Guppedanta Manasu Serial Today May 18th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: సడెన్‌గా షాకిచ్చిన మహేంద్ర – హీరోనంటూ మనును బయటకు తీసుకొచ్చిన మహేంద్ర
Guppedanta Manasu Today Episode: వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టే సమయానికి మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రాజీవ్ వసుధారను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే శైలేంద్ర బయటకు వెళ్లి వస్తాననడంతో రాజీవ్ గన్ చూపించి శైలేంద్రను బెదిరిస్తాడు. దీంతో శైలేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో వసుధార కోపంగా నన్ను వదిలేస్తావా లేదా అంటూ తిడుతుంది. దీంతో రాజీవ్ ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు చూడు నిజంగా నీకు హాట్సాప్ అంటాడు రాజీవ్. ఇంతలో రాజీవ్ తన చేతిలో గన్ తీసి శైలేంద్రకు ఇచ్చి నేను మంత్రాలు ఆన్ చేసి తాళి కడతాను అంటాడు. గన్ తీసుకున్న శైలేంద్ర ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని మనసులో అనుకుంటాడు. రాజీవ్ ఆ గన్‌లో బుల్లెట్స్ లేవు బయ్యా అంటూ చెప్పడంతో శైలేంద్ర షాక్ అవుతాడు.
రాజీవ్: అయ్యో మర్చిపోయానే నీ మెడలో ఆల్‌రెడీ ఒక తాళి ఉంది కదా? ఒక తాళి ఉండగా ఇంకో తాళి కట్టడం అసాధ్యం. అందుకే ముందు నీ మెడలో ఉన్న తాళి తీసేసి తర్వాత నేను తాళి కట్టేస్తా..
వసు: వద్దు బావా ప్లీజ్ వద్దు
శైలేంద్ర: బ్రదర్ ఇది మరీ పాపం
రాజీవ్: పాప పుణ్యాల గురించి మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి భయ్యా..
అంటూ తాళిని చేతితే తెంపితే పాపం అనుకుంటా అని శైలేంద్ర దగ్గర ఉన్న గన్ తీసుకుని తాళి గన్‌తో తెంపబోతుంటే శైలేంద్ర, వసుధార వద్దని చెప్తుంటారు. ఇంతలో మహేంద్ర తలుపులు బద్దలకొట్టుకుని లోపలికి వస్తాడు. లావు కర్రతో రాజీవ్‌ను వెనక నుంచి కొట్టగానే రాజీవ్ కిందపడిపోతాడు. మహేంద్ర, శైలేంద్ర ఇద్దరూ కలిసి వసుధార కట్లు విడిపిస్తారు. ఎలా వచ్చావని శైలేంద్ర అడుగుతే వసుధార దగ్గర ఉన్న సీక్రెట్ మైక్ చూపిస్తుంది. ఇంతలో రాజీవ్ లేచి మహేంద్రకు గన్ ఎయిమ్ చేస్తాడు. శైలేంద్ర బుల్లేట్ లేదని చెప్పడంతో రాజీవ్ కాల్చి చూపిస్తాడు. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు.
రాజీవ్: భయ్యా ఏదో సరదాగా మాట్లాడుతున్నాడని నన్ను తక్కువ అంచనా వేయకు. చెప్పాను కదా నేను నీకంటే పెద్ద విలన్ ని తెలివితేటలు ఉపయోగించకు
అంటూ గన్ మహేంద్రకు ఏయిమ్ చేసి నీ సంగతేంటి అనగానే మహేంద్ర తెలివిగా గన్ లాక్కుంటాడు.
శైలేంద్ర: మా బాబాయ్ మనకన్నా పెద్ద విలన్‌లా ఉన్నాడు.
మహేంద్ర: రేయ్ శైలేంద్ర హీరోరా.. హీరో ఇక్కడ.. రేయ్ రాజీవ్ కట్టరా తాళి కట్టు ఇప్పుడు కట్టు నేను ఏమి అనను కట్టు. ఇందాకా ఏదో అన్నావు కదా తాళి కట్టు చూద్దాం. రేయ్ రాజీవ్ నువ్వు ఇన్నాళ్లు నా కొడుకునే చూశావు. నేను వాడి అబ్బనురా నేను ఎంత డేంజరస్‌గా ఉంటాను.
అని మహేంద్ర పోలీసులను పిలవగానే పోలీసులు వచ్చి రాజీవ్‌ను తీసుకెళ్తారు. రాజీవ్ వెళ్తూ వసుధారను వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇస్తాడు. జైలు నుంచి వచ్చైనా సరే నీ మెడలో తాళి కడతాను అంటూ వెళ్లిపోతాడు. తర్వాత శైలేంద్ర ఇంటికి వచ్చి రాజీవ్ బతికే ఉన్నాడని.. పోలీసులకు దొరికాడని చెప్పడంతో దేవయాని, ధరణి షాక్ అవుతారు. ఇంతలో శైలేంద్ర రేపు తనకు కాలేజీలో మంచి జరగబోతుందని మీరిద్దరూ రేపు కాలేజీకి రావాలని చెప్తాడు. ధరణి రానని చెప్తుంది. దేవయాని మాత్రం ఆ రాజీవ్‌ను పోలీసులకు పట్టించింది నువ్వేనా అని అడగ్గానే శైలేంద్ర లేదని చెప్తాడు. దీంతో దేవయాని బాంబు పేలుస్తుంది. ఆ రాజీవ్‌ను పోలీసులకు పట్టించిన వాణ్ని కచ్చితంగా రాజీవ్ చంపేస్తాడని చెప్పడంతో శైలేంద్ర షాక్ అవుతాడు. మరోవైపు వసుధార, మహేంద్ర.. మనును తీసుకుని ఇంటికి వస్తారు. అనుపమ హ్యాపీగా ఫీలవుతుంది. వసుధార, మహేంద్ర తాము చెప్పినట్లు మనును నిర్దోషిగా ఇంటికి తీసుకొచ్చామని చెప్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్