Guppedanta Manasu Serial Today May 15th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: ఎండీ అయినట్లు కలలు కంటున్న శైలేంద్ర – శైలేంద్రకు పిచ్చి పట్టిందన్న ధరణి
Guppedanta Manasu Today Episode : కాలేజీ ఎండీ అయినట్లు శైలేంద్ర స్వీట్లు పంచడంతో శైలేంద్రకు పిచ్చి పట్టిందని ధరణి దేవయానితో భాదపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఫన్నీగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode : రాజీవ్ అడ్రస్ కనిపెట్టడానికి మహేంద్ర, వసుధార, మను ఒకరికి మించి మరొకరు పోటీపడి యాక్టింగ్ చేస్తుంటారు. వసుధార, మహేంద్రలను తీసుకొని మను దగ్గరకు వస్తాడు శైలేంద్ర. మనును చూడగానే మహేంద్ర ఫైర్ అవుతాడు. మను మోసగాడు అంటూ అతడితో మాట్లాడేది లేదంటూ వెళ్లిపోబోతాడు. శైలేంద్ర అతడిని ఆపుతాడు. తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసి చూపిస్తాడు. తనను కాలేజీకి ఎండీగా ప్రకటిస్తూ వసుధార, మను సంతకం చేయాలని శైలేంద్ర అంటాడు. అగ్రిమెంట్ పేపర్స్ పై సంతకం చేయడానికి వసుధార ఒప్పుకోదు. దాంతో శైలేంద్ర ప్లేట్ ఫిరాయిస్తాడు.
శైలేంద్ర: నాకు కాలేజీ ఇవ్వనని అన్నప్పుడు నేను నిన్ను ఎందుకు బయటకు తీసుకురావాలి.. నాకు అవసరం లేదు.
మను: ఆగు శైలేంద్ర.. నన్ను బయటకు తీసుకొస్తానని అన్నావంటే...రాజీవ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్నమాట..
శైలేంద్ర: అవన్నీ నీకు అనవసరం.. నన్ను ఎండీగా నియమించడానికి అంగీకరిస్తూ నువ్వు, వసుధార సంతకం పెడితేనే ...నిన్ను జైలు నుంచి విడిపిస్తాను. లేదంటే నీ బతుకు ఇంతే.. సాక్ష్యాలు అన్ని నువ్వే హత్య చేసినట్లు బలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు జీవితాంతం జైలులో ఉండాల్సిందే
అని శైలేంద్ర బెదిరించగానే.. మను అగ్రిమెంట్ పేపర్స్ పై సంతకం పెడతాడు. కానీ వసుధార అగ్రిమెంట్స్ పేపర్స్ పై సంతకం పెట్టడానికి అంగీకరించదు. శైలేంద్రకు ఎండీ కావడానికి ఏ అర్హత ఉందని ఫైర్ అవుతుంది. కాలేజీ గురించి శైలేంద్రకు ఏం తెలియదని వసుధార అంటుంది. మన కాలేజీలో ఎంత మంది స్టాఫ్, స్టూడెంట్స్ ఉన్నారని శైలేంద్రను వసు అడుగుతుంది. ఆ ప్రశ్నకు అతడు తడబడిపోతాడు. సమాధానం తెలియక కంగారుపడతాడు. కనీసం మన కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో తెలుసా? అని శైలేంద్రను ప్రశ్నిస్తుంది వసుధార. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నములుతాడు శైలేంద్ర. ఇది కూడా తెలియకుండా సూటు, బూటు వేసుకొని రోజు కాలేజీకి ఎందుకు వస్తావని శైలేంద్రపై మహేంద్ర ఫైర్ అవుతాడు. వసుధారకు కనిపించకుండా దొంగచాటుగా పది కోర్సులు కాలేజీలో ఉన్నాయని శైలేంద్రకు హింట్ ఇస్తాడు మహేంద్ర.
వసుధార: కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయో తెలియని శైలేంద్రకు ఎండీ సీట్ అప్పగించేది లేదు.
మహేంద్ర: అది కాదమ్మ వసు శైలేంద్ర పక్కన మనం ఉంటాం కదా.. అన్నింటిని ఈ వెధవకు నేర్పుదాం.. మా అన్నయ్య కడుపున చెడబుట్టి ఉండొచ్చు.. వెధవ అయ్యిండొచ్చు.. కానీ శైలేంద్ర పరాయివాడు కాదు.
అంటూ మహేంద్ర చెప్పగానే వసు సంతకం పెట్టబోతుంటే మను ఆపి వసు సంతకం పెట్టాక నువ్వు నన్ను బయటకు తీసుకొస్తావన్న గ్యారెంటీ ఎంటీ అని మను, శైలేంద్రను ప్రశ్నిస్తాడు. ముందు నన్ను బయటకు తీసుకురా.. ఆ తర్వాత అందరి సమక్షంలో నేను నీకు కాలేజీ అప్పగిస్తానని అంటాడు మను. చివరకు మనును జైలు నుంచి విడిపించడానికి శైలేంద్ర అంగీకరిస్తాడు. అయితే తాను చెప్పినట్లు వసుధార చేయాలని కండీషన్ పెడతాడు. ఏం చేయాలన్నది ఆలోచించుకొని చెబుతానని వెళ్లిపోతాడు. శైలేంద్ర వెళ్లిపోగానే మనుకు సారీ చెబుతాడు మహేంద్ర. జైలు నుంచి విడిపించడానికి నిన్ను తిడుతున్నట్లుగా నటించడం తప్పడం లేదని అంటాడు. తర్వాత శైలేంద్ర హ్యాపీగా ఇంట్లో వాళ్లకు స్వీట్లు ఇస్తాడు. ఎందుకని దేవయాని అడగ్గానే తాను త్వరలోనే కాలేజీ ఎండీ కాబోతున్నట్లు శైలేంద్ర చెప్పడంతో దేవయాని అనుమానిస్తుంది. శైలేంద్రకు మెదడు దొబ్బినట్లుందని అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ 'రంగమ్మత్త' రూటే సపరేట్ - విమర్శలకు, వివాదాలకు తగ్గని హట్ యాంకర్, సోషల్ మీడియా సెన్సేషన్..