Guppedanta Manasu Serial Today June 15th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: వసుధారను చంపేశామన్న రౌడీలు – ఆనందంలో పండగ చేసుకున్న శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: బోమ్మను మట్టిలో పూడ్చి వసుధారనే చంపి పూడ్చేశామని రౌడీలు చెప్పడంతో శైలేంద్ర పండగ చేసుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: స్పృహలోకి వచ్చిన వసుధార రంగను చూసి రిషి అనుకుని హ్యాపీగా ఫీలవుతూ లేచి హగ్ చేసుకుంటుంది. ఇంతలో వసుధారను వదిలించుకుని ఎవరండి మీరు.. నేను రిషిని కాదు నేను రంగాను అంటాడు. అదేం లేదు మీరు రిషి సారే అనగానే ఏయ్ ఎవరు నువ్వు మా బావ రంగాను పట్టుకుని రిషి సార్ అంటున్నావు అంటుంది దీంతో వసుధార షాక్ అవుతుంది. చికాకుగా బాధపడుతూ మళ్లీ స్పృహ కోల్పోతుంది. రంగా బయటకు వెళ్లిపోతాడు. వసుధారను చూస్తున్న సరోజ దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. రంగ బట్టలు తీసుకురాపో అనగానే సరోజ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేస్తుంటాడు. వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయరు. దీంతో శైలేంద్ర కంగారుపడుతుంటాడు. ధరణి వస్తుంది.
ధరణి: ఏవండి
శైలేంద్ర: పోయిపోయి దీని కంట్లో పడ్డానేంట్రా బాబు ( మనసులో అనుకుంటాడు.)
ధరణి: ఏం చేస్తున్నారండి?
శైలేంద్ర: నేను చేయడానికి ఏం ఉటుంది ధరణి ఏం లేదు.
ధరణి: ఏం లేదు అంటారేంటండి. ఎవరికో ఫోన్ చేస్తున్నారు కదా?
శైలేంద్ర: అవును ఫోన్ చేస్తున్నాను కానీ తను లిఫ్ట్ చేయడం లేదు.
ధరణి: ఎవరికి చేస్తున్నారు..?
శైలేంద్ర: నా బిజినెస్ పార్ట్‌నర్ కు చేస్తున్నాను
అని శైలేంద్ర మీరు ఏం బిజినెస్ చేయడం లేదు కదా అని అడుగుతుంది ధరణి. మళ్లీ కాఫీ కావాలా? అంటూ ఏదేదో అడుగుతుంటే నాకేం వద్దు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లు అంటాడు శైలేంద్ర. ధరణి వెళ్లిపోతుంది. తర్వాత శైలేంద్ర మళ్లీ రౌడీలకు ఫోన్ చేస్తాడు. రౌడీ పాండు ఒక బొమ్మను తెప్పించి పూడ్చి వేస్తూ ఉంటాడు. శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి వసుధారను చంపేశామని.. పూడ్చేశామని వీడియో చూపిస్తాడు. శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత శైలేంద్ర ఇంట్లో స్నానం చేసి అందర్ని స్నానం చేయమంటాడు.
శైలేంద్ర: నావైపు చూడ్డం కాదు రూంలోకి వెళ్లి స్నానం చేసిరా..
ధరణి: నేను ఆలెరెడీ చేశానండి
శైలేంద్ర: మామూలు స్నానం కాదు తలస్నానం
ధరణి: మీరు చెప్పినా చెప్పకపోయినా నేను రోజూ తలస్నానమే చేస్తానండి.
శైలేంద్ర: ఓహ్ మంచి అలవాటు..
దేవయాని: ఏంట్రా నువ్వు చిన్నపిల్లల్ని రెడీ చేయడానికి హడావిడి చేసినట్టు ఏంటా హడావిడి. ఎందుకసలు మమ్మల్ని స్నానం చేయమంటున్నావు.
శైలేంద్ర: ముందు నువ్వు వెళ్లి స్నానం చేసిరా మమ్మీ..
దేవయాని: ఎందుకు?
శైలేంద్ర: నీకో శుభవార్త చెప్తాను మమ్మీ..
దేవయాని: ఇప్పుడు నువ్వు మమ్మల్ని స్నానం చేయమంటుంది ఆ శుభవార్త వల్లేనా? అయితే అదేంటో నాకు చెప్పు
అనగానే వసుధార ఇక లేదని రాత్రికి రాత్రే స్కెచ్ వేశాను. స్కెచ్ ప్రకారం లేపేశారు. అని శైలేంద్ర చెప్పగానే నిజంగానే లేపేశావా? లేక కల కన్నావా? అంటూ దేవయాని అడగ్గానే… కావాలంటే ఇద్దరం సాయంత్రం వాకింగ్ వెళ్లి డెడ్ బాడీని చూసొద్దాం అని మెల్లగా చెప్తుంటాడు ఇంతలో ధరణి దగ్గరకు వచ్చి ఏంటండి స్కెచ్ అంటున్నారు ఏం చేశారు అని అడుగుతుంది. దీంతో శైలేంద్ర, ధరణిని తిడతాడు. దూరంగా ఉండు అని అరుస్తాడు. ఇంతలో ఫణీంద్ర వచ్చి ఏంట్రా నీ గోల అనగానే దేవయాని, శైలేంద్ర కంగారుపడతారు. తర్వాత ఈరోజు మంచి రోజంట అందుకే స్నానం చేయమంటున్నాడు అని దేవయాని సర్ధిచెప్పగానే అంతేనా ఇంకేమైనా ఉందా? అని ఫణీంద్ర అడగ్గానే శైలేంద్ర ఏం లేదని చెప్తాడు. ఇంతలో ధరణి లేదు మామయ్యా వీల్లేదో స్కెచ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రభాస్ నా బ్రదర్, ప్రతి సోమవారం ఇక ‘కన్నప్ప’ మండే: మంచు విష్ణు