అన్వేషించండి

Guppedantha Manasu october 24th : గుప్పెడంతమనసులో 'ఆర్య' లవ్ స్టోరీ, అనుపమ ఎంట్రీతో ఇంట్రెస్టింగ్ గా మారిన కథ!

Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు అక్టోబరు 24 ఎపిసోడ్

మహేంద్ర కనిపించలేదని వెతుకుతూ ఉంటారు రిషిధార. మహేంద్ర అలా నడుచుకుంటూ వెళుతుంటే..జగతి పిలిచినట్టు అనిపించడంతో ఓ చోట ఆగిపోతాడు. అక్కడే కొత్త క్యారెక్టర్ అనుపమ ఎంట్రీ ఇస్తుంది. ఆ ప్లేస్ గురించి బాగా తెలిసిన వాడిలా పార్క్ లోప‌లికి న‌డుచుకుంటూ వెళ‌తాడు మ‌హేంద్ర‌. త‌న ప‌ర్సు కింద‌ప‌డిపోయిన విష‌యం గ‌మ‌నించ‌కుండా మ‌త్తులో తూలుకుంటూ ఓ చోట కూర్చుంటాడు. అక్క‌డ చెట్టు కింద ఉన్న బండ‌రాయిపై జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల పేర్లు రాసి ఉంటాయి. అక్క‌డ కూర్చుండి జ‌గ‌తి జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌తో పాటు ఆ రాయిపై అనుప‌మ అనే మ‌రో పేరు ఉంటుంది. అనుప‌మ పేరును మ‌హేంద్ర చ‌దువుతుండ‌గానే అక్క‌డికిఅనుమ‌ప ఎంట్రీ ఇస్తుంది. కింద‌ప‌డిపోయిన మ‌హేంద్ర‌ ప‌ర్సును ఇవ్వ‌డానికి వ‌స్తుంది. అనుప‌మ‌ను చూడ‌గానే మ‌హేంద్ర షాక‌వుతాడు.

Also Read: వాటర్ అనుకుని ఫుల్లుగా తాగేసిన రిషిధార, మహేంద్రకి ఎదురపడిన కొత్తక్యారెక్టర్

అనుపమ-మహేంద్ర
ఇంత‌కాల‌మైనా నాపై ఉన్న కోపం త‌గ్గ‌లేదా అని అనుప‌మ‌ను ఉద్దేశించి మ‌న‌సులో అనుకుంటాడు మ‌హేంద్ర‌. నీ విష‌యంలో మామూలుగా ఉండ‌లేక‌పోతున్నాన‌ని అనుప‌మ కూడా మ‌న‌సుతోనే అత‌డి ప్ర‌శ్న‌కు బ‌దులిస్తుంది. అనుప‌మ‌ను చూడ‌గానే మందు బాటిల్ దాచేస్తాడు మ‌హేంద్ర‌. ప‌ర్సును ఇస్తుంది అనుప‌మ‌. ఇంకా ప‌డేసుకునే అల‌వాటు ఇంకా నీకు పోలేదా అని అడుగుతుంది. నా త‌ల‌రాత అంటూ అనుప‌మ‌కు బ‌దులిస్తాడు అనుపమ: మ‌హేంద్ర‌.ఏమైంది, ఎందుక‌లా మాట్లాడుతున్నావ‌ని అంటే మ‌హేంద్ర మాత్రం స‌మాధానం చెప్ప‌డు. ఇంత‌కాల‌మైన నీకు ఈ ప్లేస్ ఇంకా గుర్తుందా...అందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చావా 
మహేంద్ర: నేను రాలేదు. నా జ్ఞాప‌కాలే న‌న్ను ఇక్క‌డికి తీసుకొచ్చాయి. మ‌ర్చిపోయే జ్ఞాప‌కాలా అవి...ప్ర‌త్యేకించి గుర్తుపెట్టుకోవ‌డానికి అంటూ మ‌హేంద్ర బ‌దులిస్తాడు.
అనుపమ: జ‌గ‌తిని ఎందుకు తీసుకురాలేదు. మ‌హేంద్ర స‌మాధాన‌మివ్వ‌డు. జ‌గ‌తి చ‌నిపోయిన విష‌యం అనుప‌మ‌కు తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని మ‌హేంద్ర భ‌య‌ప‌డిపోతాడు. స‌మాధానం చెప్ప‌కుండా సెలైంట్‌గా ఉండిపోతాడు. మ‌హేంద్ర ఆన్స‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అనుప‌మ సీరియ‌స్ అవుతుంది. జ‌గ‌తి ఎందుకు రాలేద‌ని నిల‌దీస్తుంది.
అనుపమ: నీ భార్య కంటే ముందు జ‌గ‌తి నాకు ప్రాణ స్నేహితురాలు అంటూ అనుప‌మ కోపంగా అంటుంది. జ‌గ‌తి లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేనివాడికి ఆమెకు దూరంగా ఎందుకు ఉంటున్నావు...నీ మ‌న‌సును ఎవ‌రి కోసం రాయిగా మార్చుకున్నావు. జ‌గ‌తిని ఎందుకు బాధ‌పెడుతున్నావు
మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేను ప‌రిష్క‌రిస్తాన‌ని, జ‌గ‌తి ఎక్క‌డ ఉందో చెప్ప‌మ‌ని కోప‌గించుకుంటుంది. జ‌గ‌తిని ఏం చేశావో చెప్పు అంటూ గ‌ట్టిగా అడుగుతుంది. జ‌గ‌తిని ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు ఆమెను ఎందుకు దూరం పెడుతున్నావ‌ని నిల‌దీస్తుంది.
మ‌హేంద్ర: స‌మాధానం చెప్ప‌కుండా సెలైంట్‌గా ఉంటాడు. నా మ‌న‌సు బాగాలేద‌ని, త‌ర్వాత అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతాన‌ు
నేను నిన్ను మ‌ళ్లీ క‌లుస్తాన‌ని...అప్పుడు జ‌గ‌తి గురించి త‌ప్ప‌కుండా చెప్పాల్సిందే అని మ‌హేంద్ర తో చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది అనుప‌మ‌. అప్పుడే రిషి, వ‌సుధార అక్క‌డికి వ‌స్తారు.మ‌హేంద్ర‌ను చూసి కంగారు ప‌డ‌తారు. అక్క‌డ రాయిపై జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌తో పాటు అనుప‌మ పేర్లు రాసి ఉండ‌టం వ‌సుధార గ‌మ‌నిస్తుంది. అనుప‌మ ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఫిక్స్ అవుతుంది.

Also Read: అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం, ఫుల్ జోష్ లో రిషిధార !

మ‌హేంద్రతో మాట్లాడిన విష‌యాల్ని అనుప‌మ గుర్తుచేసుకుంటుంది. అప్పుడే ఆమె పెద్ద‌మ్మ ఆమెకు కాల్ చేస్తుంది. అనుప‌మ డ‌ల్‌గా ఉండ‌టంతో ఏమైంద‌ని అడుగుతుంది. మ‌హేంద్ర క‌నిపించిన విష‌యం పెద్ద‌మ్మ‌కు చెబుతుంది. మ‌హేంద్ర పేరు విన‌గానే పెద్ద‌మ్మ షాక్ అవుతుంది. ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌హేంద్ర నిన్ను క‌లిశాడంటే నాకే ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని పెద్ద‌మ్మ అంటుంది. అత‌డి ప‌క్క‌న జ‌గ‌తి లేదా అని పెద్ద‌మ్మ అడ‌గ్గా...లేద‌ని అనుప‌మ అంటుంది. అప్పుడు నువ్వు మ‌హేంద్ర‌తో స‌రిగ్గా మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్లే నువ్వు ఇలా ఒంట‌రిగా మిగిలిపోయావ‌ని అనుప‌మ‌కు  చెబుతుంది. జ‌గ‌తి, మ‌హేంద్ర ఇద్ద‌రు త‌న‌కు ప్రాణ స్నేహితులు అని, వారి కోసం ఏదైనా చేస్తాన‌ని, ఇక ముందు కూడా చేస్తాన‌ని అనుప‌మ అంటుంది. జ‌గ‌తి త‌న ప్రాణ‌మ‌ని, త‌న‌కు ఏం జ‌రిగినా త‌ట్టుకోలేన‌ని అనుప‌మ అంటుంది. మ‌రి మ‌హేంద్ర అంటే అని అనుప‌మ‌ను అడుగుతుంది పెద్ద‌మ్మ‌. అనుప‌మ స‌మాధానం చెప్పకుండా ఉండిపోతుంది..
ఎపిసోడ్ ముగిసింది..

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Sai Pallavi: రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Embed widget