అన్వేషించండి

Jagadhatri Serial Today July 15th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి, కేదార్లను అనుమానించిన కౌషికి – ధాత్రిపై పగపెంచుకున్న త్రిపాఠి

Jagadhatri Today Episode: రాత్రంతా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్లారని కౌషికి, కేదార్ , ధాత్రిలను అడగడంతో డైలమాలో పడిపోతారు వారు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: గెటప్‌ మార్చి దుబాయ్‌ పారిపోతున్న యువరాజ్‌ను  ధాత్రి, కేదార్‌ చేజ్‌ చేసి పట్టుకుంటారు. ఇంతలో మరో పోలీస్‌ ఆఫీసర్‌ త్రిపాఠి వచ్చి మీరిప్పుడు సస్పెన్షన్‌లో ఉన్నారు. యువరాజ్‌ను నేను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తాను. అని యువరాజ్‌ను తీసుకెళ్తుంటే యువరాజ్‌ తప్పించుకుని పారిపోతాడు. జేడీ నిన్ను వదలను అంటూ చాలెంజ్‌ చేసి ఎస్కేప్‌ అవుతాడు. మరోవైపు పాస్ ఫోర్ట్‌  ఇవ్వడానికి వెళ్లిన కమలాకర్‌ ఇంకా రాలేదేంటని వైజయంతి ఎదురు చూస్తుంటుంది. కమలాకర్‌, యువరాజ్‌కు ఫోన్‌ చేస్తుంది. ఎవ్వరూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయరు. ఇంతలో కమలాకర్‌ వస్తాడు. ఆయనతో పాటు కారులో వచ్చిన నిషికను చూసి షాక్‌ అవుతుంది వైజయంతి.

నిషిక: అత్తయ్యా..  యువరాజ్‌… అత్తయ్యా..

వైజయంతి: నిషి ఏమైంది అమ్మీ నువ్వు మళ్లీ వెనక్కి ఎందుకు వచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు.

కమలాకర్‌: రాక్షసి జేడీ ఉండగా మనం ఏదైనా చేయాలనుకోవడం తప్పే వదిన

వైజయంతి: అంటే..

నిషిక: నేను యువరాజ్‌ వెళ్తుంటే ఆ జేడీ వచ్చి మమ్మల్ని దుబాయ్‌కి పోకుండా ఆపేసింది అత్తయ్యా..

వైజయంతి: అమ్మీ నా అబ్బోడికి ఏమీ కాలేదు కదా? నీకేం కాలేదు కదా?

నిషిక: మాకేం కాలేదు అత్తయ్యా ఆ జేడీ మమ్మల్ని దుబాయ్‌ పోకుండా ఆపేసింది అత్తయ్యా.. కానీ నాకెందుకో భయంగా ఉంది అత్తయ్యా.

వైజయంతి: మరిది వెంటనే ఆడికి పోదాం పద.. అబ్బోడు తప్పించుకున్నాడో లేదో చూద్దాము. లేదంటే ఆ జేడీ అబ్బోడిని ఏం చేస్తుందో ఏమో.. పద మరిది పోదాము

కమలాకర్‌: వదిన యువరాజ్‌ వారి నుంచి ఎలాగైనా తప్పించుకుంటాడు. మనం అక్కడికి వెళ్లితే కొత్త ప్రాబ్లమ్‌ వస్తుంది.

 అంటూ వైజయంతిని ఓదార్చి లోపలికి తీసుకెళ్తాడు కమలాకర్‌. మరోవైపు సాధు ఆఫీసులో త్రిపాఠి మీద సీరియస్‌ అవుతుంటాడు. ప్రతిసారి నువ్విలాగే చేస్తున్నావు అనగానే ఈ కేసును త్వరలోనే కంప్లీట్‌ చేసి నేనేంటో నిరూపిస్తాను అని వెళ్లిపోతాడు. జేడీ ఓటమి కోసమే పని చేస్తానని త్రిపాఠి మనసులో అనుకుంటాడు. తర్వాత యువరాజ్‌ను ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది అని సాధు చెప్తాడు. మరోవైపు నిషిక, వైజయంతి, కమలాకర్‌ జేడీ గురించి మాట్లాడుకుంటారు.

నిషిక: ఒక అడుగు ముందుకు వేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి ఆ జేడీ అడ్డుపడుతుందేంటి మామయ్యా..

వైజయంతి: ఆ జేడీ కానీ అడ్డు పడకుండా ఉండి ఉంటే ఈ పాటికి మీరు దుబాయ్‌ వెళ్లిపోయి ఉండేవారు.

కమలాకర్‌: యువరాజ్‌ జేడీకి దొరకలేదు సంతోషించు వదిన.. జస్ట్‌ మిస్‌ అయ్యాడంట అంతే

నిషిక: ఆ జేడీని ఏదో ఒకటి చేసి ఆపాలి మామయ్యా.. లేదంటే నన్ను యువరాజ్‌ ను దేశం దాటనివ్వదు.

వైజయంతి: ఆ అమ్మీ చాలా బలవంతురాలు నిషి. ఆ అమ్మిని కొట్టాలంటే కౌషికిని రెచ్చగొట్టి జేడీ మీదకు పంపించాలి.

   అని అందరూ కలిసి ప్లాన్‌ చేస్తుంటారు. ఇంతలో కౌషికి లోపలి నుంచి వస్తుంది. బయటి నుంచి ధాత్రి, కేదార్‌ వస్తారు. వాళ్లిద్దరూ ఒకటే రూంలో ఉండొద్దని నిషిక కేదార్‌, ధాత్రి లను ప్రశ్నిస్తుంది. కౌషికి కూడా అంతే కదా అంటుంది. దీంతో బూచి కేదార్‌, కాచి ధాత్రి ఒక రూంలో పడుకోండని చెప్తుంది వైజయంతి. దీంతో అయిష్టంగానే ధాత్రి, కేదార్‌ వాళ్ల రూములలోకి వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: 'కల్కి 2898 ఏడీ' సక్సెస్‌పై స్పందించిన ప్రభాస్‌ - సెకండ్‌ పార్ట్‌పై ఆసక్తికర కామెంట్స్‌, ఏమన్నాడంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
Highcourt Judges: తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు
తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు
Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Crime News: ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP DesamPawan Kalyan Gokulam Concept | పాడిరైతుల జీవితాలను మార్చే గోకులాలు | ABP DesamKTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
Highcourt Judges: తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు
తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు
Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Crime News: ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
ప్రేమజంట పారిపోయేందుకు సాయం! - మహిళను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించేశారు, సత్యసాయి జిల్లాలో అమానవీయం
Crime News: పతంగులు నింపిన విషాదం - గాలిపటాలు ఎగరేస్తూ వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మృతి
పతంగులు నింపిన విషాదం - గాలిపటాలు ఎగరేస్తూ వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు మృతి
Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
Crime News: పండుగ పూట తీవ్ర విషాదాలు - పై అంతస్తు నుంచి పడి బాలుడు దుర్మరణం, చిన్నారిని కబళించిన కారు ప్రమాదం
పండుగ పూట తీవ్ర విషాదాలు - పై అంతస్తు నుంచి పడి బాలుడు దుర్మరణం, చిన్నారిని కబళించిన కారు ప్రమాదం
Embed widget