Nuvvunte Naa Jathaga Serial Today july 28th: నువ్వుంటే నా జతగా సీరియల్: జడ్జి ఇంట్లో మిథున, దేవాల మధ్య ఏం జరిగింది? సత్యమూర్తి సంతోషానికి కారణమేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode july 28th మిథున దేవాని తన గదికి తీసుకెళ్లడం త్రిపుర మామయ్యతో రౌడీ అల్లుడి స్థానంలో ఇంటికి రావడం గురించి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా ఇద్దరూ హరివర్ధన్ ఇంటికి వెళ్తారు. లలిత దేవా, మిథునలకు హారతి ఇచ్చి ఆహ్వానం పలుకుతుంది. హరివర్ధన్ లోపలికి వెళ్లిపోతాడు. త్రిపుర, రాహుల్ కూడా వెళ్లిపోతారు. ఇక అలంకృత అక్కని బావని గుమ్మం దగ్గర ఆపి పేర్లు చెప్పుకొని రావాలని అంటుంది. మిథున నేను మా ఆయన దేవా వచ్చాం అని చెప్పేస్తుంది.
దేవాని కూడా చెప్పమని అలంకృత అడుగుతుంది. బావ మౌనవ్రతానికి వచ్చినట్లు ఇలా ఉంటారేంటి పేరు చెప్తేనే ఇంట్లోకి ఎంట్రీ అని ఆపుతుంది. మిథున చెల్లితో ఏంటి మా ఆయన్ని బెదిరిస్తున్నావ్ మా ఆయన ఏదీ చెప్పరు ప్రతీది కళ్లతోనే చెప్తారు అంటుంది. అలంకృత మాత్రం ఒప్పుకోదు. ఇంటి అల్లుడిని ఇంత సేపు బయటే ఉంచకూడదు అని మిథున చెప్పి చెల్లిని అడ్డు తప్పిస్తుంది. దేవా ఇంట్లో అడుగు పెట్టబోతూ మిథునని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మామ తనకు గన్ గురి పెట్టడం వరకు అన్నీ గుర్తు చేసుకొని వెనక్కి వెళ్లిపోతాడు.
మిథున భర్త చేయి పట్టుకొని సైగలతోనే పిలిచి లోపలికి తీసుకెళ్తుంది. ఇక త్రిపుర గదిలో తన భర్త మీద అరుస్తుంది. నువ్వే వేస్ట్ అన్నయ్యవి. వేస్ట్ ఫెలోవి.. ఒక రౌడీ గాడు నీ చెల్లి మెడలో తాళి కడితే ఏం చేయలేకుండా చూస్తూ కూర్చొన్నావ్.. ఇప్పుడు ఆ రౌడీ ఇంటికి అల్లుడి హోదాలో వచ్చినా కూడా ఏం చేయలేకపోతున్నా ఛీ సిగ్గనిపించడం లేదా నీకు అని తిడుతుంది. రాహుల్ ఎంత చెప్పినా త్రిపుర వినకుండా ఈ విషయం ఎవరితో తేల్చుకోవాలో వాళ్లతో తేల్చుకుంటా అని హరివర్ధన్ దగ్గరకు వెళ్తుంది.
మిథున దేవాని తన గదికి తీసుకెళ్లి అదే తన ప్రపంచం అని తన తండ్రి ఆ గదిని అంతఃపురం అని తనని యువరాణి అనే వారని నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ముందు రోజు వరకు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఫొటోలన్నీ ఉన్నాయిని వాటిని చూపిస్తుంది. పదో తరగతి నుంచి యూఎస్‌లో ఎమ్‌ఎస్ చేసే వరకు అన్నీ మెడల్స్ ట్రోఫీలు చూపించి మిథున చాలా ఎగ్జైట్ అయిపోతుంది. దేవా మాత్రం ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. మిథున ఎగ్జైట్మెంట్‌లో నా లైఫ్ టైం డ్రీమ్ ఏంటో తెలుసా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని ఇంకొన్ని రోజుల్లో వెళ్లే దాన్ని కానీ.. అని దేవాని చూసి ఆగిపోతుంది. దేవా తనవల్లే అని బాధతో అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ ఒక్క రోజు కొన్ని క్షణాలు నా జీవితాన్ని తారు మారు చేసేశాయి.. నన్ను నా ప్రపంచం నుంచి ఆ పరమేశ్వరుడు నన్ను నీ ప్రపంచంలోకి నెట్టేశారు అని అంటుంది.
త్రిపుర హరివర్ధన్ దగ్గరకు వెళ్తుంది. మామయ్య మీకు నా మీద కోపం వచ్చినా పర్లేదు.. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ మీ నిర్ణయం నాకు నచ్చలేదు. ఆ రౌడీ గాడు మన ఇంటికి రావడానికి మీరు ఒప్పుకోవడం ఏంటి మామయ్య.. వాడి గురించి ఆలోచిస్తేనే రగిలిపోయే మీరు వాడి మంచితనానికి మీరు వాడిని అల్లుడిగా ఒప్పుకున్నారా.. మిథున అడిగిన ప్రతీ సారి గడువు ఇస్తున్నారు. నాకు తెలిసి మీరు మిథున జీవితం విషయంలో బ్యాలెన్స్ తప్పుతున్నారు అని అంటుంది. లేదు నేను కరెక్ట్‌గానే ఉన్నాను. మిథున తీసుకొన్న నిర్ణయం తప్పని తనకి తెలిసొచ్చాలా చేయబోతున్నా.. ఆ దేవా తనకి కరెక్ట్ కాదని తెలిసేలా చేస్తున్నా.. మిథునకు ఎంత చెప్పినా వినని మిథునకు ఈ వారం దేవా వల్ల ఎంత ప్రమాదం ఉందో తెలుస్తుంది. వాడు రౌడీ వృత్తి మానేయడం జరగని పని.. అలాంటి వాడు మంచోడని మిథున ఎలా నిరూపిస్తుంది.. మిథున ఓడిపోతుంది. దేవా తనకి కరెక్ట్ భర్త కాదని తెలిసేలా చేస్తాను అని అంటాడు.
మిథున దేవాకి పార్వతి పరమేశ్వరులను చూపించి పార్వతి దేవిని అందరూ స్మశానంలో ఉన్న వాడితో నీ జీవితం ఎలా బాగుంటుందని అడిగారు కానీ పార్వతి దేవి పరమేశ్వరుడిని నమ్మింది. నేను అంతే మన ఇద్దరి ప్రపంచాలు వేరు అయినా నీతో జీవితం బాగుంటుందని నేను నమ్మాను. నీతో సహా అందరూ నన్ను పిచ్చిదానిలా చూశారు. నా కుటుంబం నన్ను వెలివేసింది. అయినా నేను ఈ తాళి తీయలేదు. ఈ బంధం నా జీవితానికి కచ్చితంగా మంచి చేస్తుందని నా నమ్మకం అని దేవాకి చెప్తుంది. ఆ పార్వతి పరమేశ్వరులే నాకు మంచి వాడిని భర్తగా ఇచ్చారని అంటుంది. మిథున మాటలకు దేవా చాలా ఇబ్బంది పడి పక్కకి వెళ్లిపోతాడు. నా భర్త నా కోసం ప్రాణం ఇస్తాడు. నాకు ఇంత కంటే ఏం కావాలి అని ఎమోషనల్ అయిపోతుంది. నేను ఓడిపోతానని మా నాన్న అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఈ బంధం విషయంలో నేను ఓడిపోలేదు ఇప్పుడు కూడా ఓడిపోను అని అంటుంది.
సత్యమూర్తి మిథునని దేవా తీసుకురావడం ఇంట్లో అందరూ సంతోషంగా కూర్చొని తిరగడం అన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. శారద వచ్చి మీ ముఖంలో ఇన్నిరోజులు కనపడిన వెలతి చెదిరిపోయినట్లు ఉందండి అంటుంది. అవును శారద నాకు వెలతి పోయి వెలుగు వచ్చిందని.. దేవా వల్ల నాకు పుత్రోత్సాహం కలిగింది.. లోలోపల ఒక తండ్రిగా నా చిన్న కొడుకు గొప్పతనం తలచుకొని గర్వపడుతున్నా.. రాముడి పాదం తాకి రాయి మనిషి అయిన కథ రామాయణంలో జరిగింది. మళ్లీ అలాంటి కథే మన ఇంట్లో జరిగింది. మన ఇంట్లో కుడి కాలు పెట్టిన నా కోడలు మిథున రాయిలాంటి నా కొడుకుని మనిషిలా మార్చింది. భార్య కోసం రాములోడిలా నా కొడుకు తెగువ చూసి పొంగిపోయాను. బండరాయిలా ఉన్న నా కొడుకుని మిథున శిల్పంలా మార్చేసింది. నాకు ఇంత సంతోషం ఇచ్చింది పూర్తిగా మిథునదే. మిథున దేవాని మార్చడమే కాదు ఈ ఇంటిని కూడా దేవాలయం చేసిందండీ అని శారద, సత్యమూర్తి ఇద్దరూ సంతోషపడతారు.
మిథున దేవా కోసం వంట చేస్తుంది. మిథున మటన్ వండటం చూసి అలంకృత కళ్లు తిరిగి పడిపోతుంది. అక్క ఇది మర్డర్ కంటే ప్రమాదంగా ఉందక్కా.. నువ్వు ఇంట్లో నాన్ వెజ్ వండితేనే ఆ రోజు తినవు.. గది దాటి కూడా రావు అలాంటిది ఇప్పుడు మటన్ వండుతున్నావ్ నాకు చాలా షాకింగ్‌గా ఉంది అని అంటుంది. దానికి మిథున దేవాకి నాన్ వెజ్ ఉండాలి అందుకే వండుతున్నా అంటుంది. ఇక లలిత మిథునతో దేవా కోసం నువ్వు చాలా మార్చుకున్నాం దేవా కూడా నీ కోసం మారుతాడు ఆ నమ్మకం నాకు వచ్చేసింది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















