అన్వేషించండి

Guppedanta Manasu october 1st Promo: రిషి-వసుకి పెళ్లిచేసి కన్నుమూసిన జగతి, గుప్పెడంతమనసు నెక్స్ట్ లెవల్!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి. తాజాగా రిలీజైన ప్రోమోలో ఏముందంటే

గుప్పెడంతమనసు అక్టోబరు 1 ప్రోమో

కాలేజీ ఎండీ సీట్లో కూర్చునేందుకు శైలేంద్ర కుట్రలు చేస్తుంటాడు. అందులో భాగంగా జగతి-రిషిని చంపించాలనుకుంటాడు. అనుకున్నట్టే ఓ రౌడీని పెట్టి కాల్పించేస్తాడు. అయితే రిషికి అడ్డొచ్చి ఆ తూటాకి జగతి బలైపోతుంది. హాస్పిటల్లో ఉన్న జగతిని చూసి రిషి చలించిపోతాడు. నీకోసం ఏదైనా చేస్తాను అమ్మా నన్ను క్షమించు అంటూ ఏమోషన్ అవుతాడు. అదే సమయంలో జగతి తన కోర్కె తీర్చమంటూ..వసుని పెళ్లిచేసుకోవాలని కోరుతుంది. సరేనని మాటిస్తాడు రిషి. రేపటి ప్రోమోలో అదే ఉంది...

ప్రోమోలో ఇదే ఉంది
జగతి కోరిక మేరకు రిషి..వసుధార మెడలో శాస్త్రోక్తంగా తాళికడతాడు. అమ్మా వసు నన్ను మేడం అని కాదు అత్తయ్య అని పిలువు అని అడుగుతుంది. ఏమోషన్ అయిన వసు అత్తయ్యా అనిపిస్తుంది. ఈ తతంగం మొత్తాన్ని చిరాగ్గా చూస్తుంటారు దేవయాని-శైలేంద్ర. రిషి..వసు మెడలో తాళి కట్టిన తర్వాత జగతి కాళ్లకు నమస్కరిస్తారు. జగతి ఇద్దర్నీ మురిపెంగా చూసుకుంటూ అక్షింతలు వేస్తుంది. ఇంతలో అందరూ షాక్ అయి జగతి వైపు చూస్తుంటారు. అంటే జగతి కొడుకు-కోడలిని దీవించిన తర్వాత కన్నుమూసిందని అర్థం...

Also Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!
జగతి క్యారెక్టర్ సడెన్ గా ఎందుకు ముగింపు పలికారు
గుప్పెడంతమనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ చాలా ముఖ్యం. రిషి-జగతి-వసు..ముగ్గురూ పోటాపోటీగా కథను నడిపించారు. మరీ ముఖ్యంగా డిగ్నిఫైడ్ క్యారెక్టర్లో జగతికి ఫుల్ మార్కులు పడ్డాయి. భర్తకు దూరమైన భార్యగా, కొడుకు ప్రేమ పొందలేని తల్లిగా, స్టూడెంట్ ఉన్నతికోసం పాటుపడే మేడంగా, కాలేజీ భవిష్యత్ కోసం తపించే లెక్చరర్ గా జగతి (జ్యోతిరాయ్) నటన అద్భుతం. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ క్యారెక్టర్ ని ఎందుకు అర్థాంతరంగా తీసేస్తున్నారంటే..జ్యోతిరాయ్ కి వెబ్ సిరీస్, సినిమా ఆఫర్లున్నాయి. ప్రస్తుతం ఆమె వాటిలో బిజీగా ఉంది. అందుకే సీరియల్ నుంచి తప్పుకోవాలి అనుకోవడంతో ఇలా ముగింపు ఇచ్చారని తెలుస్తోంది. 

Also Read: ఆ వెబ్ సీరిస్ కోసం సీరియల్ తల్లి జ్యోతి రాయ్ గ్లామర్ షో - ఇక ఫ్యాన్స్‌కు పండగే!

ప్రస్తుతం జ్యోతిరాయ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది...అందులో హాట్ హాట్ గా కనిపించబోతోంది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. జ్యోతి రాయ్ 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు. ఆ బంధం నుంచి బయటకు వచ్చేసిన జ్యోతిరాయ్..ప్రస్తుతం ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లిచేసుకుంటుందనే వార్తలు వస్తున్నాయ్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Embed widget