అన్వేషించండి

Guppedantha Manasu Serial Today April 17th: 'గుప్పెడంత మనసు' సీరియల్: మను విషయంలో తగ్గేదే లేదన్న మహేంద్ర, అన్నదమ్ముల మధ్య దేవయాని చిచ్చు

Guppedantha Manasu Serial Today: ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర మ‌ధ్య దూరం పెంచే ప్రయత్నంలో దేవ‌యాని , మ‌నుకి మహేంద్రని దగ్గర చేసే ప్రయత్నంలో వసు ఏం చేశారన్నదే ఈరోజు ఎపిసోడ్.

Guppedantha Manasu Serial Today: మనుని తన కొడుకుగా మహేంద్ర చెప్పటంపై అనుపమ సీరియస్ అవుతుంది. నీకు మను సహాయం చేస్తే మరో రూపంలో సహాయం చేయాలి గానీ ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తుంది. తన తండ్రి విషయంలో మనో తల దించుకోకూడదనే ఇలా చేశాను అంటాడు. వసు కూడా అనుపమకే మద్దతు పలుకుతుంది. మీరు మంచి కోసమే చేశారు. కానీ ఇలా చేయటం వల్ల ఎంతమంది మెదడులో ఎన్ని ప్రశ్నలు నాటారో తెలుసా అంటుంది. అడిగిన వాళ్ళందరికీ, అవమానించిన వాళ్ళందరికీ తానే సమాధానం చెబుతానంతాడు మహేంద్ర. ఇంతలో మహేంద్ర కి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి అర్జెంట్గా మాట్లాడాలి ఇంటికి రమ్మని చెబుతాడు మహేంద్ర.. అక్క నుండి బయలుదేరుతాడు.

ఏదో ఆలోచిస్తునట్టు ఉన్న మహేంద్ర అన్న ఫణీంద్ర దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అతని భార్య దేవయాని. కావాలనే మహేంద్ర గురించి ఎత్తి మహేంద్ర వల్ల తమ కుటుంబాన్ని గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని ఫణీంద్ర కి చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంత చెప్పినా ఫణీంద్ర తన తమ్ముడిపై తనకు నమ్మకం ఉంది అనడంతో అనుపమ గురించి అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.. కానీ ఫణింద్ర గట్టిగా అరవడంతో మాటలు ఆపేస్తుంది

మనుకి తన తండ్రి నేనే అని మహేంద్ర చెప్పిన మాట్లాడిన మాటలు గుర్తు వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడికి చేరుకుంటుంది వసుధార. మనుకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. మా బాధ మేం పడతాం కదండీ.. సార్ ఎందుకు అలా రియాక్ట్ కావాలి?? అని అడుగుతాడు మను.

వసుధార: మామయ్య మొదటి నుంచి మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. మీ ఇద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తున్నారు. జగతి మేడమ్‌ని రిషి సార్‌ని మీలో ఊహించుకుంటున్నారేమో.  వాళ్ళిద్దరూ కూడా కూడా తల్లీ కొడుకులైనా కూడా మీలాగే మాట్లాడుకునే వారు కాదు.. వాళ్లని కలిపినట్టే మిమ్మల్నీ కలపాలనే ఇలా చేసి ఉంటారు. 

మను: మీ మామయ్య తరుపున బాగానే మాట్లాడుతున్నావ్ కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మా బాధ తగ్గలేదు సరికదా ఎక్కువైంది. 

ఫ‌ణీంద్ర ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు మ‌హేంద్ర‌. న‌న్ను ఎందుకు ర‌మ్మ‌న్నార‌ని   అడుగుతాడు. 

దేవయాని: హా.. నువ్వు చేసిన ఘనకార్యానికి సత్కరించి పంపుదాం అని రమ్మాన్నాం

ఫణీంద్ర : దేవయానీ..  నోర అదుపులో పెట్టుకో..  చెప్పు మహేంద్రా.. నువ్వు చెప్పింది అబద్దం అని నాకు తెలుసు.. అందరి ముందు మను తండ్రి నువ్వే అని ఎందుకు అబద్దం చెప్పావ్ ?

మహేంద్ర: నేను చెప్పింది అబద్దం అని మీరు నమ్ముతున్నారు కదా అన్నయ్యా

ఫణీంద్ర : అవును, నమ్ముతున్నాను 

మహేంద్ర: మీరు నమ్మినప్పుడు ఇందులో చెప్పడానికేం ఉంది.. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి

దేవయాని : అలా ఎలా వదిలేస్తారు?? పోయేది నీ పరువు కాదు.. ఈ కుటుంబం పరువు.. 

మహేంద్ర: నేను అంత పెద్ద తప్పు చేయలేదు వదినగారూ.. నాకు నేరాలు ఘోరాలు చేయడం రాదు. కుట్రలు పన్నలేను

శైలేంద్ర : ఇప్పుడు మేం అలా అన్నామా బాబాయ్.. మీరు ఎంత మంచి వారో మాకు తెలియదా? మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో ఉద్దేశం ఉంటే ఉంటుంది కదా.. అదే అడుగుతున్నాం. 

మహేంద్ర:  మను తండ్రి గురించి అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చూసి తట్టుకోలేకపోయాను.. నా మనసుకి బాధగా అనిపించింది. మను అందరిలో తల దించుకోవడం నాకు కష్టంగా అనిపించింది. అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. అందరి నోరూ మూయించాలనే నేను మను తండ్రిని అని చెప్పాను. ఇందులో మరో ఉద్దేశం లేదు. 

దేవయాని: అంతేనా ఇంకేం లేదా?

ఫణీంద్ర : ఏం లేదని చెప్తున్నాడు కదా.. ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావ్

దేవయాని: మహేంద్ర గురించి మనకి తెలుసు కాబట్టి నమ్ముతాం.. మరి బయట జనానికి ఏం చెప్తావ్. మనోని ఎవరో వేధిస్తున్నారని అందుకే నేను తండ్రిని అని చెప్పానని, నిజానికి కాదని  చెబుతావా? అప్పుడు తండ్రి అని , ఇప్పుడు కాదు అని  అంటావా? 

శైలేంద్ర: ఏంటి బాబాయ్.. మీరు ఏం చెప్తున్నారో మాకే అర్ధం కావడం లేదు.. బయట వాళ్లకి ఏం చెప్తారు.. మాలాంటి వాళ్లకి చెప్పాల్సిన మీరే.. ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటి?

మహేంద్ర:  నేను తీసుకున్న నిర్ణయం సరైనదే, 

ఇదే సమయం అని అటు దేవయాని, ఇటు శైలేంద్ర రెచ్చిపోతారు . మ‌ను మీ బాబాయ్ కొడుకేనా అని అంద‌రూ తనను ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ని, వారికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలి అంటూ మ‌హేంద్ర‌ను ప్ర‌శ్నిస్తాడు శైలేంద్ర‌. రేప‌టి నుంచి మేము ఎలా బ‌య‌ట‌తిర‌గాలి. నువ్వు చేసిన త‌ప్పుకు మేము ఎందుకు శిక్ష అనుభ‌వించాలి అంటూ మ‌హేంద్ర‌పై ఫైర్ అవుతుంది దేవ‌యాని. కుటుంబానికి నువ్వు పెద్ద మ‌చ్చ తెచ్చావ‌ని కోప్ప‌డుతుంది. మీరు చేసిన ప‌నికి నేను అవ‌మానంతో కృంగిపోతున్నాన‌ని శైలేంద్ర గొంతు మార్చి  క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరో అవమానంతో బాధపడుతున్నారని.. సొంత మనుషుల్ని బాధపెడతావా? అంటూ దేవయాని రెచ్చిపోతుంది. దేవ‌యాని మాట‌ల‌ను మ‌హేంద్ర ప‌ట్టించుకోడు. అన్ని ఆలోచించుకునే నేను మ‌ను తండ్రిని అని చెప్పాను. అందులో ఎలాంటి త‌ప్పు, స్వార్థం లేద‌ని అంటాడు. అది కాదు మహేంద్రా అని ఫణీంద్ర అనేసరికి.

మహేంద్ర:  సారీ అన్నయ్యా.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. నేను మాత్రం నా మాటకి కట్టుబడే ఉంటాను. మను కోసం నేను ముందడుగు వేస్తానే కానీ.. వెనకడుగు వేయను. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి అన్నయ్యా..

అని చేతులెత్తి క్షమాపణ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. 

Also Readకల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi And Pawan: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
OTT Platforms: 'ఆ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడండి' - ఓటీటీలకు కేంద్రం వార్నింగ్
'ఆ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడండి' - ఓటీటీలకు కేంద్రం వార్నింగ్
 Ind Vs Ban Live updates: ష‌మీ షైనింగ్.. రాణించిన మిగ‌తా బౌల‌ర్లు.. బంగ్లా 228 ఆలౌట్.. తౌహిద్ సెంచ‌రీ
ష‌మీ పాంచ్ పటాకా.. రాణించిన మిగ‌తా బౌల‌ర్లు.. బంగ్లా 228 ఆలౌట్ .. తౌహిద్ సెంచ‌రీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi And Pawan: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
OTT Platforms: 'ఆ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడండి' - ఓటీటీలకు కేంద్రం వార్నింగ్
'ఆ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడండి' - ఓటీటీలకు కేంద్రం వార్నింగ్
 Ind Vs Ban Live updates: ష‌మీ షైనింగ్.. రాణించిన మిగ‌తా బౌల‌ర్లు.. బంగ్లా 228 ఆలౌట్.. తౌహిద్ సెంచ‌రీ
ష‌మీ పాంచ్ పటాకా.. రాణించిన మిగ‌తా బౌల‌ర్లు.. బంగ్లా 228 ఆలౌట్ .. తౌహిద్ సెంచ‌రీ
Lady Doctor: స్విమ్మింగ్ కోసం బైబై అని చెప్పి దూకేసింది, మళ్లీ కనిపంచలేదు - కన్నీళ్లు పెట్టిస్తున్న హైదరాబాద్ డాక్టర్ వీడియో
స్విమ్మింగ్ కోసం బైబై అని చెప్పి దూకేసింది, మళ్లీ కనిపంచలేదు - కన్నీళ్లు పెట్టిస్తున్న హైదరాబాద్ డాక్టర్ వీడియో
KCR Latest News: రెండు జాతీయ పార్టీలను ఒకేసారి మడతెట్టేలా కేసీఆర్ స్కెచ్‌- ఈసారి చంద్రుడి సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా!
రెండు జాతీయ పార్టీలను ఒకేసారి మడతెట్టేలా కేసీఆర్ స్కెచ్‌- ఈసారి చంద్రుడి సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా!
Rakt Bramhand : ఫైనాన్షియల్ ఫ్రాడ్ వల్ల సమంత సిరీస్ ఆపేసిన 'నెట్ ఫ్లిక్స్' - ఆ రూమర్స్‌పై నిర్మాతలు ఏమన్నారంటే?
ఫైనాన్షియల్ ఫ్రాడ్ వల్ల సమంత సిరీస్ ఆపేసిన 'నెట్ ఫ్లిక్స్' - ఆ రూమర్స్‌పై నిర్మాతలు ఏమన్నారంటే?
WATCH: ఎంత పని చేశావ్‌ రోహిత్ భాయ్‌! భారత్ ఫీల్డింగ్‌పై దారుణమైన ట్రోలింగ్
ఎంత పని చేశావ్‌ రోహిత్ భాయ్‌! భారత్ ఫీల్డింగ్‌పై దారుణమైన ట్రోలింగ్
Embed widget