అన్వేషించండి

Guppedantha Manasu January 26th Episode: నా కొడుకొస్తున్నాడు - దేవయానికి పెద్ద షాకిచ్చిన మహేంద్ర , శైలేంద్రలో టెన్షన్!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 26th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 26 ఎపిసోడ్)

వ‌సుధార నిర్వ‌హిస్తోన్న యూత్‌ఫెస్టివ‌ల్‌కు రిషి వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం చేసి లేనిపోని గొడవ సృష్టించాలనుకుంటాడు శైలేంద్ర. కానీ రివర్స్ లో పంచ్ ఇస్తుంది వసుధార. రిషి వస్తున్నారని..తన ముందు ఆధారాలతో సహా నీ నిజస్వరూపం బయటపెడతానని చెబుతుంది. దీంతో శైలేంద్రలో టెన్షన్ మొదలవుతుంది. వసుధార వెళ్లిపోగానే..రాజీవ్ కి కాల్ చేసి చెబుతాడు శైలేంద్ర. చక్రపాణి ఆచూకీ తెలుసుకుంటే కానీ మనకు పనిజరగదంటాడు.  

Also Read: ఇక తేల్చేసుకుందాం అన్న వసుధార - రిషి ఎంట్రీతో శైలేంద్ర చాప్టర్ క్లోజ్!

చక్రపాణి: రిషి గురించి వ‌సుధార ప‌డుతోన్న బాధ చూడ‌లేక త‌ల్ల‌డిల్లిపోతాడు చ‌క్ర‌పాణి. తొంద‌ర‌గా రిషి కోలుకోవాల‌ని దేవుడిని వేడుకుంటాడు. రిషి, వ‌సుధార క‌లిసి సంతోషంగా ఉంటే అంతే చాల‌ని అనుకుంటాడు. 
ఇంతలో చ‌క్ర‌పాణి మిత్రుడు స్వామినాథ్‌ను గ‌న్‌తో బెదిరించి కాల్ చేయిస్తాడు రాజీవ్. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని చెప్పి అడ్రస్ చెబితే వచ్చి కార్డ్ ఇస్తానంటాడు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కానీ చక్రపాణి మాత్రం తాను ఎక్కడున్నది చెప్పడు. కాల్ కట్ చేసిన తర్వాత ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని చెప్పి స్వామినాథ్ ను బెదిరించి పంపించేస్తాడు. ఇంకెన్నాళ్లు జాగ్రత్త పడతావో చూస్తాను అని క్రూరంగా నవ్వుకుంటాడు. త్వరలోనే నున్ని క‌లిసే భాగ్యం నాకు క‌లుగుతుంది. అప్పుడు రాజీవ్ ప్ర‌తాపం ఏమిటో చూపిస్తాన‌ని అంటాడు.

Also Read: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - కాలేజ్ యూత్ ఫెస్టివల్ తో రిషి రీఎంట్రీ !

చక్రపాణి-వసుధార
తండ్రికి ఫోన్ చేస్తుంది వ‌సుధార‌. కాలేజీలో యూత్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుంద‌ని, ఈ ఫెస్ట్‌కు రిషిని తీసుకుర‌మ్మ‌ని అంటుంది. వ‌సుధార మాట‌ల‌తో చ‌క్ర‌పాణి షాక‌వుతాడు. కూతురిని క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు కానీ వ‌సుధార విన‌దు. రిషిని చూడాల‌ని స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్ ప‌ట్టుప‌డుతున్నార‌ని, వారికి రిషిని చూపించ‌డం త‌ప్పితే త‌న‌కు మ‌రో దారి లేద‌ని వ‌సుధార అంటుంది. శైలేంద్ర గురించి చ‌క్ర‌పాణి భ‌య‌ప‌డ‌తాడు. నేను ఉండ‌గా రిషిని ఎవ‌రూ ఏం చేయ‌లేర‌ని వ‌సుధార అంటుంది. ఆ తర్వాత రిషి కాలేజీకి వ‌స్తోన్న విష‌యం మ‌హేంద్ర‌, అనుప‌మ‌ల‌తో చెబుతుంది.ఆ మాట‌లు విని ఇద్ద‌రు షాక‌వుతారు. శైలేంద్ర మీద కోపం, పంతంతో -  త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుంటున్నావ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌. 
అనుపమ: ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రిషి ఇక్క‌డికి రావ‌డం క‌రెక్ట్ కాద‌ని, అత‌డు వ‌చ్చే ప‌రిస్థితుల్లో లేడ‌ని వ‌సుధార‌ను క‌న్వీన్స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది వసు: ఈ ఫెస్ట్‌కు రిషి రావాల్సిందే . కాలేజీ కోసం, స్టూడెంట్స్ సంతోషం కోసం రిషిని కాలేజీకి తీసుకొస్తున్నాన‌ు. శైలేంద్ర చెంప చెల్లుమ‌నిపించ‌డానికైనా రిషిని కాలేజీకి తీసుకొస్తాన‌ు
అనుపమ: రిషిని బ‌య‌ట‌కు తీసుకొచ్చి అవ‌స‌రంగా  రిస్క్‌లో పెట్టొద్ద‌ని వ‌సుధార‌కు చెబుతుంది
 వసు: రిస్క్ రిషికి కాదు...శైలేంద్ర‌కు . రిషికి ప్ర‌మాదం త‌ల‌పెడ‌తాన‌ని బెదిరిస్తూ శైలేంద్ర ఆడుతున్న నాట‌కాల‌కు ఈ రోజుతో తెర‌ప‌డ‌టం ఖాయ‌ం. ఇన్నాళ్లు మేము వెన‌క‌గుడు వేయ‌డం వ‌ల్లే వాడు భ‌య‌పెడుతూ వ‌చ్చాడు. ఇక త‌గ్గేదే లేదు. వాడు ఏం చేసుకుంటాడో చేసుకోని  
మహేంద్ర: ఇప్పుడు క‌రెక్ట్‌గా మాట్లాడుతున్నావ‌ు. మ‌న‌కు కావాల్సిన ఎమోష‌న్ ఇదే. నా కొడుకు కాలేజీకి రాకుండా ఎవ‌డు అడ్డుకుంటాడో చూస్తాను. శైలేంద్ర ఎక్స్‌ట్రా లు చేస్తే వాడి చిత‌క్కొడ‌తా

Also Read: అనవసర చర్చల్లో పాల్గొనవద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు - జనవరి 26 రాశిఫలాలు

దేవయానికి శైలేంద్ర షాక్
వ‌సుధార‌ను ఎండీ ప‌ద‌వి నుంచి దించి త‌న కొడుకు ఆ సీట్‌లో కూర్చోబోతున్నాడ‌ని దేవ‌యాని సంతోషంలో ఉంటుంది. సెల‌బ్రేష‌న్స్ కోసం స్వీట్ రెడీ చేసి తిన‌బోతుంది. అప్పుడే శైలేంద్ర కాల్ చేసి అసలు విషయం చెబుతాడు.  రిషి కాలేజీకి వ‌స్తున్నాడ‌ని అంటాడు. రిషి ఎలా వ‌స్తాడని అంటే.. వ‌సుధారే స్వ‌యంగా ఈ మాట త‌న‌తో చెప్పింద‌ని, రిషి ముందు త‌న నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఛాలెంజ్ చేసిందని చెబుతాడు. తాను జైలుకు వెళ్ల‌కుండా ఏదో ఒక‌టి చేయ‌మ‌ని, కాలేజీకి ర‌మ్మ‌ని త‌ల్లిని అడుగుతాడు. దేవ‌యానితో శైలేంద్ర మాట్లాడుతోండ‌గా అప్పుడే అక్క‌డికి మ‌హేంద్ర ఎంట్రీ ఇస్తాడు. శైలేంద్ర ద‌గ్గ‌ర నుంచి ఫోన్ తీసుకుంటాడు. 

మహేంద్ర - దేవయాని
రిషి వ‌స్తున్నాడు..మీరు కూడా కాలేజీకి వ‌స్తే మంచిద‌ని దేవ‌యానితో అంటాడు మ‌హేంద్ర‌. మీ కొడుకు చేసే దుర్మార్గాలు, అన్యాయాల‌కు మీరే ఆజ్యం పోశారు. అలాంటిది శైలేంద్ర నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డే రోజు మీరు ప‌క్క‌నుండ‌క‌పోతే ఎలా అని దేవ‌యానితో అంటాడు మ‌హేంద్ర‌. ఆ మాట‌ల‌తో దేవ‌యాని టెన్ష‌న్ ప‌డుతుంది. 
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Embed widget