Chinni Serial Today july 28th: చిన్ని సీరియల్: ఒకరి కోసం ఒకరు వెతుకుంటున్న మహి, చిన్ని.. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇద్దరూ కలిశారా?
Chinni Serial Today Episode july 28th మహి, మధు ఇద్దరూ గుడిలో ఒకరి కోసం ఒకరు వెతకడం దేవా మహిని చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి, చందు, లోహిత కలుస్తారేమో వాళ్ల జాడ అయినా తెలుస్తుందేమో అని మధు ఆంజనేయ స్వామి గుడికి వస్తుంది. మరోవైపు మహి కూడా చిన్ని కనిపిస్తుందేమో అనే ఆశతో అదే గుడికి వచ్చి అందరికి చిన్ని ఫొటో చూపించి అందరినీ అడుగుతాడు.
మహి చిన్ని ఫొటో చూస్తూ ఎక్కడున్నావ్ చిన్ని.. నాకు కనిపిస్తావని ఎంతో ఆశతో ఉన్నా.. ప్లీజ్ కనపడు చిన్ని అని కన్నీరు పెట్టుకుంటాడు. ఇంతలో చిన్ని గుడి దగ్గరకు వస్తుంది. మనసులో క్షమించండి నాన్న రాజమండ్రిని ఇక్కడి మనుషుల్ని జ్ఞాపకాల్ని మర్చిపోతానని మీకు మాటిచ్చా కానీ ఎందుకో ఈ రోజు అందరూ ఎంతో గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను.. మీ మాట తప్పినందుకు నన్ను క్షమించు నాన్న అనుకుంటుంది. మహి, మధు ఇద్దరూ రెండు వైపులా వెతుకుతూ ఉంటారు. మహి గతంలో చిన్ని కోసం ఆంజనేయస్వామి విగ్రహం తీసుకొచ్చిన విగ్రహం దగ్గరకు వెళ్లి నాకు చిన్ని అంటే ప్రాణం నా ప్రాణాలు కాపాడిన చిన్ని కోసమే బతుకుతున్నా నాకు చిన్ని కనిపించేలా ఆశీర్వదించు స్వామి అని కోరుకుంటాడు.
మరోవైపు లోహిత గుడికి వచ్చి ఇద్దరు రౌడీలను పిలిపించి మధుని వదలొద్దని వాళ్లతో చెప్తుంది. ఇద్దరు రౌడీలు మధు చుట్టూ తిరుగుతూ బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం ఇస్తావని నీ చుట్టూ తిరుగుతున్నాం.. గట్టిగా ఉన్న వాళ్లని పట్టుకొని వలలో వేసుకొని వాళ్ల మీద మోజు తీరిపోతే వదిలేస్తా కదే అని అంటారు. మధు పక్కనే ఉన్న కర్ర తీసుకొని వాళ్లని చితక్కొడుతుంది. దెబ్బకి వాళ్లు వాళ్లతో పాటు లోహిత కూడా పారిపోతుంది.
మహి ఆంజనేయ స్వామి దగ్గర అందరూ నిమ్మకాయ దీపాలు పెట్టడం చూసి ఏంటని అడుగుతాడు. ఇలా దీపం పెడితే కోరికలు తీరుతాయని ఒకామె చెప్పడంతో మహి సంతోషంగా చిన్ని కోసం కోరుకొని దీపం పెడతాడు. ఇక మధు పంతులు దగ్గరకు వెళ్లి సత్యంబాబు కుటుంబానికి సంబంధించి ఎవరైనా వస్తున్నారా అంటే తన తండ్రి చనిపోయారని 5 ఏళ్ల క్రితం నుంచే తను పూజారిగా పనిచేస్తున్నానని తనకు తెలిసి ఎవరూ రావడం లేదని పంతులు చెప్తారు.
మహి మనసులో ఈ రోజు నాకు మంచి జరుగుతుందని చెప్పారు. చిన్ని కనిపించడం కంటే మంచి నాకు ఇంకేం ఉండదు.. ఈ రోజు చిన్ని కనిపించేలా చేయు స్వామి అని వేడుకుంటాడు. మహి వెళ్లిన ప్రతీ చోటుకి మధు వెళ్తుంది. తన వాళ్ల ఆచూకి తెలీలేదని చాలా బాధ పడుతుంది. తన వాళ్లు ఆచూకి తెలిసేలా చేయమని వేడుకుంటుంది. ఇక ఆంజనేయ స్వామి దగ్గర మహి పెట్టిన దీపం కొండెక్కే టైంకి మధు చూసి చేతులు అడ్డుపెడుతుంది. ఇద్దరూ ఒకరికి తెలీకుండా ఒకరి కోసం ఒకరు మొత్తం వెతుకుతారు. మధు తులసికోటని చూసి మహి తులాభారం గుర్తు చేసుకుంటుంది. మహి కోసం త తాను తులసీదళం వేయడం గుర్తు చేసుకొని ఎక్కడున్నావ్ మహి ఎలా ఉన్నావ్ అనుకుంటుంది.
ఇంతలో ఎవరో చిన్ని అని పిలవగానే మహి, మధు ఇద్దరూ పరుగులు తీస్తారు. గుడి మొత్తం వెతుకుతారు. అప్పుడే దేవేంద్ర వర్మ అటుగా వచ్చి మహిని చూస్తాడు. ఓ వ్యక్తి ఆయన కూతురిని చిన్ని అని ఎత్తుకోవడం చూసి మహి ఓవైపు మధు ఓ వైపు కన్నీరు పెట్టుకుంటారు. ఇదే టైంలో కొండ గుహల్లో ధ్యానంలో ఉన్న ఓ స్వామీజీ సడెన్‌గా కళ్లు తెరిచి చూసి ఏంటి స్వామి ఎందుకు ఆ పిల్లలతో ఇలా ఆడుకుంటున్నావ్.. వాళ్లని ఒకరి కోసం మరొకరిని పుట్టించావ్ కదా ఎందుకు ఇలా దూరం చేస్తున్నావ్.. ఆ పిల్లాడు చిన్ని కోసం తపస్సే చేస్తున్నాడు. వాళ్లని దూరం చేసిన నువ్వే వాళ్లని కలపాల్సిన బాధ్యత నీదే కదా స్వామి అని అంటారు. మనుషుల్ని విడదీసి వినోదం చూడటం ఆపి వాళ్లని కలిపే పని చేయొ స్వామి అని శివలింగాన్ని వేడుకుంటారు. అక్కడున్న గుడి గంటలన్నీ ఆ పరమశివుడే ఆమోదం తెలిపినట్లు గంటలు మోగుతాయి. వాళ్లని అనుగ్రహించావా స్వామి అని ఆయన దండం పెట్టుకుంటారు.
దేవేంద్ర వర్మ నాగవల్లితో మహి గుడికి వెళ్లాడని చెప్తుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. మహిని ఇలా వదిలేస్తే పిచ్చోడు అయిపోతాడని ఇలా వదిలేయకూడదు అని అంటుంది. ఇద్దరూ మహిని పిలుస్తారు. గుడికి ఎందుకు వెళ్లావని అడుగుతారు. మీకు ఎలా తెలుసు అని మహి అడిగితే దేవా తాను చూశానని చెప్తాడు. దాంతో మహి తనకు ఆస్ట్రాలజీ నోటిఫికేషన్‌లో ఈ రోజు మంచి జరుగుతుందని వచ్చిందని చిన్ని కనిపించడం కంటే నాకు మంచి ఏముంటుంది అందుకే చిన్నిని వెతకడం కోసం వెళ్లానని చెప్తాడు. దాంతో దేవా మహి నీకు ఏమైనా పిచ్చా అని తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















