Daily Horoscope Today Dec 6, 2023 : ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. డిసెంబరు 06 , 2023 ఈ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...
Daily Horoscope Today Dec 06, 2023 : వృషభం, సింహం, తులారాశి, కుంభ రాశులవారికి ఈ రోజు గొప్పరోజు అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో లాభపడతారు.
మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశివారాకి ఈ రోజు చాలా మంచిరోజు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. వాహన ఆనందాన్ని పొందుతారు.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ రాశివారి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. ఈ రోజు ఆవులకు మేత తినిపించండి మీకు మంచి జరుగుతుంది. తెలియని సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ రాశివారు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. పిల్లలతో సమయం గడుపుతారు. ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. రాజకీయ విషయాలపై సన్నిహితులతో వాగ్వాదం ఉండవచ్చు. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. విద్యార్థులు లాభపడతారు.
Also Read: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే అప్రమత్తంగా ఉండండి. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తిరగబెడతాయి. రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ లో ఉన్న పని పెండింగ్ లోనే ఉంటుంది. నిరుద్యోగులు ఇంకొంత కాలం ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహ రాశివారికి ఈ రోజు మంచి రోజు. వాహన ఆనందం పొందే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారు పెద్ద పదవులు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగుతుంది. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందుతారు.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రాశివారు ఈ రోజు ఎవరికీ సలహాలు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు అవసరం అయిన సహాయం అందుతుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో గుడ్ న్యూస్ వింటారు. బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి..అకస్మాత్తుగా వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఆహారంపై నియంత్రణ ఉండాలి. ఈరోజు సాధారణ రోజు అవుతుంది.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులారాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. కొత్తగా చేపట్టే పనుల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులపై ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. గృహ అవసరాలు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ఆందోళనలు పెరగవచ్చు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. భౌతిక వనరులలో తగ్గుదల ఉంటుంది. ఎవరైనా సలహా ఇచ్చిన వెంటనే పాటించేయవద్దు..మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ రాశివారు సన్నిహితుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. అసరమైనవారి సహాయం చేయడం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోపంగా మాట్లాడొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ రాశి వివాహితుల మధ్య మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఈ రోజు మీరు చేసిన ఓ పొరపాటు కారణంగా మీరు సన్నిహిత వ్యక్తుల నుంచి విడిపోవచ్చు. రిస్క్ తీసుకోవడం వల్ల నష్టపోతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. ఓపిక పట్టాలి. వ్యాపారానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పెరగవచ్చు. ఉద్యోగంలో అధికారులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. ఈ రోజు మీరు స్నేహితుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కొత్త మూలాల నుంచి ఆదాయం పొందుతారు.
మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశివారు కొత్త వ్యక్తులను కలుస్తారు..వారి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పరిధులను దాటి నిర్ణయం తీసుకోవద్దు. మీ నుంచి కొందరు దూరమయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదం జరగొచ్చు. వాహానాన్ని జాగ్రత్తగా నడపండి. ఈ రోజు కొంత గందరగోళంగా ఉంటుంది.
Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.