Guppedantha Manasu January 24th Episode: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - కాలేజ్ యూత్ ఫెస్టివల్ తో రిషి రీఎంట్రీ !
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu January 24th Episode: (గుప్పెడంతమనసు జనవరి 24 ఎపిసోడ్)
శైలేంద్ర నిజస్వరూపం గురించి ముందే బయటపెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుపమ ఫైర్ అవుతుంది. మరోసారి శైలేంద్ర ఇలా మాట్లాడితే చెంప పగలగొట్టు అంటుంది. ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకున్నాను కానీ పక్కన స్టూడెంట్స్ ఉండటంతో ఆగిపోయానని వసుధార అంటుంది. యూత్ ఫెస్టివల్‌ను ఫెయిలవుతుందని అంటున్నాడంటే శైలేంద్ర ఏదైనా ప్లాన్ చేస్తున్నాడంటావా అన్న మహంద్రతో అదేం ఉండదు అంటుంది అనుపమ.
Also Read: శైలేంద్రకి స్ట్రాంగ్ కౌంటర్ - వసుధార ఇంటికి రాజీవ్ , మొత్తం మీరే కారణమన్న అనుపమ!
కాలేజీ యూత్ ఫెస్టివల్ పనులు జరుగుతున్నాయా..నువ్వు కూడా హెల్ప్ చేయి అన్నీ వసుధార మీద వదిలేయవద్దంటాడు ఫణీంద్ర. ఏటా యూత్‌ఫెస్టివల్ పనుల్ని రిషి చూసుకునేవాడు. అతడికి తోడుగా వసుధార ఉండేది. కానీ ఈ ఏడాది రిషి కనిపించడం లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదంటాడు ఫణీంద్ర
దేవయాని: రిషి దూరమైన తర్వాత వసుధార మానసికంగా కుంగిపోయింది. రిషి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఆరాటపడుతోంది, ఇలాంటి పరిస్థితుల్లో యూత్ ఫెస్టివల్ బాధ్యతలు వసుధారకు భారం కావచ్చు, ఆమెకు కాకుండా శైలేంద్రకు యూత్ ఫెస్టివల్‌ను నిర్వహించే బాధ్యతల్ని అప్పగిస్తే మంచిది
ఫణీంద్ర: అంత తెలివితక్కువగా ఎలా మాట్లాడుతున్నావు. అసలు వీడికి ఏం తెలియదు, చిన్న ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయడమే రాదు. ఇంత పెద్ద ఫెస్ట్‌ను శైలేంద్ర నిర్వహించలేడు. రిషి చనిపోయాడని అబద్ధం న్యూస్ ప్రచారమైనప్పుడు కాలేజీని మూసేద్దామని శైలేంద్ర అన్నాడు. అదే వసుధార క్షణాల్లో సమస్యను సాల్వ్ చేసింది. నేను చెప్పింది కరెక్టా కాదా...యూత్ ఫెస్టివల్ బాధ్యతల్ని నీకు అప్పగించలేదని మీ అమ్మలానే ఫీలవుతున్నావా..అని అడుగుతాడు
శైలేంద్ర: అదేం లేదు...
ఫణీంద్ర: బోర్డు మెంబర్స్ అంతా ఎండీ పదవికి వసుధార అర్హురాలు కాదంటున్నారు ...వాళ్లే అర్హురాలు అంటున్నారు..
శైలేంద్ర: నేనే వాళ్ల మనసులో విషం నింపుతున్నాను అనుకుంటాడు
ఫణీంద్ర: ఈ యూత్ ఫెస్టివల్ సక్సెస్అయితే ఎండీ పదవికి ఆమె కరెక్ట్ అని బోర్డ్ మెంబర్స్ భావించే ఛాన్స్ ఉంది. ఈ యూత్ ఫెస్టివల్‌ను సక్సెస్ చేయడంలో వసుధారకు సాయం చేయమని శైలేంద్రకు చెప్పి వెళ్లిపోతాడు ఫణీంద్ర.
ధరణి: ఈ ఫెస్ట్ లో తప్పనిసరిగా వసుధారకి అడ్డంకులు క్రియేట్ చేస్తారు అనుకుంటుంది ధరణి.... ఇక్కడి నుంచి వెళ్లు అని కసురుకుంటుంది దేవయాని... ధరణి వెళ్లిపోతుంది
దేవయాని - శైలేంద్ర : యూత్ ఫెస్ట్ సక్సెస్ అయితే ఎండీ పదవి ఎప్పటికీ తమకు దక్కదని శైలేంద్ర-దేవయాని భయపడతాడు. ఫెస్టివల్‌ను చెడగొట్టడానికి మంచి ప్లాన్స్ వేస్తారు.
Also Read: చేతులు కలిపిన దేవయాని, రాజీవ్ - రిషి ని చంపేస్తానన్న రాజీవ్
వసుధార - అనుపమ
అర్ధరాత్రి దాటినా నిద్రపోకుండా యూత్‌ఫెస్టివల్ పనుల్లో బిజీగా ఉంటుంది వసుధార. ఇదే విషయం వసుధారను అడుగుతుంది అనుపమ. ఇంతకుముందు ఈవెంట్స్ చేసినప్పుడు రిషిసార్ నా పక్కన ఉండేవారు. ఆయన చాలా సపోర్ట్‌గా ఉండటంతో ఏ పొరపాటు జరగదనే నమ్మకం ఉండేది.
తప్పు జరిగితే రిషి సరిదిద్దుతారనే ధైర్యం ఉండేది. ఆ ధైర్యం, నమ్మకం ఇప్పుడు లేవు అంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి నా పక్కన లేకపోవడంతో ఇదొక బాధ్యతగా, భారంగా అనిపిస్తుందని కంగారు పడుతుంది. యూత్ ఫెస్టివల్‌ను నువ్వు సక్సెస్ చేయగలగవని వసుధారకు ధైర్యం చెబుతుంది అనుపమ.
శైలేంద్ర: వసుధార కళ్లల్లో రిషి కనిపించడం లేదన్న భయం, బెరుకు కొంచెం కూడా లేదని శైలేంద్ర అనుకుంటాడు. రిషి ఎక్కడున్నాడో వసుధారకు తెలుసు, కానీ ఎంత ఆలోచించినా, ఎన్ని ప్లాన్స్ వేసిన రిషి అడ్రెస్ కనిపెట్టలేకపోవడం అవమానంగా ఫీలవుతాడు శైలేంద్ర. యూత్‌ఫెస్టివల్‌ను గనక సక్సెస్ అయితే ఎండీ సీట్ నుంచి వసుధారను జన్మలో కదిలించలేనని శైలేంద్ర భయపడతాడు. యూత్ ఫెస్టివల్‌ను చెడగొట్టి ఎండీ పదవికి వసుధార రిజైన్ చేసేలా ప్లాన్స్ వేయాలని ఫిక్సవుతాడు.
ధరణి: దేనికో కంగారుగా కనిపిస్తున్నట్లున్నారు, ఏమైంది అని అడుగుతుంది.
శైలేంద్ర: యూత్ ఫెస్టివల్ చెడగొట్టడానికి ధరణి సలహా తీసుకోవాలి అనుకుంటాడు. వసుధార నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్ గురించి ధరణితో చెబుతాడు
ధరణి: అది మంచిదే కదా అని ధరణి అంటుంది. వెంటనే మాట మార్చి ఓ మీరు వసుధార పార్టీ కాదు కదా అని అంటుంది. ఆ పోగ్రామ్స్ సక్సెస్ కాకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా
శైలేంద్ర : ఈ సారి వెరైటీగా వసుధార మేలు కోరుకుంటున్నానని రేపు నేను ఇచ్చే ట్విస్ట్‌కు కాలేజీలో ఉన్నవాళ్లందరు సర్‌ప్రైజ్ కావాలి, షాకవ్వాలి అని అంటాడు. అలాంటి ప్లాన్ గురించి ఎంత ఆలోచించిన ఏం తెలియడం లేదని అంటాడు.
ధరణి : ఇంత చిన్న విషయం గురించి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నారు. రిషి వస్తున్నాడని అందరికి చెప్పమని సలహా ఇస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుందని, యూత్ ఫెస్టివల్‌ను చెడగొట్టడానికి ధరణి సలహాను వాడుకోవాలని అనుకుంటాడు శైలేంద్ర. మీరు నేను చెప్పినట్లు చేస్తే నిజంగానే రిషి కాలేజీకి వస్తాడు. మీ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేస్తాడని మనసులో అనుకుంటుంది ధరణి.
Also Read: జనవరి 25 పుష్యమాస పౌర్ణమి - ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం చేయాలి!
యూత్ ఫెస్టివల్ కోసం కాలేజీకి బయలుదేరుతూ జగతి ఫొటో ముందు నమస్కారం పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకుంటుంది వసుధార. రిషి తోడు లేకుండా ఒంటరిగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని కోరుకుంటుంది. అడ్డంకులు రాకూడదని అందరూ దేవుడిని వేడుకుంటారు కదా...నువ్వు మీ అత్తయ్య ఫొటోకు దండం పెడుతున్నావు ఎందుకు అని వసుధారను అడుగుతాడు మహేంద్ర. నాకు గురువు తర్వాతే దైవమని...జగతి మేడమ్‌కు మించిన గురువు, దైవం నాకు ఎవరూ లేరని వసుధార అంటుంది.
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...