Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి పద్మాక్షి సవాలు.. 24 గంటల్లో 70 కోట్లు తీసుకొస్తానన్న లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode july 28th లక్ష్మీతో పద్మాక్షి 24 గంటల్లో 70 కోట్లు రికవరీ చేయమని చెప్పి షరతు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున విహారితో నువ్వు సహస్ర సంతోషంగా ఉండాలి.. మీ మధ్య మూడో మనిషి రాకూడదు అని లక్ష్మీని ఉద్దేశించి చెప్తుంది. ఆ మాటలు విన్న లక్ష్మీ నిద్ర పోతున్న యమున దగ్గరకు వచ్చి యమున కాళ్లు పట్టుకొని మీరు నాకు దేవుడి కంటే ఎక్కువమ్మా.. మీరు విహారిగారితో చెప్పినట్లు విహారిగారు, సహస్రమ్మల సంసారానికి నేను ఎప్పుడూ అడ్డు పడనమ్మా అని ఏడుస్తూ చెప్తుంది.
యమునని చూస్తూ మీరు నావల్ల ఎప్పటికీ బాధ పడకూడదు.. నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ కుటుంబం నా వల్ల ఎప్పటికీ విడిపోదు.. మీరు విహారిగారు ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాలి అమ్మా.. మీరు నా వల్ల ఎన్నటికీ కుమిలిపోయేలా ప్రవర్తించనమ్మా అని ఏడుస్తుంది. కాళ్లు పట్టుకొని లక్ష్మీ ఏడ్వటంతో లక్ష్మీ కన్నీరు కాలిపై పడి యమునకు మెలకువ వస్తుంది. లక్ష్మీని చూసి యమున కాళ్లు వెనక్కి లాగేస్తుంది. వద్దు లక్ష్మీ అంటుంది. పర్లేదు అని లక్ష్మీ అంటే వద్దు అని యమున అంటుంది. ఏంటమ్మా మీకు సేవ చేసే భాగ్యం కూడా నాకు లేదా అని అడుగుతుంది.
యమున ముఖం తిప్పేసి వెళ్లి నీ పనులు చూసుకో లక్ష్మీ నేను ఈ రోజు పనులు చేయలేను అవి నువ్వే చూసుకో అంటుంది. ఇంతలో వసుధ వచ్చి లక్ష్మీని పంపేస్తుంది. లక్ష్మీ ముఖం చూడటానికి కూడా యమున ఇష్టపడదు. లక్ష్మీ బట్టలు ఆరేయడానికి వెళ్తుంటే పద్మాక్షి లక్ష్మీని పిలుస్తుంది. ఏంటే ఏం తెలీనట్లు చక్కగా కలివిడిగా అటూ ఇటూ తిరిగేస్తున్నావ్.. నువ్వు కలివిడిగా తిరగడానికి నువ్వు ఇంకా పోయిన మొత్తాన్ని రికవరీ చేయలేదు అని అంటుంది. దాంతో లక్ష్మీ త్వరలోనే ఆ 70 కోట్లు వెనక్కి తీసుకొస్తా అని అంటుంది. నువ్వు కొట్టేసిన డబ్బు నువ్వే తెస్తా అంటున్నావా అని అంటుంది.
విహారి పద్మాక్షితో ఎవరో తన వేలిముద్రలు తీసుకున్నారని తన తప్పు లేదని పోలీసులు క్లీయర్‌గా చెప్పారు కదా అని అంటాడు. దానికి పద్మాక్షి ఎవరో తన వేలిముద్రలు తీసుకుంటుంటే ఎండీ స్థానంలో ఉండి అంత సోయ లేకుండా ఉందా అని ప్రశ్నిస్తుంది. సహస్ర మనసులో అమ్మ ఎందుకు ఇప్పుడు ఆ వేలిముద్రల గురించి అడుగుతుంది అని అంటుంది. ఎలా అయినా ఆ డబ్బు తీసుకొస్తా అని లక్ష్మీ అంటే 24 గంటల్లో తీసుకురావాలి నేను నా అల్లుడంత మంచిదాన్ని కాదు. గడువు లోపు డబ్బు తీసుకురాకపోతే ఏం చేయాలో అది చేస్తా అని పద్మాక్షి అంటుంది. అంబిక మనసులో మా అక్క ఏంటి పడుకున్న సింహాన్ని నిద్ర లేపుతుంది అనుకుంటుంది.
విహారి అయితే 24 గంటల్లో రికవరీ అంటే కష్టమని అంటాడు. ఇలాగే అడగాలి అని పద్మాక్షి అంటుంది. సహస్ర, అంబికలు అది అన్నంత పని చేస్తుంది.. దాన్ని రెచ్చగొట్టొద్దని అనుకుంటారు. లక్ష్మీ పద్మాక్షితో ఆ డబ్బు రికవరీ చేయడమే కాదు దాని వెనక ఎవరు ఉన్నది అనేది కూడా కనిపెట్టి సాక్ష్యాలతో సహా తీసుకొస్తా అంటాడు. విహారి కూడా పద్మాక్షితో సవాలు చేస్తాడు. వేలిముద్రలు తీసుకున్న వారిని వెనకుండి మనల్ని ఇంత దెబ్బ కొట్టిన వారిని నీ కాళ్ల ముందు ఉంచుతా అని అంటాడు.
అంబిక మనసులో లక్ష్మీ, విహారిలు కనిపెట్టేస్తేతే అంతా తనని పట్టుకునే టైంకి సహస్రని ఇరికించేస్తా అనుకుంటుంది. లక్ష్మీ, విహారి, చారుకేశవలు ఓ చోటకు చేరి ఆ డబ్బు ఎలా రికవరీ చేయాలా అనుకుంటారు. ఆ డబ్బు మన కష్టం.. ఎంతో మంది నమ్మకం ఎలా అయినా మనం ఆ డబ్బు వెనక్కి తీసుకురావాలని అనుకుంటారు. ఇంతలో ఎస్‌ఐ సంధ్య వస్తుంది. హ్యాకర్ ఏమైనా చెప్పాడా అని విహారి అడిగితే లేదని ఎస్‌ఐ చెప్తుంది. వాడు నోరు విప్పితేనే మనకు సమాధానం దొరుకుతుందని లక్ష్మీ అంటుంది. ఇక థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిందే అని ఎస్‌ఐ అంటుంది. చారుకేశవ ఎస్ఐతో మా శత్రువులు ఎవరో మాకు తెలియాలి.. కచ్చితంగా మీరే ఆ హ్యాకర్‌తో నిజం చెప్పించమని అంటాడు.
ఎస్‌ఐ హ్యాకర్‌ని చితక్కొడుతుంది. నాకు తెలీదు మేడం సెల్ కంపెనీలకు వెళ్లిన డబ్బు మీర రికవరీ చేయలేరని హ్యాకర్ అంటాడు. ఎస్ ఐ చితక్కొట్టడంతో తనతో ఈ పని చేయించిన వాళ్లు సెల్ కంపెనీల నుంచి హవాలా మార్గంలో ఆ 70 కోట్లు ఇక్కడికి రప్పించుకుంటున్నారా అని చెప్తాడు. హవాలాలో ఎప్పుడు డబ్బు వస్తుందని ఎస్‌ఐ అడిగితే ఈ రోజే అనే చెప్తాడు. ఇక ఎస్‌ఐ వెంకట్ అనే ఆఫీసర్‌కి కాల్ చేసి సిటీలో ఎక్కడ హవాలా జరుగుతుందో నెట్ వర్క్ వాడి చెప్పమని అంటుంది. వెంకట్ తన వాళ్లకి ఫోన్ చేసి 70 కోట్ల హవాలా ఈ రోజు జరుగుతుందని సిటీ చివరిలో జరుగుతుందని చెప్పి అడ్రస్ పెడతాడు.
అంబిక ఈరోజు తమకు డబ్బు వస్తుందని ఆ డబ్బు వాడుకొని విహారిని కిందకి పడేస్తానని తాను స్థానంలోకి వెళ్లి అన్ని తన దారిలోకి తీసుకొస్తానని అంటుంది. ఇక సుభాష్‌కి కాల్ చేస్తుంది. అంతా కరెక్ట్‌గా జరుగుతుందని డబ్బు మన చేతికి వచ్చేస్తుందని అంటాడు. అంతా నేను చూసుకుంటా డబ్బు రాగానే ఫోన్ చేస్తా అని సుభాష్ అంటాడు. త్వరలోనే నాకు పూర్వవైభవం రాబోతుందని అంబిక అనుకుంటుంది. సంధ్య తన టీమ్‌తో ఆ చోటుకి బయల్దేరుతుంది. విహారికి కాల్ చేసి విషయం చెప్తుంది. లక్ష్మీని తీసుకొని రమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















