Jagadhatri Serial Today July 28th: జగద్ధాత్రి సీరియల్: కథ తిప్పేసిన గిరిధర్ రాజు.. DNA రిపోర్ట్స్, గీత, రాజుల మర్డర్ మిస్టరీకి సంబంధమేంటి?
Jagadhatri Serial Today Episode July 28th జేడీ, కేడీలు రాజు మర్డర్ కేసు తేల్చడానికి వెళ్లి ఓ పోలీస్ అధికారి హస్తం ఉందని గ్రహించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్ ఆదిలక్ష్మీ ముఖానికి ఉన్న బిందె తీసేస్తాడు. ఆదిలక్ష్మీ ఇంట్లో అందరితో ఈ రోజుతో మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది. బాబు మీ బాబు అని నిరూపించకపోతే బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తానని అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌సు కౌషికితో రాజు కేస్ సాల్వ్ అయితే ఈ సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని అంటుంది.
జేడీ, కేడీలు రాజు తమ్ముడిని రాజు ఇంటికి పిలిపించి రాజు ఇళ్లు వెతకాలని నువ్వు ఉంటే బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు వెతకడం ఎందుకు అని ఆయన అడిగితే అతను రాజు డీఎన్‌ఏ టెస్ట్‌లు మార్చి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నాడని ఇలాంటి వాళ్లు నేరుగా డబ్బులు తీసుకుంటారు. ఆ ఫేక్ డిఎన్‌ఏ రిపోర్ట్ చేసిన వాళ్ల డిటైల్స్ ఎక్కడో ఒక చోట రాసుకొని ఉంటారని చెప్పి మొత్తం వెతుకుతారు. రాజు ఇంట్లో డబ్బు దొరుకుతుంది. తర్వాత ఓ డైరీ కనిపిస్తుంది. అందులో యువరాజ్ 50 వేలు ఇచ్చినట్లు గుర్తిస్తారు. ఇక యువరాజ్ పేరు కంటే ముందు ఎస్‌ఐ గిరిధర్ రాజు అని పేరు ఉంటుంది. అతని వల్లే ఈ కేసుకి సంబంధించి అన్ని డిటైల్స్ తెలుస్తాయని అనుకుంటారు.
శ్రీనివాస్‌తో మీ అన్నయ్య డైరీ తీసుకెళ్తానని జేడీ, కేడీలు చెప్తారు. ఇక ఇన్‌స్పెక్టర్ రాజు దగ్గరకు వెళ్తారు. ఓ కేసు గురించి మాట్లాడటానికి వచ్చామని గిరిధర్ రాజుకి చనిపోయిన రాజు కేసు గురించి చెప్పడంతో ఇన్‌స్పెక్టర్ చెమటలు పట్టేస్తాడు. గిరిధర్ రాజు తనకు ఏం తెలీదు అంటే మరి ఎలా ఫేక్ డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఎలా చేయించారు.. ఆ రోజు కారులో వచ్చింది కూడా మీరే అని సీసీ టీవీ ఫుటేజ్ ఉందని అంటుంది. గీత ఎవరు.. గీత ఎందుకు చనిపోయింది.. ఆమె చేతి మీద రాజు అని ఎందుకు ఉంది అని అంటారు. గిరిధర్ రాజు చాలా కంగారు పడతారు. సరే మేం చెప్తాం అని జేడీ, కేడీలు చెప్పడం మొదలు పెడతారు.
గిరిధర్ రాజుతో మీకు పెళ్లి అయి 10 ఏళ్లుఅయింది. పిల్లలు లేరు. మీకు గీతకి అక్రమ సంబంధం ఉంది. మా గెస్ ప్రకారం గీత తన కొడుకుకి మీకు తండ్రిగా ఉండమని అడిగారు. అలా చేస్తే మీ భార్యకి విషయం తెలిస్తే కష్టమని గీతని చంపేశారు. మరి రాజుకి డీఎన్ఏ రిపోర్ట్స్‌కి సంబంధం మాకు తెలీదు మీరు చెప్పండి అంటారు. గిరిధర్ జేడీ, కేడీలతో ఈ కేసు నుంచి నాకు తప్పించుకోవడం తెలుసు మీరు వెళ్లండి అంటాడు. జేడీ కేడీ బయటకు వచ్చేస్తారు. గిరిధర్ మనలో ఒకడు కాబట్టి అన్ని లూప్ హోల్స్ తెలుసు మనమే జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంటారు.
పోలీస్ స్టేషన్ దగ్గరకు ఓవ్యక్తి వచ్చి గిరిధర్ తాడు కొన్నారని బిల్ అని వస్తాడు. జేడీ, కేడీలు అది విని గీతని కొట్టి పొడిచి చంపారు చనిపోకపోవడంతో తాడుతో గొంతు బిగించి చంపేశాడని డీఎన్‌ఏ రిపోర్ట్స్‌లో వచ్చింది కదా అనుకుంటారు. ఇక జేడీ, కేడీలు అతనికి సాయం అడుగుతారు. అతను లోపలికి వెళ్లి చెరువు దగ్గర మీరు రాజు, గీతని చంపడం నేను చూశా అంటాడు. గిరిధర్ వాళ్లు క్రిమినల్స్ అందుకే చెప్పా అనేస్తాడు. మాకు అర్థమైంది అంటూ జేడీ, కేడీలు వస్తారు. గిరిధర్‌ని లాగిపెట్టి కొట్టి నిజం అడుగుతారు. గీతకి తనకు బాబు పుట్టాడని గీత పెళ్లి చేసుకోమని గోల చేసిందని.. దాంతో బాబు నాకే పుట్టాడు అని గ్యారెంటీ ఏంటి అని అడుగుతాడు. డీఎన్ఏ టెస్ట్ చేద్ధామని రిపోర్ట్స్ ఫేక్ ఇప్పించానని అయినా గీత గోల చేయడంతో గీతని చంపేశానని పదిలక్షలు డిమాండ్ చేసిన రాజుని చంపేశానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















