Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 24th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ కోసం విహారి కఠిన దీక్ష! లక్ష్మీ తండ్రికి విషయం తెలిసిపోయిందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 24th లక్ష్మీ కోసం విహారి కఠిన దీక్ష చేయడం అది యమున చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode డెడ్ బాడీ లక్ష్మీది కాదని తెలిసి విహారి హ్యాపీగా ఫీలవుతాడు. లక్ష్మీని ఓ లేడీ కిడ్నాప్ చేసుంటుంది. ఎవరు అనేది తెలీదు.. తన ప్లాన్‌కి లక్ష్మీ చాలా అవసరం అని జాగ్రత్తగా చూసుకోమని ఆ లేడీ రౌడీలకు చెప్తుంది.
యమున లక్ష్మీ కోసం ఏడుస్తూ ఉంటుంది. పండు వచ్చి యమునతో నా చెల్లి లక్ష్మీమ్మకి ఎలా ఆ దేవుడు ఇలాంటి కష్టాలు ఇస్తాడు. ఎవరూ లేని నాకు లక్ష్మీమ్మను ఇచ్చాడు నా చెల్లిని ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడు అని పండు యమునతో చెప్పి ఏడుస్తాడు. లక్ష్మీకి ఏం కాదు వస్తుంది అని యమున అంటుంది. నా చెల్లి లేనప్పుడు మిమల్ని చూసుకునే బాధ్యత నాకు ఇచ్చిందమ్మా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని అంటాడు. తర్వాత వేసుకుంటా అని యమున అంటుంది. ఇంతలో కాదాంబరి, పద్మాక్షి వచ్చి తర్వాత అంటే ఎప్పుడు వేసుకుంటావ్.. పని మనిషి కోసం నువ్వు తిండి నిద్ర మానేసి ఇలా అవ్వడం ఏంటి అని అంటాడు. కాదాంబరి యమునతో మీ ప్రేమలు పని వాళ్ల మీద ఆపేసి సొంతవాళ్ల మీద పెట్టుకోండి.. అది ఎక్కడో బాగానే ఉంటుంది. నువ్వు, విహారి దాని మీద బెంగ తగ్గించుకుంటే మంచిది అని యమున అంటుంది.
విహారి పోచమ్మ దగ్గరకు వెళ్తాడు. పోచమ్మతో నాకు ఒకరి ఆచూకి కావాలి అని అంటాడు. మీరు లక్ష్మీ కోసమే టెన్షన్ పడుతున్నారు అని అర్థమైంది అని అంటాడు. తను నా ప్రాణం పోచమ్మ తను నా భార్య అని మీకు తెలుసుకదా.. తను ఎక్కడుందో మీ శక్తితో తెలుసుకొని చెప్పండి అంటాడు. ఈ విషయంలో నేను ఏం చేయలేను బాబు.. కానీ ఓకే ఒక మార్గం ఉంది.. నీ భార్యను రక్షించి నీ భార్యను నీ దగ్గరకు రప్పించే మార్గం ఒక్కటే.. శివారాధన ఆ శివుడికి మోకాల మీదకు వెళ్లి శివుడి దర్శనం చేసుకొని 108 కావిళ్లతో ఆ శివుడికి అభిషేకం చేస్తే నీ భార్య ఆచూకి తెలుస్తుందని అంటుంది. అలాగే చేస్తాను అని విహారి అంటాడు. ఈ దీక్షని ఎన్ని అడ్డంకాలు ఎదురైనా చేసి తీరుతా అని అంటాడు.
ఎస్‌ఐ లక్ష్మీ కనిపించడం లేదని లక్ష్మీ ఫొటోని అన్ని స్టేషన్లకు వ్యాక్స్ పంపిస్తారు. ఇంతలో సంధ్య పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. వ్యాక్స్ గురించి తెలుసుకొని లక్ష్మీ సొంతఊరు రామచంద్రాపురం కూడా పంపించారా అని అడుగుతుంది. పంపించేశాం అని అంటారు. రామచంద్రపురంలో లక్ష్మీ ఫొటోతో ప్రాసెస్ మొదలు పెడతారు. సంధ్య రామచంద్రపురం బయల్దేరుతుంది. పోలీస్ స్టేషన్ లక్ష్మీ ఆదికేశవుల కూతురు అని తెలిసి ఎంక్వైరీకి అక్కడి ఎస్‌ఐ వెళ్తాడు.
విహారి లక్ష్మీ కోసం దీక్ష మొదలు పెడతాడు. మెట్ల మీద మోకాలు మీద నడుస్తాడు. యమున కంగారుగా ఉందని ప్రశాంతత కోసం చారుకేశవ యమునని గుడికి తీసుకొస్తాడు. యమున, చారుకేశవలు విహారి దీక్షని చూస్తారు. ఇద్దరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ కోసం పూజ చేస్తున్నాడని అనుకొని విహారి కష్టం చూసి బాధ పడతారు. విహారి మోకాల మీద మెట్లు ఎక్కి పరమశివుడిని దర్శించుకుంటాడు. తర్వాత కోనేటి నుంచి కావిడతో నీరు తీసుకొచ్చి చాలా మెట్లు ఎక్కి శివుడికి అభిషేకం చేస్తాడు. కావిడ పట్టుకోవడం రాకపోవడం పైగా చాలా మెట్లు ఎక్కాల్సి రావడంతో విహారి చాలా ఇబ్బంది పడతాడు. కానీ లక్ష్మీ కోసం చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















