అన్వేషించండి

Friendship Compatibility by Zodiac Sign: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!

మీకు మంచి స్నేహితులు ఎవరు? ఎవరితో స్నేహం మీకు కలకాలం ఉంటుంది? కొందరితో స్నేహం చేద్దామనుకున్నా ఎందుకు పొసగదు? ఇదంతా మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..

Friendship Compatibility by Zodiac Sign: కొందరి మధ్య స్నేహం అస్సలు చెక్కుచెదరదు, మరికొందరు ఎంత స్నేహంగా ఉందామని ప్రయత్నించినా నిత్యం వాదులాడుకుంటూనే ఉంటారు. ఇదంతా మీ రాశి తత్వంపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్రం పండితులు. సాధారణంగా మేషం నుంచి మీనం వరకూ 12 రాశులలో మూడు మూడు రాశుల చొప్పున పంచభూతాల్లో నాలుగు తత్వాలైన అగ్ని, నీరు, భూమి, వాయువుకి సంకేతం. మీ రాశి తత్వం ఆధారంగా మీ స్నేహబంధం ఆధారపడి ఉంటుందంటారు. 

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఉత్తమ స్నేహితులు సింహం, ధనస్సు రాశులవారు అని చెప్పొచ్చు. ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 

Also Read: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
 
వృషభరాశి వారు స్థిరత్వం , విధేయతను ఇష్టపడతారు. మకరం , కన్య రాశులు కూడా భూమికి సంకేతం కావడంతో వీరి మధ్య స్నేహం చాలా నమ్మకంగా ఉంటుంది. 

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మిథునరాశి వారికి మాట్లాడడం అంటే భలే ఇష్టం. వాయు తత్వానికి చెందిన ఈ రాశివారికి ఉత్తమ స్నేహితులంటే మాత్రం కుంభ, తులా రాశులవారే. వారు ఆసక్తికరమైన సంభాషణను ఇష్టపడతారు. వీరిమధ్య స్నేహం ఆహ్లాదకరంగా ఉంటుంది. 

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశివారికి ఏ విషయంపై అయినా శ్రద్ధ, అనగాహన ఉంటుంది. నీటి సంకేతానికి చెందిన కర్కాటక రాశివారికి మంచి దోస్తులంటే మాత్రం వృశ్చికం, మీన రాశులకు చెందిన వ్యక్తులే. వీరి మధ్య స్నేహం చాలా లోతుగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఓదార్పు , మద్దతు ఇచ్చుకుంటారు.

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహరాశి వారు తాము వృద్ధి చెందడంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. వీరికి మేష రాశి, ధనస్సు రాశివారితో మంచి స్నేహం ఉంటుంది. ఈ మూడు రాశులు అగ్నికి సంకేతం. 

Also Read: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యా రాశివారు అన్నీ ఆచరణాత్మకంగా  ఉండాలి అనుకుంటారు. భూ తత్వానికి నిదర్శనం అయిన ఈ రాశులవారికి అదే తత్వానికి చెందిన వృషభం, మకర రాశివారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ మూడు రాశులవారి మధ్య స్నేహం సురక్షితంగా ఉంటుంది. 

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులారాశివారు సామరస్యాన్ని కోరుకుంటారు. వీరికి మిథునం, తులా, కుంభ రాశులవారితో స్నేహం కలిసొస్తుంది. ఈ నాలుగు రాశులకు చెందిన వారి ఆసక్తులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చికరాశి వారికి ఏ విషయంలో అయినా మంచి అభిరుచి ఉంటుంది. ఈ రాశివారికి మంచి స్నేహితులు అంటే కర్కాటకం, మీన రాశికి చెందిన వారే అని చెప్పాలి. ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం ఏర్పడితే ఎప్పటికీ ఉండిపోతుంది

ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ధనుస్సు రాశివారు  ఓపెన్ మైండెడ్. వీరికి మేషం, సింహ రాశులవారితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. వీరి స్నేహం డైనమిక్ గా ఉంటుంది. 

Also Read: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకరరాశి వారు సంకల్పానికి విలువ ఇస్తారు. వృషభం మరియు కన్య, రెండు భూమి తత్వానికి చెందిన రాశులవారు వీరికి ఉత్తమ స్నేహితులు అవుతారు. 

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభ రాశి వారు వాస్తవంలో ఉంటారు. తులా, మిథున రాశులవారు వీరికి ఉత్తమ స్నేహితులు అవుతారు. మేధోపరమైన చర్చలు , వినూత్న ఆలోచనలు పంచుకుంటారు. 

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీనం రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. కర్కాటకం, వృశ్చికం రాశులకు చెందిన వ్యక్తులు వీరికి మంచి స్నేహితులు అవుతారు. ఈ మూడురాశులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం చాలా సున్నితంగా ఉంటుంది. 

ఇవి కేవలం మీ రాశుల ఆధారంగా చెప్పిన కొన్ని వివరాలు మాత్రమే. నిజమైన స్నేహాలు ఇంతకు మించి ఉంటాయి. అలాంటి స్నేహం కావాలంటే వారితో మీరు నమ్మకంగా వ్యవహరించడం, కష్టసమయంలో నేనున్నా అని భరోసా ఇవ్వడం ప్రధానం..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget