Jagadhatri Serial Today December 19th: ‘జగధాత్రి’ సీరియల్: ఆస్థి కోసం వైజయంతి కొత్త నాటకం - వైజయంతి నాటకాన్ని పసిగట్టిన ధాత్రి
Jagadhatri Today Episode: ఆస్తి కోసం కోర్టుకైనా వెళ్తామని ధాత్రి బెదిరించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: వీలునామాలో ఎలా ఉందో అందరం అలాగే పాటిద్దామని జగధాత్రి చెప్తుంది. లేదంటే.. కోర్టుకు వెళ్లాల్సిందే అంటుంది. జగధాత్రి మాటలకు వైజయంతి కోపంగా కోర్టుకు వెళ్లాలా అంటుంది. ఇంతలో వైజయంతికి పక్షవాతం వస్తుంది. అందరూ కంగారు పడుతుంటారు. ధాత్రి, కేదార్ హాస్పిటల్‌కు వెళ్దాం అంటారు. ఏమీ వద్దని పది నిమిషాల్లో డాక్టరే ఇక్కడకు వస్తాడు అని ఫోన్ చేస్తాడు. వెంటనే డాక్టర్ ఇంటికి వచ్చి వైజయంతికి ట్రీట్‌మెంట్ చేసి పేషెంట్‌ను జాగ్రత్తగా చూసుకోమని.. ఆవిడ టెన్షన్ పడకుండా చూసుకోండని చెప్తాడు. మీరు చూసుకోలేని పరిస్థితి ఉంటే మా హాస్పిటల్‌లో జాయిన్ చేయండి అని చెప్తాడు.
ధాత్రి: అవసరం లేదు డాక్టర్ గారు ఇంట్లోనే ఉంచుకుని మేము జాగ్రత్తగా చూసుకుంటాము.
నిషిక: మీరు చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు జగధాత్రి. అసలు మా అత్తయ్యకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు. తను మళ్లీ మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది.
కేదార్: ధాత్రి పిన్నికి కోపం తెప్పించే పనులు చేస్తాను అనడం లేదు నిషిక. సేవ చేస్తాను అంటుంది. హాస్పిటల్ లో ఉంచి పిన్నికి ఎలా ఉందోనని టెన్షన్ పడటం కంటే ఇక్కడే మన కళ్ళ ముందు ఉంచుకోవడం బెటర్ కదా
నిషిక: మీరు అత్తయ్యకు చేసిన సేవలు చాలు కేదార్.
కౌషికి: అదేంటి నిషి అలా మాట్లాడతావు.. పిన్నికి పెరాలసిస్ రావడానికి ధాత్రి, కేదార్ లే కారణం అన్నట్లు మాట్లాడుతున్నావు.
నిషిక: అవును వాళ్లే కారణం. ఇంకా చెప్పాలంటే మీరు కూడా కారణం
అంటూ తిడుతుంది నిషిక. సుధాకర్ నిషికను తిట్టి లోపలికి పంపిస్తాడు. మరోవైపు డాక్టర్ కు యువరాజ్ డబ్బులు ఇచ్చి మేము హాస్పిటల్‌కు వెళ్లి ఉంటే మా అమ్మకు పెరాలసిస్ లేదని తెలిసిపోయేది అంటూ థాంక్స్ చెప్తాడు. డాక్టర్ పర్వాలేదు అని డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. అంతా గమనించిన నిషిక యువరాజ్‌ను నిజంగా పెరాలసిస్ రాలేదా…? అని అడుగుతుంది. అవునని ఈ కారణంతో ధాత్రి, కేదార్‌లకు ఆస్థి కాదు కదా..? ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేయాలి అని చెప్తాడు. యువరాజ్, నిషిక నవ్వుతూ మాట్లాడుకోవడం కాచి, బూచి చూస్తారు. వీళ్లేంటి పెద్దమ్మకు పక్షవాతం వస్తే నవ్వుకుంటున్నారు విషయం ఏంటో తెలుసుకుందాం పద అని దగ్గరకు వెళ్తారు. కాచి, బూచిలను చూసిన యువరాజ్, నిషిక బాధపడుతున్నట్లు నాటకం ఆడతారు. మరోవైపు వైజయంతిని రూంలోకి తీసుకెళ్లి పడుకోబెడతారు ధాత్రి, కేదార్.
వైజయంతి: నా కొడుక్కు దక్కాల్సిన ఆస్థి ఈ దిక్కుమాలినోడికి దక్కకుండా చేస్తాను. రెండు రోజుల్లో నాకు సేవ చేయలేమని పారిపోయేలా చేస్తాను. ( అని మనసులో అనుకుంటుంది.)
కేదార్: ధాత్రి పిన్నిని నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్లి వంట చేయి..
ధాత్రి: ఆలాగే…
అని వెళ్లబోతుంటే వైజయంతి ధాత్రిని వెళ్లకుండా ఏవేవో సైగలు చేస్తుంది. కాళ్లు పట్టించుకుంటుంది. నీళ్లు తాగించమని అడుగుతుంది. నీళ్లు తాగిస్తుంటే.. బయటకు ఊసేస్తుంది వైజయంతి. దీంతో నోరు వంకరగా ఉంది. కానీ నీళ్లు మాత్రం ఎందుకు స్ర్టెయిట్‌గా ఊసేసారు అని అనుమానిస్తుంది ధాత్రి. తర్వాత ధాత్రి వంట చేయడానికి వెళ్తుంది. కేదార్, వైజయంతి కాళ్లు పడుతుంటాడు.
వైజయంతి: ఈ ఇంటికి ఎప్పటికైనా నా కొడుకేరా అసలు సిసలైన వారసుడు. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఇవాళ నా కాళ్లు పట్టాలి. రేపు నా కాళ్లు పట్టాలి. ( అని మనసులో అనకుంటుంది.)
కేదార్: ఇలా కాదు పిన్ని కొంచెం ఆయిల్ తీసుకొచ్చి రాస్తాను.
అని వెళ్లబోతుంటే.. వైజయంతి, కేదార్‌న తన్నేస్తుంది. ధాత్రి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇంతలో వైజయంతి దీనికి అనుమానం వస్తే ఇంకేమన్నా ఉందా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!