Astrology: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!
Zodiac signs: ఓ విషయంపై ఎంత స్పష్టంగా చెప్పినా వినకుండా వాదనకు దిగినప్పుడు..మొండిగా వాదించకు అంటుంటారు. ఎంత చెప్పినా తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుంటారు...ఈ నాలుగు రాశులవారు ఇలాగే ఉంటారట
Astrology: నిత్యజీవితంలో భిన్న రకాల మనుషులను చూస్తుంటాం. అందులో ఏ ఇద్దరి ప్రవర్తన ఒకేలా ఉండదు. కొందరు మృధుస్వభావంతో ఉంటారు. మరికొందరు పరుషంగా మాట్లాడతారు. ఇంకొందరు సర్దుకుపోయే మనస్తత్వంతో ఉంటారు. వారు పుట్టిన నక్షత్రం, రాశి, గ్రహసంచారం ఆధారంగానే ఇలా ప్రవర్తిస్తారని చెబుతారు జ్యోతిష్య పండితులు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారట. ఎంతసేపూ వాళ్లు చెప్పిందే కానీ ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా అస్సలు తగ్గరు. వాళ్ల ఆలోచన మార్చుకోరు. తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అన్న ధోరణి తప్ప… ఎదుటివారి అభిప్రాయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోరు. అలాంటి రాశులు నాలుగున్నాయి..ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేషరాశి వారు చాలా తెలివైనవారు. తమకు తెలియనిది లేదనే గర్వం వీరిలో కొంత ఉంటుంది. అందుకే తాము చేయాలనుకున్నదే చేస్తారు. వారు చెప్పినదే కరెక్ట్ అని భావిస్తారు. ఎవరైనా తాము చెప్పినదానికి అడ్డం వస్తే అస్సలు భరించలేరు. కోపగించుకోవడమే కాదు…తమ అభిప్రాయం చెప్పిన వారితో వాదనకు దిగుతారు కానీ అస్సలు అభిప్రాయం మార్చుకోరు.
Also Read: ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహరాశి వారు స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు. వారికి ఏదైనా నచ్చకపోతే..అక్కడితో వదిలేయరు. వాదనకు దిగుతారు. ఎదుటివారు చెప్పింది అస్సలు వినరు. పోనీ నచ్చచెబుదాం అని ఎవరైనా ప్రయత్నించినా కానీ వీరి అహం దెబ్బతిన్నట్టు భావిస్తారు. తమకు చులకన చేస్తున్నారనే ఆలోచనలోకి వెళ్లిపోతారు. అందుకే వాదిస్తారు కానీ వెనక్కు తగ్గరు. సింహరాశివారితో గొడవపడి గెలవడం కష్టం.
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులారాశివారు నిశ్చల స్వభావం కలిగి ఉంటారు. త్రాసులా సమానంగా తూగుతారు. తమ గురించి ఆలోచించుకుంటారు…ఇతరుల గురించి కూడా బాగా ఆలోచిస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా….కోపం వచ్చిందంటే చాలు వీళ్లు వాస్తవ స్వభావాన్ని కోల్పోతారు. ఎదుటవ్యక్తి తమ గురించి ఏం అనుకుంటారనే అలోచన లేకుండా వాదన మొదలుపెడతారు. ఆ సమయంలో వీళ్లు చెప్పినది అంగీకరించడం మినహా మరో ఆప్షన్ ఉండదు. ఎదురుచెప్పినా భరించలేరు.
Also Read: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుంభం రాశివారు తమ జీవితంలో చాలా కష్టపడతారు. ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటారు కానీ.. కుంభరాశి వారుమాత్రం ఇంట్లో కన్నా బయటే ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం పొందడమే కాదు..పరువు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.అందుకే వీరిలో కొంచెం ఆధిపత్య భావన కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా తమ మాటను వ్యతిరేకిస్తే అంగీకరించలేరు. ఎదుటి వారి అభిప్రాయం తప్పు అని…తాము తీసుకున్న నిర్ణయమే సరైనదని వాదిస్తారు. పైగా కుంభరాశివారు కోపంగా ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. కానీ కోపం తగ్గాక మాత్రం ఏది తప్పు, ఏది కరెక్ట్ అనే విషయాన్ని సరిగ్గానే అంచనా వేస్తారు.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…