Jagadhatri Serial Today December16th: సుధాకర్ కిడ్నాప్‌ను జగధాత్రి అడ్డుకోవడంతో...మీనన్ ఏం చేశాడు..?అసలు మీనన్‌కు నిషికకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి..?
Jagadhatri Serial Today Episode December 16th: సుధాకర్‌ను జగధాత్రి కాపడటంతో మీనన్ మనుషులు నిషికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు.అక్కడ మీనన్‌తో నిషిక చేతులు కలుపుతుంది.

Jagadhatri Serial Today Episode: మామయ్య సుధాకర్‌ను మీనన్ బారీ నుంచి కాపాడే ప్రయత్నంలో అతని మనుషులు జగధాత్రిపై దాడికి యత్నిస్తారు. ఈలోగా కేదార్ వచ్చి వాళ్లందరిని ఇరగ్గొడతాడు. దీంతో మీనన్ సుధాకర్‌ను వదిలిపెట్టి పారిపోతాడు. సుధాకర్‌ను తీసుకుని వాళ్లు కౌషికివాళ్ల దగ్గరకు తీసుకెళ్తారు. సమయానికి కేదార్, జగధాత్రి వచ్చి కాపాడకపోయి ఉంటే ఆ దుర్మార్గుడు తనను తీసుకెళ్లిపోయేవాడని సుధాకర్ వారికి చెబుతాడు. ఆ మీనన్ నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడని చెబుతాడు. ఇంతలో కౌషికి యువరాజు వైపు చూసి మీనన్ నాన్నను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడని నిలదీస్తుంది. దీంతో అతను తత్తరపాటుకు గురవుతాడు. నాకేం తెలియదని...నేను అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్లడం లేదని చెబుతాడు.
జగధాత్రి ఏదో ఆలోచిస్తుంటే...ఏమైందని కేదార్ అడుగుతాడు. మీనన్ ప్లాన్ ఫెయిల్ అయితే ఆవేశంగా వెళ్లాలి కానీ...అతను నవ్వుతూ ఎందుకు వెళ్లాడో అర్థం కావడం లేదని అంటుంది. ఖచ్చితంగా తాను అనుకున్నది ఏదో సాధించాననే ఫీలింగ్ వాడి కళ్లల్లో కనిపించిందని అంటుంది. మీనన్ ప్లాన్ నాన్నను కిడ్నాప్ చేయడమే కదా...అది మనం అడ్డుకున్నాం అని కేదార్ అంటాడు. అసలు మీనన్ ప్లాన్ మామయ్యను కిడ్నాప్ చేయడం కాదేమో..ఇంకా ఏదో ఉండి ఉంటుంది. అని ధాత్రి అంటుంది. ఇంతలో వైజయంతి నిషిక కనిపించడం లేదు ఎక్కడికి పోయిందని కౌషికిని అడుగుతుంది. నాన్నను వెతకడానికే వెళ్లిందని ఆ తర్వాత తాను కూడా చూడలేదని యువరాజు అంటాడు. అందరూ కంగారుపడుతుండగా....జగధాత్రికి అసలు విషయం అర్థమవుతుంది. మీనన్ కిడ్నాప్ చేసింది నిషికానే అని గ్రహిస్తుంది. ఇంతలో యువరాజుకు కూడా మీనన్ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి వాళ్ల అక్కతో చెబుతాడు...నిషిని మీనన్ మనుషులే కిడ్నాప్ చేసి ఉంటారని అంటాడు. మేం వెళ్లి నిషికను వెతుకుతామని అని చెప్పి జగధాత్రి, కేదార్ వెళ్తారు. అంతలో నిషికను కారులో ఎక్కిస్తుండగా వాళ్లిద్దరూ చూస్తారు. కారు వెంటపడినా అది వేగంగా వెళ్లిపోవడంతో వెనక బైక్‌పై ఫాలో అవుతారు. ఇంతలో జగధాత్రి రమ్యకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన వెహికిల్ నెంబర్ పంపుతుంది. వెంటనే ఆ కారును ఆపాలని ఆదేశిస్తుంది. అలాగే నిషిత నెంబర్ కూడా ట్రేస్ చేయమని చెబుతుంది.
జగధాత్రి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన రమ్య...నిషిక ఉన్న కారును ఆపుతుంది. ఈ విషయం వెంటనే ధాత్రికి ఫోన్‌లో చెబుతుంది. కారులో ఉన్న వారిని అరెస్ట్ చేసి నిషిని సేఫ్‌గా ఉంచాలని ఆదేశిస్తుంది. ఇంతలో రమ్య కారులో ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లి లొంగిపోవాలని బెదిరిస్తుంది. నిషికను కారు దిగి వచ్చి మా కారులో ఎక్కాలని...మీ అక్క వస్తోందని చెబుతుంది. దీనికి నిషిక అవసరం లేదని...నేను కారు దిగనని మొండికేస్తుంది. ఈ పరిణామంతో మీనన్ మనుషులే ఆశ్చర్యపోతారు. వీళ్లు నన్ను కిడ్నాప్ చేశారని రాంగ్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చారని...వీళ్లిద్దరూ నా ప్రెండ్స్ అని చెబుతుంది. విదేశాల నుంచి వచ్చారని...నాకు సర్‌ఫ్రైజ్ ఇద్దామని కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడారని చెబుతుంది. ముందు వెళ్లి బైక్ అడ్డం తీయమని కోరుతుంది. జగధాత్రి ఎప్పటి మాదిరిగానే ఓవర్ యాక్షన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందని చెబుతుంది. మేం వెంటనే వెళ్లాలని చెబుతుంది. జగధాత్రి వచ్చే వరకు ఆగమని చెప్పినా వినకుండా ఆమె వెళ్లిపోతుంది.
ఇంతలో రమ్య చెప్పిన లొకేషన్‌కు వచ్చిన జగధాత్రి...నిషిక ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె జరిగిందంతా ధాత్రికి చెబుతుంది. దీంతో కేదార్ అయోమయానికి గురవుతాడు. ఆస్పత్రిలో నిషిక కూడా తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లే అరిచింది కదా అని అంటాడు. మరి రమ్య వాళ్లతో ఎందుకు ఇలా చెప్పిందో అర్థం కావడం లేదని అంటాడు. ఇంతలో కిడ్నాపర్లు నిషికను తీసుకెళ్లి మీనన్ ముందు కూర్చోబెడతారు. పోలీసులతో ఎందుకు అబద్ధం చెప్పావని అతను అడుగుతాడు. నన్ను అడ్డం పెట్టుకుని యువరాజుతో పనులు చేయించుకోవడానికే కదా కిడ్నాప్ చేశావని నిషిక అంటుంది. దీనికి మీనన్ అవునని సమాధానిస్తాడు. మా కౌషిక వదిన యువరాజును మళ్లీ పూర్తిగా నమ్మేవరకు నువ్వు ఎంత బెదిరించినా నీ మాట వినడని నిషిక చెబుతుంది. ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చానని అంటుంది. దీంతో మీనన్ ఆమె తెలివికి మెచ్చుకుని తనతో చేతులు కలపాలని కోరతాడు. దీనికి ఆమె అంగీకారం చెప్పి ఆమె అక్కడి నుంచి వచ్చేస్తుంది. నిషిక రాక కోసం ఇంట్లో జగధాత్రి, కేదార్, యువరాజు అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.





















