Manchu Vishnu: ప్రభాస్ నా బ్రదర్, ప్రతి సోమవారం ఇక ‘కన్నప్ప’ మండే: మంచు విష్ణు
Manchu Vishnu: 'కన్నప్ప' టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు 'కన్నప్ప' లో ఉండే క్యారెక్టర్స్ గురించి చెప్పారు. ప్రభాస్ తనకు బ్రదర్ లాంటి వాడని అన్నాడు.
Manchu Vishnu About Prabhas Role In Kannappa Movie: 'కన్నప్ప'.. భారీ తారాగనంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి . శుక్రవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మంచు విష్ణు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీజర్ రిలీజ్ అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకున్నారు విష్ణు. 'కన్నప్ప'లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం 'కన్నప్ప మండే' అవుతుందని, అప్ డేట్స్ అలా ఇస్తామని అన్నారు విష్ణు.
ఏమీ చెప్పను.. చూపిస్తాను..
టీజర్ లో ఒక సీన్ లో ప్రభాస్ కనిపించారు. దీంతో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? ఆయన ఎలా కనిపించబోతున్నారు అని అడిగిన ప్రశ్నకి విష్ణు ఈ సమాధానం ఇచ్చారు. "ఈ టీజర్ లో సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. దాంట్లో మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ ఉన్నారు, మధుబాలా, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ ప్రతి ఒక్కరు ఈ టీజర్ లో ఉన్నారు. అందరి క్యారెక్టర్లు నేను ఇప్పుడు చెప్పను, చెప్పదలుచుకోను కూడా. దానికి ఒక టైం ఉంది. మేం ఈ నెల తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి మండే ఒక అప్ డేట్ ఇస్తాం. ప్రతి సోమవారం కన్నప్ప మండే గా ప్లాన్ చేస్తున్నాం. కన్నప్పలో ఐదు గూడాలు ఉన్నాయి. ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ - 2లో కథ మొత్తం ఉంటుంది. ఈ ఐదు గూడాలు ఏంటి? నాయకులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? చరిత్ర ఏంటి? అనేది ప్రతి ఒక్కటీ ఈ బుక్ లో ఉంది. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తాం. శరత్ కుమార్ గారికి ఒక మాట చెప్పాను. మనం పెరిగేటప్పుడు మ్యాచో స్టార్స్ బాగా బాడీలు వేసుకుని చూసినప్పుడు ఫ్యాసినేట్ అయ్యేవాళ్లం. నాకు అలా ఈ సినిమాలో ఇద్దరికి ఫైట్ చేయించే అవకాశం వచ్చింది. శరత్ కుమార్ గారు, ముఖేశ్ రుషి. నేను శరత్ కుమార్ గారికి చెప్పాను మీ ఫైట్ నాకు ఫైట్ చేసే ఛాన్స్ ని ఇచ్చింది. ఒక చిన్న షాట్. ఎడిట్ చేసి చూపిస్తాం. అద్భుతంగా ఉంటుంది. ముఖేశ్ రుషి ఆయనతో ఏం చేయించా అనేది సినిమాలో చూడాలి. ఇది మంచి ఎక్స్ పీరియెన్స్" అని చెప్పారు విష్ణు.
మేం బ్రదర్స్..
"ప్రభాస్ మోహన్ బాబు గారితో బుజ్జిగాడు సినిమా చేశారు? మీతో ఈ సినిమా చేశారు? ఎలా ఒప్పించారు? వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది ఒక్కమాటలో చెప్పండి" అని అడిగిన వెంటనే ఒక చిన్న స్మైల్ ఇచ్చిన విష్ణు "వ్యూ ఆర్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్.. బట్ వుయార్ బ్రదర్స్" అని చెప్పగానే ఆడిటోరియం మొత్తం కేకలతో మారుమోగిపోయింది.