Guppedanta Manasu Serial Today May 31st : ‘గుప్పెడంత మనసు’ సీరియల్ : జైలు నుంచి తప్పించుకున్న రాజీవ్ – శైలేంద్ర జీవితం ఇక బస్టాండే
Guppedanta Manasu Today Episode: జైలు నుంచి తప్పించుకున్న రాజీవ్ నేరుగా శైలేంద్ర ఇంటికి వెళ్లి శైలేంద్రను చంపబోతాడు. ఇంతలో దేవయాని వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: స్టోర్ రూంలో జరిగిందంతా వసు చెప్పగానే మను కూడా తనకు వసు ఫోన్ నుంచి మెసెజ్ వచ్చిందని దీంతో తాను కంగారుగా స్టోర్ రూం లోపలికి వెళ్లగానే ఎవరో బయట నుంచి డోర్ వేశారని చెప్తాడు. దీంతో అలా ఎలా చేశారని వసు అడుగుతుంది. మీరిద్దరిని రూంలో వేసి రూమర్స్ క్రియేట్ చేయాలని చూశారని ఎంజేల్ చెప్తుంది. దీంతో అంత అవసరం ఎవరికుందని వసు అడుగుతుంది. దీంతో ఆ శైలేంద్రే చేసి ఉంటాడని మహేంద్ర చెప్తాడు. వాడు ఉన్నంత వరకు ఇలాంటివి జరగుతూనే ఉంటాయి అంటాడు. అసలు నువ్వెలా వీళ్లని సేవ్ చేశావు అని ఏంజేల్‌ను అడుగుతాడు మహేంద్ర. దీంతో నేనెందుకో అటుగా వెళ్తుంటే లోపలి నుంచి మను వాయిస్ వినిపించింది. వెళ్లి డోర్ ఓపెన్ చేసి వాళ్లను బయటకు పంపించి నేను లోపల ఉండిపోయాను అని చెప్తుంది ఏంజేల్.
వసు: థాంక్స్ ఎంజేల్ చాలా మేలు చేశావు. లేదంటే కాలేజీ మొత్తం రచ్చరచ్చ అయ్యేది. కాలేజీ మొత్తం దీని గురించే మాట్లాడుతూ ఉండేవారు.
ఎంజేల్: అయ్యో పర్లేదు వసుధార. ఆ ప్లేస్‌లో నేనే కాదు ఎవరున్నా అలాగే చేస్తారు.
మను: నీ ప్లేస్‌లో ఎవరున్నా అలా చేయోచ్చు చేయకుండా ఉండొచ్చు. కానీ నువ్వు చేశావు చూశావా? అది నీ గొప్పతనం. చాలా థాంక్స్ ..
ఎంజేల్: మనలో మనకు థాంక్స్ ఎందుకు బావ. ఈరోజు నాతో చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నావు
అనగానే మను నవ్వుతాడు దీంతో అయ్యో మా బావ నవ్వాడు అని ఎంజేల్ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి రాజీవ్ జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడని చెప్తాడు. దీంతో వసు షాక్ అవుతుంది. ఇంతలో మహేంద్ర వస్తాడు మహేంద్రకు రాజీవ్ ఎస్కేప్ అయ్యాడని చెప్తుంది. మహేంద్ర కూడా షాక్ అవుతాడు. తర్వాత రాజీవ్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా అంటాడు మహేంద్ర. ఆ శైలేంద్ర గానికి ఎండీ సీటు ఎరగా వేసి రాజీవ్‌ను పట్టించాము కదా ఇప్పుడు వీడిని ఎలాగోలా డైవర్ట్ చేద్దాం అని మహేంద్ర చెప్తుంటే చాటు నుంచి రాజీవ్ విని కోపంగా శైలేంద్ర కోసం వెళ్తాడు. వెళ్లి శైలేంద్ర గొంతు పట్టుకుంటాడు.
శైలేంద్ర: వద్దు బ్రదర్ వదులు బ్రదర్ నా మాట విను బ్రదర్.
రాజీవ్: ఓరేయ్ నన్నే చీట్ చేస్తావా? నిన్ను వదిలిపెట్టను.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.
శైలేంద్ర: అసలు నువ్వెం అంటున్నావు బ్రదర్. నేను నమ్మకద్రోహం చేయడం ఏంటి బ్రదర్.
రాజీవ్: నాటకాలాడొద్దు నువ్వు వసుధారతో కలిసి నన్ను పట్టించావు అని నాకు తెలుసు.
అనగానే నేనెందుకు నిన్ను పట్టిస్తాను అని శైలేంద్ర అడగ్గానే ఎండీ సీటు కోసం నువ్వు వసుధారతో కలిసి నన్ను పట్టించావు అని రాజీవ్ చెప్పగానే శైలేంద్ర షాక్ అవుతాడు. ఇంతలో రాజీవ్ గన్ తీసి శైలేంద్రకు ఎయిమ్ చేస్తాడు. ఇంతలో దేవయాని వచ్చి రాజీవ్ మీద అరుస్తుంది. దీంతో శైలేంద్ర శత్రువుల పంచన చేరి నన్నే జైలుకు పంపించాడు అని చెప్తాడు రాజీవ్.
శైలేంద్ర: సారీ మామ్ నీకు ఆల్‌రెడీ జరిగింది చెప్పాను కదా ఏదో పొరపాటు అయిపోయింది.
దేవయాని: రాజీవ్.. జరిగిందంతా వాడు నాకు చెప్పాడు. నేను కూడా రాజీవ్‌కు అలా చేయడం చాలా తప్పు అని బుద్ది చెప్పాను.
రాజీవ్: బుద్ది చెప్పడం కాదు మేడంజీ మన అన్నవాడు దారితప్పినా పనిష్‌మెంట్ ఇవ్వాలి కదా?
అనగానే దేవయాని తన మాటలతో రాజీవ్‌ను కన్వీన్స్ చేస్తుంది. మీ వీక్‌నెస్ అడ్డం పెట్టుకుని వాళ్లు ప్లాన్ చేసి మిమ్మల్ని దెబ్బ కొట్టారు అని చెప్పడంతో రాజీవ్ కూల్ అయిపోతాడు. తర్వాత దేవయాని మహేంద్ర ఇంటికి వెళ్లి వ్రతం చేస్తున్నామని మీరు తప్పకుండా మా ఇంటికి రావాలని అనుపమను కూడా రావాలని పిలుస్తుంది దేవయాని. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ : ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది జాగ్రత్త.. ముఖ్యంగా వారు ఏమాత్రం లైట్ తీసుకున్నా అంతే సంగతులు