అన్వేషించండి

Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

Zodiac signs:పిల్లలంతా తెలివైన వాళ్లే...కొందరిలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయ్, మరికొందరిలో క్రియేటివిటీ ఉంటుంది..ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం.. వారిలో ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటో వారి రాశి చెప్పేస్తుంది

Astrology: ఈ జనరేషన్ పిల్లలు మహా తెలివిగా ఉంటున్నారు. ఒకర్ని మించి మరొకరు అనేలా ఉన్నారు. ఏ తల్లిదండ్రులను కదిపినా ఇదే మాట. మా పిల్లలు ఇలా ఉన్నారంటే...మా వాళ్లు అంతకుమించి అంటున్నారు. వాస్తవానికి ఈ జనరేషన్ పిల్లలందరూ తెలివైనోళ్లే. వాళ్లకి మనం ప్రత్యేకంగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగాప్రవర్తిస్తుంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. మరి ఏ రాశిలో పుట్టిన పిల్లల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో వాళ్ల జన్మ రాశి చెప్పేస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు...

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేషరాశిలో పుట్టిన పిల్లల్లో లీడర్ షిప్ క్వాలిటీస్ ఫుల్ గా ఉంటాయి. ఎంత క్రిటికల్ కండిషన్లో అయినా కూల్ గా ఉంటారు, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే  సామర్థ్యం కలిగి ఉంటారు. కేవలం వీరి సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు…ఎదుటివారెవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించడంలోనూ మేషరాశి పిల్లలు ముందుంటారు.

Also Readకెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు పట్టుదల ఎక్కువ. అందరికీ సాధారణంగా కనిపిస్తారు, ఏదోలే అన్నట్టుంటారు కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎదుగుతారు. పైగా ఓ టార్గెట్ పెట్టుకుంటే కచ్చితంగా సాధించేస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరిలో సంకల్ప బలం చాలా ధృడంగా ఉంటుంది. అందుకే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తిచేసేస్తారు.

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మిథున రాశిలో జన్మించిన పిల్లల్లో క్రియేటివిటీ చాలా ఎక్కువ. మాంచి మాటకారులు. ఎదుటివారిని మాటలతో ఇట్టే కట్టిపడేస్తారు. సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఏ పని చేయడంలో అయినా వీరి రూటే సెపరేటు. వయసు చిన్నదే అయినా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి.

Also Read: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి పిల్లలు ఎదుటి వారి భావాలకు ఎక్కువ విలువనిస్తారు. తమకో ఆలోచన ఉన్నప్పటికీ ఎదుటివారి కంఫర్ట్ ని ఆలోచించి నడుచుకుంటారు. ఎంత కఠినమైన వ్యక్తిని అయినా అర్థం చేసుకునే నైపుణ్యం కర్కాటక రాశివారి సొంతం. మరీ ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన పిల్లలు ఏ విషయాన్ని అస్సలు దాచుకోలేరు..ఓ విషయం తెలిస్తే వెంటనే దాన్ని ఎవరో ఒకరికి చెప్పేస్తారు.

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహ రాశిలో పుట్టిన పిల్లలు..వారి సామ్రాజ్యంలో వాళ్లే యువరాజులు. వీరిలో నాయకత్వ లక్షణాలకు కొదవే ఉండదు.ఈ రాశివారి ప్రవర్తన కూడా వంద మందిలో ప్రత్యేకంగా ఉంటుంది. అంతులేని శక్తి సామర్థ్యాలు కలిగిఉంటారు. ఒకపని అనుకుంటే భయపెట్టో బతిమిలాడో చేయించుకునే నేర్పు కలిగి ఉంటారు. 
'
కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యారాశిలో జన్మించిన పిల్లల్లో కచ్చితత్వం ఎక్కువ. ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచీ అన్ని పనుల్లోనూ చాలా నియమబద్దంగా వ్యవహరిస్తారు. ఆటల్లో, చదువులో అన్నింటిలోనూ వీరిదే ప్రధమ స్థానం…

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులారాశి  పిల్లల్లో…త్రాసులు సమానంగా తూగుతాయన్నట్టు సహనం, ఓర్పు అన్నీ సమానంగా ఉంటాయ్. ఎవరితో ఎలా ప్రవర్తించాలి…ఎవర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి…ఎవరి వల్ల తమపని పూర్తవుతుందనే విషయాలపై వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో తమ పనులు పూర్తిచేయించుకోవడంలో వీళ్లు మహా  నేర్పరులు.

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు ఏదైనా అనుకుంటే చాలు…గోల్ రీచ్ అయ్యేవరకూ కష్టపడతారు. ఏ పని చేసినా మొక్కుబడి అనే మాటే ఉండదు. పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తారు. అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరి సొంతం. వీరి అభిరుచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయ్.

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ధనుస్సు రాశిలో జన్మించిన పిల్లలు  ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా మార్చుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి. సమస్య పెద్దది అయినా..చిన్నది అయినా …చివరికి అసాధ్యమైనది అయినా..గట్టి సంకల్పంతో పూర్తి చేస్తారు…

మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశిలో జన్మించిన పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటారు. ఏ పని చేయాలి, ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి..నష్టం ఏంటి బేరీజు వేసుకుంటారు. లాభం అయితే ముందడుగు వేస్తారు. నష్టం అని అనిపించినా, వృధా అనే ఆలోచన వచ్చినా అస్సలు అటువైపు పోనేపోరు. వీళ్లు ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు…

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ చాలా ఎక్కువ. సమస్యలను నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు.

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశిలో జన్మించిన పిల్లలు వండర్ ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి. ఇతరుల సమస్యలపై త్వరగా స్పందిస్తారు. అవసరమైన సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నదే వీళ్ల నైజం. ఎవ్వరు ఏం చెప్పినా అర్థం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తారు.

గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Embed widget