో చెప్పాలని అడుగుతారు. దాంతో మిథున గుడిలో మా ఆయన నా మెడలో తాళి కట్టాడు అని అంటుంది. మీది ప్రేమ పెళ్లా పెద్దలు కుదిర్చిన పెళ్లా అని తండ్రి మిథునని అడుగుతారు. దాంతో మిథున అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తే ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది ఆ గొడవలో అతను నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు అని చెప్తుంది. బలవంతంగా తాళి కడితే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు కదా.. నీ భర్త రౌడీ కదా నీకు ద్వేషం ఉందా అని అడిగితే మిథున అవును అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 15th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి సపోర్ట్ చేస్తూ మాలిని తుక్కురేగొట్టిన జ్యోత్స్న! మళ్లీ నాటకం అనుకుంటాడా!
Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకున్న రాజు – నందును గుర్తు చేసుకుని బాధపడ్డ వెంకీ
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget