అన్వేషించండి

Guppedantha Manasu January 23rd Episode: శైలేంద్రకి స్ట్రాంగ్ కౌంటర్ - వసుధార ఇంటికి రాజీవ్ , మొత్తం మీరే కారణమన్న అనుపమ!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 23rd Episode:  (గుప్పెడంతమనసు జనవరి 23 ఎపిసోడ్)

కాలేజీలో యూత్‌ఫెస్టివ‌ల్ నిర్వ‌హించాల‌ని బోర్డ్ మెంబ‌ర్స్ నిర్ణ‌యం తీసుకుంటారు. వ‌సుధార వ‌ద్ద‌ని చెప్పినా వాళ్లు విన‌రు. రిషి లేకుండా యూత్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌డం త‌న వ‌ల్ల అవుతుందో లేదో వ‌సుధార అనుకుంటుంది. మహేంద్ర కూడా అదే అనుకుంటాడు. ఫణీంద్ర మాత్రం ముందుకు వెళ్లడమే బెటర్ అంటాడు. వసుధార టైమ్ తీసుకుందాం అని చెప్పినా కానీ బోర్డ్ మెంబర్స్ వినరు. నువ్వు ఎండీగా నువ్వు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత జ‌రిపిస్తున్న ఫ‌స్ట్ కార్య‌క్ర‌మం ఇది..దీనిని గ్రాండ్‌గా స‌క్సెస్ చేయాలి ఎందులోనూ ఏ లోటు రాకూడ‌ద‌ంటాడు ఫణీంద్ర. మీటింగ్ ముగిసిన తర్వాత అందరూ వెళ్లిపోతారు..

క్యాబిన్లో కూర్చున్న వసుధార..గతంలో యూత్ ఫెస్టివల్ సమయంలో రిషితో స్వీట్ మెమొరీస్ ను గుర్తుచేసుకుంటుంది. అవన్నీ తలుచుకుని కన్నీళ్లుపెట్టుకున్న వసుధారని ఓదార్చుతాడు మహేంద్ర. 
వసు: జ‌గ‌తి మేడ‌మ్‌, రిషి సార్ నా ప‌క్క‌న లేకుండా ఫ‌స్ట్ టైమ్ ఈ పోగ్రామ్‌ను జ‌రిపించాల్సివ‌స్తోంది..ఇలాంటి రోజొకటి వస్తుందని అనుకోలేదు
మహేంద్ర: ఓవైపు రిషి అనారోగ్యం...మ‌రోవైపు మ‌న చుట్టూ కుట్ర‌లు...ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నువ్వు ఈ యూత్‌ఫెస్టివ‌ల్ జ‌రిపించ‌గ‌ల‌వా 
వసు: మ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి స్టూడెంట్స్ కోసం ఈ యూత్‌ఫెస్టివ‌ల్ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ు. రిషి సర్ అండ‌దండ‌లే నాకు కొండంత బ‌లం. రిషితో పాటు ఫ‌ణీంద్ర సర్ నాపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు. వారి న‌మ్మ‌కం నిల‌బెట్ట‌డం నా బాధ్య‌త.
మహేంద్ర:  నువ్వు ఎండీ ప‌ద‌వికి అన్‌ఫిట్ అని చాలామంది అన్నారు కానీ అన్నయ్య మాత్రం నిన్ను ఎప్పుడూ  ఒక్క మాట అన‌లేదు. అన్న‌య్య నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. అండ‌గా ఉంటారు. నువ్వు ఏ విష‌యంలో భ‌య‌ప‌డ‌కుండా ఏ కావాల‌న్నా మ‌మ్మ‌ల్ని అడ‌గ‌ు 
మ‌హేంద్ర వెళ్లిపోయిన త‌ర్వాత రిషి ఛైర్‌ను చూస్తూ మీరు ఎక్క‌డున్నా నా ప‌క్క‌నే ఉన్నార‌నుకుని ఈ ఫెస్ట్ స‌క్సెస్ చేస్తాన‌ు అనుకుంటుంది వసుధార...

Also Read: చేతులు కలిపిన దేవయాని, రాజీవ్‌ - రిషి ని చంపేస్తానన్న రాజీవ్

శైలేంద్ర మరో కుట్ర
వ‌సుధార‌ను దెబ్బ‌కొట్ట‌డానికి నేను వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అసలు నేనంటే భయం లేకుండా ప్రవర్తిస్తోంది. యూత్ ఫెస్ట్ రూపంలో వచ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ి. ఫెస్టివ‌ల్‌లో వ‌సుధార‌ను ఎండీ ప‌ద‌వికి అన్‌ఫిట్ అని చిర‌స్థాయిగా నిలిచిపోయేలా చేయాల‌ి. ఇన్నాళ్లు నేనొక్క‌డినే వసుధారకి శ‌త్రువును. ఇప్పుడు నాకు తోడుగా నీ బావ వ‌చ్చాడు. కుర్చీ కోసం నేను...నీ కోసం వాడు...మేము వేసే ప్ర‌తి అడుగు నీ ప‌త‌నానికి నాంది ప‌లుకుతుంది. చివ‌ర‌కు ఎవ‌రికి కావాల్సింది వాళ్లం తీసుకుంటాం. జ‌ర‌గ‌బోయేది ఇదే 

వసుధార ఇంటికి రాజీవ్
వ‌సుధార‌ను చూడ‌టం కోసం ఫుడ్‌ డెలివ‌రీ బాయ్‌గా అవ‌తారం ఎత్తుతాడు రాజీవ్‌.  నిన్ను చూడ‌టానికి ఈ గెట‌ప్‌లో వ‌చ్చాను. నీ కోసం ఎన్ని అవ‌తారాలైన ఎత్తుతాను అని రాజీవ్ అనుకుంటాడు. వ‌సుధార గుర్తుప‌ట్ట‌కుండా ఫేస్ మాస్క్ వేసుకుంటాడు.  వ‌సుధార వ‌చ్చి డోర్ తీస్తుంది..తనని చూసి మురిసిపోతాడు. ఎవ‌రు మీరు అని రాజీవ్‌ను అడుగుతుంది. ఫుడ్ డెలివ‌రీ ఇవ్వ‌డానికి వ‌చ్చానంటాడు. మహేంద్ర ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటాడు అనుకుంటుంది. వసుధారని ముట్టుకునేందుకు ప్రయత్నించడంతో రాజీవ్ ను గుర్తుపడుతుంది. ఫేస్ మాస్క్ తీయమని పట్టుబడుతుంది. ఇంతలో మహేంద్ర పిలవడంతో అటుతిరిగి సమాధానం చెప్పేలోగా తప్పించుకుని పారిపోతాడు రాజీవ్. 

Also Read: ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, జనవరి 23 రాశిఫలాలు

యూత్ ఫెస్టివ‌ల్ ఏర్పాట్ల గురించి స్టూడెంట్స్‌తో మాట్లాడుతుంటుంది వ‌సుధార‌. ఆమెను దూరం నుంచి శైలేంద్ర చూస్తాడు. వ‌సు ఆనందంగా కనిపించడం చూసి తట్టుకోలేకపోతాడు
శైలేంద్ర: న‌మ‌స్తే ఎండీగారు. చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు. రిషి ప‌క్క‌నున్న‌ప్పుడు ఎంత చురుకుగా ప‌నిచేస్తున్నారో అంతే యాక్టివ్‌గా ఉన్నారు. కొంప‌దీసి రిషి ప‌క్క‌నే ఉన్న‌ట్లుగా ఊహించుకుంటున్నారు. అలిజినేష‌న్ అనే డిజార్డ‌ర్ మీకు వ‌చ్చిందా...లేదంటే మీ ప్రేమ చ‌చ్చిపోయిందా
వసుధార: నోరు ముస్తావా 
శైలేంద్ర: యూత్ ఫెస్టివ‌ల్ అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంది. ఈ ఫెస్టివ‌ల్ నిన్ను క‌ష్టాల్లోకి నెట్ట‌డం ఖాయ‌ం
వసు: నువ్వు నన్నేం చేయలేవు
శైలేంద్ర: మా పిన్ని కూడా ఇలాగే రెచ్చిపోయి మాట్లాడింది. ఆమెను ప‌క్క‌కు త‌ప్పించాం. అలాగే రిషి అడ్రెస్ లేకుండా ఎక్క‌డో ఉన్నాడు . ఆ త‌ర్వాత నీ వంతు
వసు:  పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మొహం ప‌గ‌డ‌గొడ‌తాన‌ు. ప‌నిలో ఉన్న‌వాళ్ల‌ను డిస్ట్ర‌బ్ చేస్తే బాగుండ‌ద‌ు 
శైలేంద్ర: నువ్వో ఎండీవీ...నువ్వు చేస్తున్న‌దో ప‌ని 
వసు: నువ్వు క‌నీసం ఎండీ సీట్ కోసం అర్హ‌త సాధించ‌లేక‌పోయావు. ఎండీ సీట్‌లో ఎవ‌రిని కూర్చోబెట్టాల‌ని అనుకున్న‌ప్పుడు రిషి, ఫ‌ణీంద్ర తో పాటు మిగిలిన వాళ్లు క‌నీసం నీ పేరు కూడా తీయ‌లేదు అది నీ స్థాయి ..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేదంటే చేయికి ప‌నిచెప్పాల్సివ‌స్తుంది..
ఆ త‌ర్వాత స్టూడెంట్‌ను శైలేంద్ర సార్‌కు ఒళ్లు తిమ్మిరిగా ఉంద‌గా అది పోగోట్ట‌డానికి పీఈటీ సార్‌ను పిల‌వండి అంటూ సెటైర్ వేస్తుంది. 

మ‌హేంద్ర - అనుపమ
స్టూడెంట్స్‌తో యూత్ ఫెస్టివ‌ల్ గురించి మాట్లాడ‌టానికి వెళ్లిన వసుధార ఆల‌స్యంగా క్యాబిన్‌లోకి రావ‌డం చూసి మ‌హేంద్ర‌, అనుప‌మ కంగారు ప‌డ‌తారు. వ‌సుధార చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తుంది.  శైలేంద్ర వ‌చ్చి డిస్ట్ర‌బ్ చేసిన సంగ‌తి చెబుతుంది. యూత్ ఫెస్టివ‌ల్‌తో మీకు క‌ష్టాలు మొద‌ల‌వుతాయ‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ంటుంది. 
అనుపమ: మీ మౌన‌న్ని శైలేంద్ర‌ అలుసుగా తీసుకుంటున్నాడు. మీ మంచిత‌నాన్ని చేత‌గానిత‌నంగా భావిస్తున్నాడ‌ు..మొద‌టి నుంచే వాడికి స‌రిగ్గా బుద్ది చెబితే ఇంత న‌ష్టం జ‌రిగేది కాదు. ఇంత బాధ అనుభ‌వించాల్సివ‌చ్చేది కాదు. వాడు దుర్మార్గుడు అని తెలిసిన రోజే శైలేంద్ర నిజ‌స్వ‌రూపం గురించి ఫ‌ణీంద్ర‌, రిషికి చెబితే ఇంత దూరం వ‌చ్చుండేది కాదు. జ‌గ‌తి దూర‌మ‌య్యేది కాదు, రిషికి ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ు
ఎపిసోడ్ ముగిసింది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget