అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today July 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: కిటికీ నుంచి పడ్డ వల్లీ.. ప్రేమని బతకనిచ్చేలా లేదే.. మరీ ఇంత శాడిజం ఏంట్రా బాబు..!!

Illu Illalu Pillalu Serial Today Episode July 28th ప్రేమ, ధీరజ్‌లు కిటికీ నుంచి ఇంటి లోపలికి వచ్చారని వల్లీ లొల్లి పెట్టి ప్రేమకి శిక్ష పడేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode గయ్యాలి గంప వల్లీ రూలింగ్ ఇంట్లో సాగుతుంటుంది. ఇద్దరు తోటి కోడళ్లను టార్చర్ చేయాలని శ్రీవల్లి ప్రతీ చిన్న అవకాశాన్ని వాడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే రాత్రి పది అయితే తలుపులు క్లోజ్ అనే రూల్‌తో ప్రేమ, ధీరజ్‌లను బయటే ఉంచేస్తుంది. 

ఇదే నీ రాజమార్గం అలా వదిలేయ్..

ధీరజ్ ఆకలిగా ఉందని ఇంటిలోపలికి వెళ్లేలా చేయమని ప్రేమని అడగటంతో ప్రేమ కిటికీ విప్పేసి మరీ ధీరజ్‌ని లోపలికి తీసుకెళ్తుంది. కిటికీ నుంచి ప్రేమ కిందకి దిగలేకపోవడంతో ధీరజ్ ప్రేమని పట్టుకొని దింపుతాడు. ఈ టైంలో ఇద్దరి మధ్య రొమాన్స్ చోటు చేసుకుంటుంది. ప్రేమ అయితే ధీరజ్‌నే చూస్తూ తడబడుతుంది. ఇక ధీరజ్ మళ్లీ స్క్రూలు బిగిస్తుంటే ప్రేమ వద్దని రోజు లేటుగా వస్తావు కదా ఇదే నీకు రాజమార్గం అలా వదిలేయ్ అంటుంది. దాంతో ధీరజ్ వావ్ వాటే ముందు చూపు.. సరే కానీ నాకు బాగా ఆకలేస్తుంది. నేను స్నానం చేసి వస్తా నవ్వు  వడ్డించేయ్ తినేస్తా అంటాడు. 
 
నేనేమైనా పెళ్లాన్నా? వస్తువులు వడ్డించవు.. 

ధీరజ్ వడ్డించమనగానే ప్రేమ ‘నీకు వడ్డించడానికి నీనేమైనా నీ పెళ్లాన్నా? వస్తువుని అన్నావ్ కదా .. వస్తువులు వడ్డించవు.. నీకు నువ్వే వడ్డించుకుని తిను’ అని అంటుంది. అది కాదే.. ఇంతకు ముందు నువ్వే వడ్డించేదానివి కదే.. నిద్ర వస్తుందని చెప్పినా.. బ్రతిమిలాడి తినిపించేదానివి కదా.. మరి ఇప్పుడేంటి? ఇలా చేస్తున్నావ్ అని ధీరజ్ అంటాడు. దాంతో  ప్రేమ ‘హా.. ఇంతకు ముందు నేను నీ గురించి వేరే ఊహించుకున్నానులే అందుకే.. నీ విషయంలో నేను అంత సిన్సియర్‌గా ఉన్నాను. కానీ తమరు నేనో వస్తువుని ఉపదేశం ఇచ్చారు కదా.. మరి ఆ వస్తువుకి తగ్గట్టే ఉండాలి.. మనం తీసుకొచ్చి పడేసిన వస్తువులు.. ఒక పక్కన పడుంటాయ్ సార్.. ప్రేమగా వడ్డించి.. మురిపముగా తినిపించవు’ అని తిప్పికొట్టేస్తుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్.. టార్చర్ పెట్టడంలో పీహెచ్‌డీలు చేసినట్టున్నావ్ కదే రాక్షసి.. అని వెళ్లిపోతాడు. 

శ్రీవల్లి చిందులు.. 

ఉదయం శ్రీవల్లి ప్రేమ, ధీరజ్‌లను బయట ఉంచేశానని రాత్రి మొత్తం ధీరజ్‌తో కలిసి బయట పడుకొని దోమలు కుట్టించుకొని ఇబ్బంది పడుంటుదని తెగ ఆనంద పడిపోతూ ‘వై.. వై.. వై.. వయ్యారి.. వైరల్ వయ్యారి’ అంటూ డాన్స్ చేస్తుంటుంది. ప్రేమ బాధ పడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అనుకుంటుంది. అచ్చి బాబోయ్ బాబోయ్.. పెత్తనం తీసుకున్న మొదటి రోజే తోడికోడళ్లకి దిమ్మతిరిగి బొమ్మ చూపించాను. ఎంత సంతోషంగా ఉందో అని సంబరపడిపోతూ తలుపులు తీస్తుంది. అయితే ప్రేమ, ధీరజ్ కనిపించకపోవడంతో ఏమైపోయారు ప్రేమపక్షులూ.. వాళ్ల ఏడుపు మొహాలు చూసి నేను ఆనంద పడాలి కదా అంటూ వాళ్ల కోసం బయట మొత్తం వెతుకుతుంది. అనుమానం వచ్చి  ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల గదికి గడియ పెట్టడం చూసి డోర్ కొడుతుంది. 

నీ గోల ఏంటి అక్కా..

ప్రేమ లేచి డోర్ తీసి వల్లిని చూసి ప్రశాంతంగా నిద్రపోతుంటే.. పొద్దు పొద్దున్నే ఏంటక్కా నీ గోల అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి.. కోపంగా ప్రేమ వైపు చూసి.. నేను ఇప్పుడే తలుపులు తెరిచాను కదా.. మీరు ఇంటి బయట కదా ఉండాలి.. లోపలికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. ‘ఏమో నాకు గుర్తులేదు.. రాత్రి నువ్వు బయటకు నెట్టేశావ్.. తెల్లారేసరికి ఈ గదిలో నిద్రపోతున్నా.. నువ్వు వచ్చావ్.. ఏం జరిగిందో నేను ఇక్కడికి ఎలా వచ్చానో అస్సలు గుర్తులేదు.. పోయి పని చూసుకో’ అని ప్రేమ అంటుంది. అయితే శ్రీవల్లి గదిలో ధీరజ్ పడుకోవడం కూడా చూస్తుంది. ప్రేమ ఎంత పొమ్మాన్నా శ్రీవల్లి వెళ్లకుండా ధీరజ్ ఎలా వచ్చాడు అని అడుగుతుంది. నువ్వే ధీరజ్‌ని లేపి అడుగు లేదంటే ధీరజ్ లేచే వరకు డోర్ ముందు కూర్చొ అని ప్రేమ సెటర్ వేసి డోర్ వేసేస్తుంది.  

గయ్యాలికి తిక్క కుదిరిందోచ్..

ప్రేమ తన ముఖం మీదే డోర్ వేసేయడంతో శ్రీవల్లి రగిలిపోతుంది. ఇంటి పెత్తనం మొత్తం నాదే అయితే నా ముఖం మీదే డోర్ వేస్తుందా ఎంత ధైర్యం దీనికి చెప్తా దీని సంగతి అని అనుకుంటూ ఇంతకీ వీళ్లు లోపలికి ఎలా వచ్చారు అని అని ఆలోచిస్తూ కిటికీ మీద చేయి వేసి బొక్కా బోర్లా పడుతుంది. అమ్మా అబ్బా అనుకుంటుంది.  కాస్త బొద్దుగా ఉంటా కదా ఏ ఎముక విరిగిందో అని కుయ్యో మొర్రో అనుకుంటుంది. వెంటనే మామయ్య గారండీ మామయ్య గారండీ అని పిలిచి గోల గోల చేస్తుంది. 

శిక్ష వేయాలి మామయ్యగారండీ.. 

రామరాజుతో పాటు అందరూ అక్కడికి రాగానే చూశారా.. చూశారా.. ఏమైందో.. కిటికీ విప్పేశారు అని చెప్తుంది.  ఎవరు ఇలా చేసింది అని రామరాజు అడిగితే ఇంటి దొంగలు అని వల్లి చెప్తుంది. ఇంటి దొంగలా? ఎవరు? అని రామరాజు అడిగితే ‘ఇంకెవరూ ప్రేమా.. మీ చిన్న కొడుకు ధీరజ్’ అని చెప్పేస్తుంది. దాంతో రామరాజు పంచాయితీ పెడతారు. ఇక శ్రీవల్లి మామయ్యతో ‘చూశారా మామయ్య గారండీ.. వీళ్లు ఏం చేశారో.. నాకు మీరు అప్పగించిన పెత్తనం ప్రకారం రాత్రి 10 గంటల లోపే ఇంటికి రావాలని ఆర్డర్ వేశాను.. కానీ వీళ్లు మీ మాట వినేదేంటి తొక్కా అంటూ కిటికీ నుంచి లోపలికి వచ్చారంటే.. మీ మాట అంటే విలువ లేనట్టే కదా. వీళ్లు చేసిన తప్పునకు ఇప్పుడే శిక్ష వేయాలి లేదంటే భవిష్యత్‌లో ఇంకా పెద్ద తప్పులు చేస్తారండీ. చివరికి చొక్కా చిరిగేది మీకే. అది చూసి నేను తట్టుకోలేనండి మామయ్య గారండీ.. తట్టుకోలేను. ప్రేమ కారణంగా మరోసారి మీకు అవమానం జరగకుండా ఉండటానికి ప్రేమకి నేను శిక్ష వేయాలని అనుకుంటున్నా అని అంటుంది. ప్రేమ, నర్మదల్ని శ్రీవల్లిని ఎదురిస్తే మామయ్యనే ఎదురిస్తారా అని అంటుంది. ఇక రామరాజు అయితే వల్లి మాటకి సరే అంటాడు.  

ప్రేమకి శిక్ష వేసిన వల్లి..

శ్రీవల్లి ప్రేమకి స్టోర్ రూం క్లీన్ చేయమని చెప్తుంది. దాంతో ప్రేమ నేను చేయను  అంటుంది.  దాంతో వల్లి ‘మామయ్య గారండీ’ అని పిలుస్తుంది. దాంతో ప్రేమ పని చేయడానికి రెడీ అవుతుంది. నర్మద కోపంతో వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget