By: ABP Desam | Updated at : 26 Sep 2023 07:13 PM (IST)
Photo Credit : Jyothi Rai/Instagram
ఒకప్పుడు తెలుగు సీరియల్స్ అంటే నటీమణులు ఎంతో సాంప్రదాయ బద్ధంగా, పద్ధతిగా చీరలతో కనిపించేవారు. ఎమోషన్ సీన్స్ తోనూ కంటతడి పెట్టించేవారు. ఎలాంటి పాత్రకైనా తెలుగుదనం ఉట్టిపడేలా వేషధారణతోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ గత కొన్నాళ్ల నుంచి సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ ఏ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు సీరియల్స్ లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ యాక్టర్స్ సీరియల్స్ లో పద్ధతిగా నటిస్తూనే సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.
అలా ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమై ప్రముఖ సీరియల్ లో జగతి మేడమ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్ కొన్నాళ్ల ముందు వరకూ చీరలో కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈమధ్య తన గెటప్ ని పూర్తిగా మార్చేసి హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. సీరియల్స్ లో చీరకట్టుతో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో ఇంత హాట్ గా కనిపించడం చూసి అంతా షాక్ అయ్యారు. మరి జ్యోతి రాయ్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి కారణం ఏంటో తెలుసా?
నటి జ్యోతి రాయ్ 40 ఏళ్లకు దగ్గరవుతుంది. ఆల్రెడీ ఆమెకు పెళ్లయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. సీరియల్ లో తల్లి పాత్రలు చేస్తున్నప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనలోని గ్లామర్ యాంగిల్‌ను కూడా చూపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తన ఇన్ స్టా గ్రామ్ లో రోజుకు ఓసారైనా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదంతా ఆమె 'ప్రెట్టీ గర్ల్'(Pretty Girl) అనే వెబ్ సిరీస్ గురించి చేస్తోందట.
ఇందులోని పాత్ర కోసమే ఇన్నాళ్లుగా జ్యోతిరాయ్ తనలోని గ్లామర్ ని బయటపెట్టి తనను తాను మార్చుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. తాజాగా ఆ వెబ్ సిరీస్ తాలూకు ఫస్ట్ లుక్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. సీరియల్స్ లో పద్ధతిగా ఉండే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో ఇంతలా రచ్చ చేయడానికి కారణం ఇదా? అంటూ నెటిజన్స్ అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు.
మరోవైపు ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చి ఓ యువ దర్శకుడితో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఇంటి పేరును మార్చుకోవడంతోనే జ్యోతిరాయ్ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. జ్యోతిరాయ్ కూడా భర్తతో విడిపోయినట్టు ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.
Also Read : వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్ ఇచ్చిన కృష్ణ!
Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?
Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు
Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>