Guppedantha Manasu January 25th Episode: ఇక తేల్చేసుకుందాం అన్న వసుధార - రిషి ఎంట్రీతో శైలేంద్ర చాప్టర్ క్లోజ్!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu January 25th Episode: (గుప్పెడంతమనసు జనవరి 25 ఎపిసోడ్)
యూత్ ఫెస్టివల్ రోజు కాలేజీకి వెళ్లబోతూ ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని జగతి ఫొటోకు నమస్కారం చేస్తుంది వసుధార. దేవుడికి కదా దండం పెట్టాలని మహేంద్ర అంటే..నాకు జగతి మేడమే గురువు, దైవం అంటుంది. ఆ తర్వాత వసుధార వెళ్లిపోతుంది..ఇంతలో జగతి ఫొటో కింద పడుతుంది. అది చూసి మహేంద్ర టెన్షన్ పడతాడు. ఏదైనా కీడు జరగబోతోందా ఏంటి అనుకుంటాడు.
కాలేజీలో యూత్ ఫెస్ట్ పనులు చకచకా సాగుతుంటాయి. అందర్నీ చూసి శైలేంద్ర మనసులో... మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు నేను ఓ ప్లాన్ చేశానులే అనుకుంటాడు. ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది. మినిస్టర్ తో మాట్లాడుతూ లోపలకు అడుగుపెడుతుంది. వెల్ కమ్ రిషి సార్ అంటూ కనిపించిన ఫ్లెక్సీలు చూస్తుంది. అవి చూసిన స్టూడెంట్స్ అంతా యూత్ ఫెస్టివల్ కి రిషి సర్ వస్తున్నారని సంతోషిస్తారు.
రిషి వస్తున్నారని విషయం చివరి నిమిషంలో చెప్పి థ్రిల్ చేశారని స్టూడెంట్స్ అంతా అంటారు. ఈ విషయం శైలేంద్ర సర్ అందరకీ హ్యాపీగా చెబుతున్నారు అంటారు..ఇంతలో శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు...
Also Read: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - కాలేజ్ యూత్ ఫెస్టివల్ తో రిషి రీఎంట్రీ !
శైలేంద్ర: రిషి వస్తున్నాడటగా నాకు చాలా హ్యాపీగా ఉందని వసుధారతో అంటాడు. నీ డ్రామాలు ఆపుతావా...
వసు: ఈ ఫ్లెక్సీలు పెట్టింది నువ్వే అని తెలుసు.
శైలేంద్ర: నీకు చాలా తెలివితేటలున్నాయి
వసు: జీవితంలో ఎవరైనా మారాలని అనుకుంటారు. నీలా దిగజారాలని అనుకోరు
శైలేంద్ర: కాలేజీలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. రిషి లేకపోతే ఎలా..రిషి వచ్చాక ఎండీ సీట్ ఇస్తానన్నావ్ కదా...అందుకే ఇలా చేశా. స్టూడెంట్స్ అంతా సంతోషపడుతున్నారు. ఈ ఫెస్ట్‌ను సక్సెస్ చేస్తానని నాతో ఛాలెంజ్ చేశావు. ఈ వసుధారకు తిరుగులేదు అన్నావు. నేను వేసిన ప్లాన్ వల్ల నువ్వు కచ్చితంగా రిషిని తీసుకురావాల్సిందే. ఎవరికి కనిపించకుండా రిషిని దాచిపెట్టి వైద్యం చేయిస్తున్నావు. ఇప్పుడు ఎలా బయటకుతీసుకురావో చూస్తాను...
వసు: ఇప్పుడురిషి సర్ ని తీసుకురావడం కుదరదు..మర్యాదగా ఈ ఫ్లెక్సీలు తీసేయ్
శైలేంద్ర: తీసేయకపోతే కొడతావా, నీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.రిషి వస్తున్నాడని స్టూడెంట్స్ ఫిక్సైపోయారు. రాకపోతే వాళ్లూ ఊరుకోరు ఈ శైలేంద్ర ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది
Also Read: శైలేంద్రకి స్ట్రాంగ్ కౌంటర్ - వసుధార ఇంటికి రాజీవ్ , మొత్తం మీరే కారణమన్న అనుపమ!
మహేంద్ర-అనుపమ టెన్షన్
శైలేంద్ర ప్లాన్‌తో వసుధారలో టెన్షన్ మొదలవుతుంది. అప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన మహేంద్ర, అనుపమ కూడా రిషి ఫ్లెక్సీలు చూసి షాకవుతారు. రిషి కాలేజీకి రావడం ఏంటి? ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టి ఉంటారని అనుకుంటాడు. అక్కడే ఉన్న ఓ స్టూడెంట్...ఈ ఫ్లెక్సీలను వసుధార పెట్టించిందని అంటాడు.వసుధార దగ్గరకు వెళ్లి రిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు. కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పాలి కదా అని మహేంద్ర, అనుపమ వసుధారపై ఫైర్ అవుతారు. ఆ ఫ్లెక్సీలు పెట్టింది తాను కాదని శైలేంద్ర అని మహేంద్రతో చెబుతుంది వసుధార. శైలేంద్ర మనల్ని తెలివిగా ఇరికించాడని, శైలేంద్ర ఇంత దెబ్బ కొడతాడని ఊహించలేదని అంటాడు. రిషిని తీసుకొస్తే శైలేంద్ర ఏదైనా ఆపద తలపెట్టే ప్రమాదం ఉందని..తీసుకురాకపోతే స్టూడెంట్స్ ఊరుకోరని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణీంద్ర కూడా...నువ్వు చాలా మంచి పనిచేశావని వసుధారను పొడుగుతాడు. రిషిని తీసుకొస్తానని చెప్పి మాకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చావు. రిషి వస్తున్నాడని తెలిసి స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ ఆనంద పడుతున్నారు. ఇప్పుడే ఈవెంట్‌కు నిండుదనం వచ్చిందంటాడు.
Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!
శైలేంద్ర - వసుధార
ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక వసుధార ఆలోచనలో ఉండగా..అక్కడకు వచ్చిన శైలేంద్ర మరింత రెచ్చగొడతాడు.
శైలేంద్ర: నువ్వు రిషిని తీసుకురావని నాకు తెలుసు..ఆ ఫ్లెక్లీలు వేసింది ఎందుకు అనుకున్నావ్...రిషి వస్తే హారతి పట్టేందుకు కాదు.. ఆ ఫ్లెక్లీలవల్ల రిషి వస్తాడని అందరూ హోప్స్ పెట్టుకుంటారు...రిషి రాడు కాబట్టి ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్. కాలేజీ మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. గెస్టులను దగ్గరుండి నేనే రెచ్చగొడతాను..అదే జరిగితే నీ ఎండీ పోస్ట్ ఊడిపోతుంది...
వసుధార: అప్పటి వరకూ భయంగా కనిపించిన వసుధార కూల్ గా మారుతుంది... నువ్వు ముచ్చట పడ్డట్లుగానే రిషిని ఇక్కడికి తీసుకొస్తున్నాను. నువ్వు మాకు ఎవరికి చెప్పకుండా చాలా ఖర్చుపెట్టి చాలా ఫ్లెక్సీలు పెట్టించావు. నీ కష్టాన్ని వృథా చేయకుండా రిషి సర్ ని తీసుకొస్తున్నాను. ఫెస్ట్ సక్సెస్ కావడం ఖాయం. ఈ రోజుతో నీ గేమ్ ముగించేస్తా..అన్ని ఆధారాలతో నీ నిజస్వరూపం రిషి ముందు బయటపెడతా, నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం నిన్ను చూసి భయపడే రోజులు పోయాయని, నువ్వా..నేనా తేల్చుకుందాం..
వసుధార మాటలకు శైలేంద్ర నిజంగానే భయపడతాడు...
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది....