అన్వేషించండి

Guppedanta Manasu Serial Today January 22nd: చేతులు కలిపిన దేవయాని, రాజీవ్‌ - రిషి ని చంపేస్తానన్న రాజీవ్

Guppedanta Manasu Today Episode: రిషిని చంపేందుకు దేవయాని, రాజీవ్ కొత్త ప్లాన్ వేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

 Guppedanta Manasu  Serial Today Episode:  దేవ‌యాని, శైలేంద్ర క‌లిసి రాజీవ్ ను పావుగా వాడుకోవాల‌ని అనుకుంటారు. వ‌సుధార‌ను దెబ్బ‌కొట్ట‌డానికి రాజీవ్‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవాల‌ని అనుకుంటారు. వ‌సుధారకు న‌ర‌కాన్ని, దుఃఖాన్ని ప‌రిచ‌యం చేసిందే రాజీవ్ అంటూ అత‌డు ఎంత‌టి దుర్మార్గుడో కొడుకుకు చెబుతుంది దేవ‌యాని. చాలా సేప‌యిన రాజీవ్ రాక‌పోవ‌డంతో అత‌డికి కాల్ చేస్తుంది దేవ‌యాని.

రాజీవ్‌: హలో చెప్పండి మేడం జీ

దేవయాని: ఎంతసేపయ్యింది త్వరగా రా..!

రాజీవ్‌: క్షణాల్లో రావడానికి నేనేం మామలు మనిషిని కాదు మేడం జీ, త‌ప్పించుకొని తిరుగుతున్న నేర‌స్తుడిని నేను రావ‌డానికి టైమ్ ప‌డుతుంది మేడం జీ.

అనగానే ఇంకెంత టైం పడుతుంది అంటూ  దేవ‌యాని అడగడంతో దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు రాజీవ్‌. మరోవైపు రిషికి ట్రీట్‌మెంట్ ఎలా సాగుతుందో వీడియో తీసి పంపించ‌మ‌ని తండ్రితో అంటుంది వ‌సుధార‌. కానీ చ‌క్ర‌పాణి ఆల‌స్యం చేయ‌డంతో వ‌సుధార కంగారు ప‌డుతుంది. వీడియో మెసేజ్ రాగానే ఆమె కంగారు త‌గ్గుతుంది. వీడియోలో రిషి డ‌ల్‌గా ఉన్నాడేంటని చక్రపాణిని అడుగుతుంది వసుధార.

చక్రపాణి: గ‌తంలో కంటే అల్లుడుగారు మ‌రింత యాక్టివ్‌గా ఉన్నారు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదమ్మ. నువ్వేం కంగారుపడకు.

వసుధార: సర్‌కు ఫ్రూట్స్‌ తినిపించండి నాన్నా. జావ కూడా తాగించండి. జూస్‌ కూడా తాగించండి. అక్కడ దొరక్కపోతే నేను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి పంపిస్తాను. లేకపోతే నేనే ఏదో విధంగా తీసుకొస్తాను.

చక్రపాణి: వద్దులేమ్మా ఇక్కడికి దగ్గరలో మార్కెట్‌ ఉంది. అక్కడ అన్నీ దొరుకుతున్నాయి.

   అంటూ వసమ్మా నువ్వు మాటిమాటికి ఇక్కడకు రాకపోవడమే మంచిది. ఫోన్‌ కూడా చేయకు.. ఏదైనా అవసరం అయితే నేనే ఫోన్‌ చేస్తాను అని చెప్తుండటంతో వసుధార దగ్గరకు మహేంద్ర, అనుపమ వస్తారు.  వ‌సుధార ద‌గ్గ‌ర నుంచి ఫోన్ తీసుకొని చ‌క్రపాణితో మాట్లాడుతూ.. ఎమోషనల్‌ ఫీలవుతాడు మహేంద్ర. తండ్రిగా తాను రిషికి చేయాల్సిన ప‌నులు మీరు చేస్తున్నారంటూ చ‌క్రపాణికి థాంక్స్ చెబుతాడు మ‌హేంద్ర‌. అనారోగ్యంతో ఉన్నవారికి అంద‌రూ సాయం చేయ‌ర‌ని, మీరు మంచి మ‌న‌సుతో రిషికి ఎన్నో సేవ‌లు చేస్తున్నార‌ని చ‌క్రపాణితో అంటాడు మ‌హేంద్ర‌. రిషి త‌న కొడుకులాంటివాడేన‌ని.. రిషి బాగోగులు చూసుకోవ‌డం నా బాధ్యత  అంటాడు చక్రపాణి. తండ్రి ఫోన్ క‌ట్ చేయ‌గానే వ‌సుధార క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

వసుధార: ఈ బాధ‌ను భ‌రించ‌లేక‌పోతున్నాను. రిషి సర్‌కి ఎందుకు అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందో అర్థం కావడం లేదు.  ఎదుటివాళ్లు క‌ష్టాల్లో ఉంటే అది త‌న‌దనుకొని రిషి సార్‌ వారికి సాయ ప‌డుతుంటాడు. క‌నీసం చీమ‌కు కూడా హానీ చేయ‌ని మ‌న‌స్త‌త్వం సర్‌ది. అత‌డికే ఇలా ఎందుకు అయ్యిందో తెలియ‌డం లేదు.

అనుపమ: మ‌న‌కు ఎదురైన క‌ష్టం కంటే దేవుడు రెండింత‌ల ఆనందాన్ని ఇస్తాడు.  నువ్వు డీలా ప‌డిపోతే శ‌త్రువులు దానిని ఆస‌రాగా చేసుకొని మ‌రిన్ని స‌మ‌స్యలు క్రియేట్ చేస్తారు. నువ్వు మునుప‌టి వ‌సుధార‌లా మొండిత‌నం, ధైర్యంతోనే ఉన్నప్పుడే శైలేంద్రను దెబ్బకొట్టగ‌ల‌వు.

అంటూ అనుపమ, వసుధారలో ధైర్యాన్ని నింపుతుంది. మరోవైపు రాజీవ్‌కోసం అస‌హ‌నంగా వెయిట్ చేస్తుంటాడు శైలేంద్ర‌. హెల్మెట్ పెట్టుకొని అత‌డి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రాజీవ్ నువ్వు శైలేంద్ర‌వి క‌దా అని అడుగుతాడు. అవున‌ని, ఎలా న‌న్ను గుర్తుప‌ట్టావ‌ని రాజీవ్‌ను అడుగుతాడు శైలేంద్ర‌. వెధ‌వ‌ల‌ను మ‌రో వెధ‌వ మాత్ర‌మే గుర్తుప‌ట్ట‌గ‌ల‌డ‌ని వ‌చ్చి రావ‌డంతోనే శైలేంద్ర‌పై సెటైర్ వేస్తాడు రాజీవ్‌. ఆ త‌ర్వాత దేవ‌యాని కాళ్ల‌పై ప‌డ‌తాడు రాజీవ్‌. నా లాంటి విల‌న్స్ అంద‌రికి మీరు గురువు అంటూ వ‌చ్చి రావ‌డంతోనే దేవ‌యానిని తెగ పొగుడుతాడు రాజీవ్‌.

శైలేంద్ర: వ‌సుధారను నువ్వు అంత ఇష్ట‌ప‌డితే త‌ను నిన్ను ఎందుకు ప్రేమించ‌లేదు.

రాజీవ్‌: మ‌న‌ది చాలా వ‌ర‌స్ట్ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ డీటెయిల్‌గా తెలుసుకోక‌పోవ‌డ‌మే మంచిది..  పైపైన నా స్టోరీ తెలిసింది క‌దా అంత‌వ‌ర‌కు చాలు. నా లైఫ్‌లో ఉన్న ఒకే ఒక గోల్ వ‌సుధార. త‌న‌ను ద‌క్కించుకోవ‌డం కోసం మీ స‌పోర్ట్ కావాలి.

అంటూ  దేవ‌యానితో రాజీవ్‌ అనగానే  త‌న‌కు ఆల్రెడీ పెళ్లైపోయింది క‌దా అంటాడు శైలేంద్ర. నాకు పెళ్లైపోయింద‌ని, ఈక్వేష‌న్స్ ఈక్వెల్ అయ్యాయ‌ని శైలేంద్ర‌కు స‌మాధాన‌మిస్తాడు రాజీవ్‌.

మీరు న‌న్ను ఎందుకు క‌ల‌వాల‌ని అనుకుంటున్నార‌ని దేవ‌యానిని అడుగుతాడు రాజీవ్‌. మీకు ఏదో అవ‌స‌రం ఉండి ఉంటుంది. అందుకే న‌న్ను క‌లిశార‌ని రాజీవ్ అంటాడు.

దేవయాని: ఎండీ సీట్ కోసం చాలా దారుణాలు, అఘాయిత్యాలు చేశాము  కానీ ఏ ప్లాన్ స‌క్సెస్ కాలేదు. సీట్ ఇప్ప‌టికీ శైలేంద్ర‌కు ద‌క్క‌లేదు. రిషిపై నింద‌లు వేసి అత‌డిని మూడేళ్లు ఇంటికి దూరం చేశాం.  ఆ త‌ర్వాత ఎండీ సీట్‌లో ఉన్న జ‌గ‌తిని పైకి పంపించాం. అంత చేసినా ఇప్పుడు ఆ ఎండీ సీట్‌లో వ‌సుధార కూర్చుంది.  

  అంటూ దేవ‌యాని బాధ‌ప‌డుతుంది. నీకు ఆ ఎండీ సీట్ కావాలి, నాకు ఆ సీట్‌లో ఉన్న మ‌ర‌ద‌లు కావాలి అంటాడు రాజీవ్.  రిషి మ‌న‌కు అడ్డు...వాడిని లేపేప్తే వ‌సుధార విష‌యంలో నాకు లైన్ క్లియ‌ర్ అవుతుంది. నీకు ఎండీ సీట్ ద‌క్కుతుంద‌ని శైలేంద్ర‌తో అంటాడు రాజీవ్‌. రిషి సంగ‌తి నేను చూసుకుంటాను. వ‌సుధార‌ను నాకు అప్ప‌గించే ప‌నిలో మీరు ఉండండి అని శైలేంద్ర‌తో డీల్ కుదుర్చుకుంటాడు రాజీవ్‌.  వ‌సుధార‌ను ఇరికించేందుకు శైలేంద్ర మ‌రో నాట‌కం మొద‌లుపెడ‌తాడు. బోర్డ్ మీటింగ్ ఏర్పాటుచేసి యూత్‌ఫెస్టివ‌ల్‌ను ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటారు. ప్ర‌తి ఏడాది రిషి చేతుల మీదుగా యూత్ ఫెస్టివ‌ల్ జ‌రిగేద‌ని బోర్డ్ మెంబ‌ర్స్ అంటారు. అయితే వ‌సుధార మాత్రం ఆలోచ‌న‌లో ప‌డుతుంది. రిషి కోలుకున్న త‌ర్వాత యూత్ ఫెస్టివ‌ల్ జ‌రిపితే మంచిద‌ని మ‌న‌సులో అనుకుంటుంది. కొంతం టైమ్ త‌ర్వాత ఈ ఫెస్టివ‌ల్‌ను జ‌రుపుకుందామ‌ని ప్ర‌పోజ‌ల్ పెడుతుంది. కానీ బోర్డ్ మెంబ‌ర్స్ మాత్రం అందుకు ఒప్పుకోరు. దీంతో వ‌సుధార ఆలోచ‌న‌లో ప‌డుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ : శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు.. చబ్బీగా మారిపోయిన హీరోయిన్

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget