Jagadhatri Serial Today November 16th: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్, ధాత్రిని చంపబోయి వేరేవాళ్లను చంపిన మీనన్ - ఇంటికి వచ్చిన మధుకర్ లీగల్ అడ్వైజర్
Jagadhatri Today Episode: తమను టార్గెట్ చేసిన మీనన్ వేరే వాళ్లను చంపుతుంటే కేదార్, ధాత్రి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: కేదార్, ధాత్రి రూంలోకి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెతుకుతుంటారు. సర్టిఫికేట్ దొరకదు. కానీ ఎస్ ఎస్ ఎం సీ అనే ఫైల్ దొరుకుతుంది. కానీ అందులో మాత్రం మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండదు. మరోవైపు యువరాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్ కాలుస్తాడు. మీరు వెతుకుతున్న సర్టిఫికెట్ కాలిపోతుందిరా.. కేదార్ అంటాడు యువరాజ్. ఇక ఈ వజ్రపాటి వంశానికి నువ్వే వారసుడివిరా అబ్బోడా..? అంటుంది వైజయంతి. మరోవైపు రూంలోంచి బాధగా ఇద్దరూ బయటకు వస్తారు. తర్వాత కేదార్ వైజయంతి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో టీవీలో ఇద్దరు యోగా టీచర్లను మర్డర్ చేశారని న్యూస్ వస్తుంది. సుధాకర్ వాళ్ల ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇంతలో యువరాజ్‌కు ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. ధాత్రి, కేదార్ కూడా ఆ న్యూస్ చూసి ఆలోచికస్తారు.
ధాత్రి: ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దర్ని చంపి ఇద్దరిని వదిలేశారు. అది కూడా ముసలి వాళ్లను వదిలేసి యంగ్ గా ఉన్న వాళ్లను చంపేశారు. పైగా ఏమీ దోచుకోలేదు. అంటే హంతకుడికి కావాల్సింది వాళ్ల ప్రాణాలు మాత్రమే. కేదార్ ఈ రెండు మూడు వారాల్లో ఇలాంటి మర్డర్స్ రెండు జరిగాయి కదా..? అవి ఏ డేట్స్ లో జరిగాయో ఏదైనా న్యూస్ పేపర్ లో ఉందేమో తీసుకురా చూద్దాం.
అని ధాత్రి చెప్పగానే కేదార్ న్యూస్ పేపర్స్ తీసుకొస్తాడు. పేపర్స్ లో మూడు మర్డర్స్ జరిగిన ఇండ్ల ముందు మనం కారు పార్కింగ్ చేశాము. అని డౌటుగా ఆ మర్డర్ జరిగిన ఇంటికి వెళ్తే వివరాలు తెలుస్తాయి అనుకుని ధాత్రి, కేదార్ ఆ ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న ముసలావిడను అడిగి వివరాలు తెలుసుకుంటారు. మీనన్ మనుషులు దేవా వచ్చి తన కొడుకు కోడలును చంపారని చెప్తుంది.
ధాత్రి: అయితే వాళ్లు చంపాలనుకుంది పోలీసులను.
బామ్మ: అవునమ్మా.. పోలీసులు అనుకుని నా కొడుకు కోడలిని చంపేశారమ్మా..
కేదార్: మరీ ఇంతకీ మీ దగ్గర గన్ ఎందుకు ఉందమ్మా..
బామ్మ: ఆ గన్ మా ఆయనది ఆయన రిటైర్ పోలీస్. లైసెన్స్ ఉన్న గన్నే.. అంత మంది మీదకు వచ్చే సరికి మా అబ్బాయి వెళ్లి ఆ గన్ తీసుకొచ్చాడు.
అని చెప్పగానే ఆ ముసలావిడను ఓదార్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు కేదార్, ధాత్రి. మరోవైపు మీనన్ దగ్గరకు యువరాజ్ వెళ్తాడు.
యువరాజ్: నమస్తే భాయ్ ఏంటి అర్జెంట్‌గా కలవమన్నారు.
మీనన్: చెప్తాను యువరాజ్. ఆ జేడీ కేడీలు నా తమ్ముణ్ని చంపినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. వాడు పై నుంచి నన్ను చేతకాని వాడిలా చూసి నవ్వుతున్నట్లు ఉంది యువరాజ్. ఆ జేడీ, కేడీలు మీ ఏరియాలోనే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది.
యువరాజ్: మా ఏరియాలోనా..?
మీనన్: ఆ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారంతో వాళ్లను మేమే చంపాము. కానీ వాళ్లు జేడీ, కేడీలు కాదని తెలిసింది. టార్గెట్ మిస్ అవుతున్న కొద్ది నాకు చాలా అవమానంగా ఉంది యువరాజ్. అందుకే ఈ సారి నేనే రంగంలోకి దిగుదామనుకుంటున్నాను.
యువరాజ్: ఎలా ఏం చేయబోతున్నారు.
మీనన్: మీ చెల్లెలి పెళ్లి ఉంది కదా..? ఆ పెళ్లికి ఆ ఏరియాలో ఉన్న వాళ్లు అందరూ వస్తారు కదా..?
అని మీనన్ చెప్పగానే సరేనని పనిలో పనిగా ఆ కేదార్ గాణ్ని కూడా లేపించేస్తే అయిపోతుంది అనుకుంటాడు యువరాజ్. మరోవైపు మధుకర్ లీగల్ అడ్వైజర్ రాజ్ కుమార్ ఇంటికి వచ్చి మధుకర్ తన ఆస్థుల గురించి వీలునామా రాశారని చెప్తాడు. అందులో ఆయన ఆస్థులు అన్ని తన కూతురు కౌషికి పేరు మీద వ్రాశారని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!