Jagadhatri : కేదార్ ను చంపేందుకు కమలాకర్ ప్లాన్ – పాపను సేవ్ చేసిన కేదార్
Jagadhatri Today Episode: కేదార్ ఆఫీసుకు వెళ్లే లోపే చంపేయాలని కమలాకర్, యువరాజ్ ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: వైజయంతి, కమలాకర్, యువరాజ్, నిషిక కలిసి కేదార్‌ను ఏదో రకంగా సీఈవో నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తారు. అక్కడున్నది మొత్తం నా మనుషులు.. అది నా సామ్రాజ్యం. కేదార్ అక్కడకు వెళ్లి రాజ్యం ఏలుతానంటే ఎవరూ ఒప్పుకోరు అంటాడు యువరాజ్. తర్వాత రోడ్డు సైడ్ దగ్గర కూర్చుని మొక్కజొన్న పొత్తులు తింటుంటే కొంత మంది రౌడీలు వచ్చి ఒక పాపను చంపేస్తామని నగలు ఇవ్వండని బెదిరించడంతో కేదార్ వెళ్లి సేవ్ చేస్తాడు. తర్వాత యువరాజ్, కమలాకర్ మాట్లాడుకుంటుంటారు.
యువరాజ్: బాబాయ్ ఏం ఆలోచిస్తున్నారు.
కమలాకర్: ఇంట్లో జగధాత్రి చేతిలో.. బయట ఆ జేడీ చేతిలో ఎందుకు ఇన్ని సార్లు ఓడిపోతున్నామా? అని ఇద్దరు ఎప్పుడు మన కంటే రెండు అడుగులు ముందు ఎలా ఉండగలుగుతున్నారా అని ఆలోచిస్తున్నాను.
యవరాజ్: అవును బాబాయ్. వీళ్లిద్దరు మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి మనకు మనఃశాంతి లేకుండా పోయింది. ముందు ఈ జగధాత్రి వాళ్ల పని చూసి తర్వాత జేడీ అంతు చూడాలి బాబాయ్. ఆ కేదార్ గాడు ఆఫీసులో నా స్థానంలో కూర్చోబోతున్నాడు అనే ఆలోచనే నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్.
కమలాకర్: సరే అయితే ఈరోజు వాణ్ని ఆఫీసుకు కాకుండా స్మశానానికి పంపిస్తే..
యువరాజ్: బాబాయ్…?
కమలాకర్: అవును యువరాజ్ నేను పొద్దన్నుంచి ఆలోచిస్తున్న.. ఆఫీసులో అడుగుపెట్టాక వాణ్ని ఓడించి జైలుకు పంపించడం అంత అవసరమా? డైరెక్టుగా పై లోకానికి పంపిస్తే ఒకటేసారి పీడ విరగడి అవుతుంది కదా?
యువరాజ్: కరెక్టే బాబాయ్. కానీ ఎలా వాణ్ని డైరెక్టుగా ఏమీ చేయలేం. జగధాత్రికి అనుమానం వచ్చినా అక్కకు మనమే చేశామని తెలిసినా? ఇక మనల్ని వదలరు కదా బాబాయ్.
కమలాకర్: ఆఫీసుకు వెళ్లేటప్పుడు కారు బ్రేక్స్ ఫెయిల్ అయితే అప్పుడు కూడా మనల్నే అనుమానిస్తారా?
యువరాజ్: సూపర్ ఐడియా బాబాయ్. పదండి ఇంప్లిమెంట్ చేద్దాం.
అని యువరాజ్, కమలాకర్ వెళ్లిపోతారు. మరోవైపు బాత్రూంలో ఉన్న కేదార్ సోప్ అయిపోయింది తీసుకునిరా అని జగధాత్రిని పిలుస్తాడు. కప్‌బోర్డులో ఉంది తీసుకో అని ధాత్రి చెప్పినా కనిపించడం లేదని కేదార్ అంటాడు. దీంతో ధాత్రి లోపలికి రాగానే కేదార్, ధాత్రిని రోమాంటిక్ గా హగ్ చేసుకుంటాడు.
ధాత్రి: నీకసలు.. వదిన, అన్నయ్యా ఉన్నారన్న సిగ్గు కూడా లేదు.
కేదార్: లేదు..
ధాత్రి: నీ వేషాలు నా దగ్గర కాదు.
కేదార్: మరి ఎవరి దగ్గర
ధాత్రి: అది నీకే తెలియాలి.
కేదార్: అవునా.. మొన్న ఒకసారి ఐ తో ఆపేశావు కదా? లవ్ యూ ఎప్పుడు చెప్తావు.
ధాత్రి: అది కూడా నీ ఇష్టమా బాబు.. నా ఇష్టం ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ బాయ్ లాగా త్వరగా స్తానం చేసి రా ఆఫీసుకు టైం అవుతుంది.
అని చెప్పి ధాత్రి వెళ్లిపోతుంది. మరోవైపు యువరాజ్, కమలాకర్ వెళ్లి కారు బ్రేకులు పెయిల్ చేస్తుంటారు. ఇంతలో కౌషికి రావడం చూసి షాక్ అవుతారు. కౌషికి వచ్చి కేదార్‌తో పాటు మీరు, నేను, యువరాజ్ కూడా ఆఫీసుకు వెళ్లాలని చెప్తుంది. కమలార్ సరే లోపల అందరూ రెడీ అయ్యారో లేదో చూడమని చెప్పడంతో కౌషికి లోపలికి వెళ్తుంది. యువరాజ్ బ్రేక్ వైర్ కట్ చేసి బయటకు వస్తాడు. మరోవైపు పూజ చేసిన ధాత్రి, కేదార్‌కు బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సాయి ధరమ్ తేజ్ డెబ్యూ చేయాల్సిన మూవీ అదేనట - అరెరే మంచి ఛాన్స్ మిస్సయ్యాడే!