అన్వేషించండి

Guppedanta Manasu September 30th: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు సెప్టెంబరు 30 ఎపిసోడ్

మహేంద్రా..నా కొడుకు నన్ను అమ్మా అని పిలిచాడు ఇక చాలు..ఈ క్షణ కన్నుమూసినా పర్వాలేదు అంటుంది. ఆ మాటకి రిషి అమ్మా అవేం మాటలు నీకేం కాదని ధైర్యం చెబుతాడు. 
జగతి: నిన్ను కన్న దగ్గర్నుంచీ ఏనాడూ పొందని ప్రేమ ఈ రోజు పొందుతుంటే మనసుకి హాయిగా ఉంది రిషి
రిషి: సారీ అమ్మా..నిన్ను చాలా విషయాల్లో చాలా బాధపెట్టాను..ఓ అమ్మగా కాదు కదా కనీసం ఓ మినిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేకపోయాను. నాపై చూపిస్తున్న ఆప్యాయతని అలుసుగా తీసుకున్నాను. నీ ప్రేమని చులకన చేశాను. రియల్లీ సారీ అమ్మా.. 
జగతి: లేదు నాన్నా...నీ తప్పేం లేదు..
రిషి: తప్పే..కన్నతల్లిని బాధపెట్టడం ముమ్మాటికీ తప్పే.. ఈ ప్రేమను, త్యాగాన్ని అర్థం చేసుకోలేని దురదృష్టవంతుడిని..చదువుకున్న మూర్ఖుడిని 
జగతి మాట్లాడుతుండగా పెయిన్ రావడంలో అమ్మా అని అరుస్తుంది..రిషి విలవిల్లాడిపోతాడు..
జగతి: నాకేమైనా అవుతుందని బాధపడుతున్నావా
రిషి: నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు సిగ్గుపడుతున్నాను..నిన్ను అంత ద్వేషించినా కానీ చివరకు నీ ప్రాణాలు అడ్డు వేసి నా ప్రాణాలు కాపాడావ్..నీకోసం ఏదైనా చేస్తాను..ఏం చేయాలి అంటాడు.. 

Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!

జగతి: ఇదంతా విధి రాత.. ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టాల్సి వచ్చినట్టే చిన్నప్పుడు నిన్ను దూరం పట్టాల్సి వచ్చింది.. ఇప్పటి వరకూ నిన్ను ఎందుకు దూరం పెట్టానో నీకు తెలియదు కదా ఇప్పుడు చెబుతానంటుంది. ( మా అమ్మా నాన్నకి నా అవసరం వచ్చినప్పుడు నా ముందు ప్రశ్న వచ్చింది..నేను కన్నవాళ్లా-నన్ను కన్నవాళ్లా అని అడిగారు...ఆ సమయంలో నీకు ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మా అమ్మా నాన్నకి ఎవ్వరూ లేరు అందుకే వెళ్లిపోయాను, నీకు అమ్మ ప్రేమను దూరం చేశాను..కానీ మళ్లీ వెనక్కు వచ్చేసరికి అంతా మించి పోయింది .. అదంతా నీకు చెబితే వేరేవాళ్ల గురించి చెడుగా చెప్పినట్టు అవుతుంది అందుకే మౌనంగా ఉండిపోయాను..నేను నిన్ను వదిలిపెట్టలేదు రిషీ.. వదిలి పోవాల్సి వచ్చింది.
రిషి: నువ్వు నన్ను ఎంత మిస్సయ్యావో నేను కూడా అంతే మిస్సయ్యాను..మనసులో ప్రేమను ఉంచుకుని బయటకు మాత్రం నీతో కటువుగా ప్రయత్నించాను. నువ్వు కనిపించిన ప్రతీసారీ అమ్మా అని పిలవాలని ఉండేది కానీ మూర్ఖుడిని తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. అమ్మని దూరం చేసుకున్న బాధ నాలో కోపంగా, అసహనంగా ఎదిగింది... కాలం నాకు బుద్ధి చెప్పింది..చేజారుతున్నప్పుడే దానివిలువ తెలుస్తుంది అంటారు కదా.. నీకోసం ఏమైనా చేస్తాను చెప్పమ్మా....
జగతి: ఏదైనా చేస్తావా..
రిషి: మాటిస్తున్నా..ఏం అడిగినా నీ మాట తప్పకుండా చేస్తాను
జగతి: నా హ్యాండ్ బ్యాగ్ లో ఓ బాక్స్ ఉంటుంది ఇవ్వవా...నల్లపూసలు తీసి రిషికి ఇస్తుంది. ఇవి నీకిచ్చి పంపించాను ఇవి వేసుకునే తను నీకు భార్య అయింది..ఆ తర్వాత ఆవిషయం నువ్వు ఒప్పుకున్నావ్..మీ ఇద్దరకీ నిశ్చితార్థం చేశాం కానీ పెళ్లి వరకూ తీసుకురాలేకపోయాం. ఇప్పుడు  మీ ఇద్దర్నీ పచ్చని పందిట్లో భార్య-భర్తలుగా చూడాలని ఉంది. మంగళసూత్రం కట్టి ఈ నల్లపూసలు వసు మెడలో వేయాలని ఆశపడుతున్నా 

Also Read: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

రిషి: అమ్మ నాకోసం ఎంతో చేసింది..అలాంటిది తన కోరిక నేరవేర్చాలా, అలాగని నన్ను నమ్మని మనిషితో జవితాంతం ప్రయాణం చేయాలా
జగతి: నేను-వసు ఏం చేసినా నీ మంచికోసమే చేశామని ఇప్పటికీ నీకు నమ్మకం కలగలేదా..ఇంకా వసుని దూరం పెట్టాలి అనుకుంటున్నావా
మహేంద్ర: అమ్మకి మాటిచ్చావు రిషి..
జగతి: నా మాటకోసం ఒప్పుకోవద్దు..నువ్వు మనస్ఫూర్తిగా నన్ను-వసుని నమ్మితేనే ఒప్పుకో..
రిషి: ఒప్పుకుంటున్నా అమ్మా...ఇచ్చినమాట తప్పను
వసు, మహేంద్ర షాక్ అవుతారు...
రిషి: మీరు చెప్పినట్టే చేస్తానమ్మా..కానీ మా మధ్యే ఎప్పుడూ ఉంటానని మాటివ్వాలి
జగతి: చావు బతుకులు మన చేతుల్లో ఉంటాయా.. ఆ దేవుడు కరుణిస్తే కచ్చితంగా నీ మాట నెరవేరుస్తాను.. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది..వసుతో పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ నాన్నా...
ఇదంతా చూసిన ఆనందంలో మహేంద్ర...జగతి నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏం కాదు అంటాడు.. రిషి అమ్మని కాసేపు రెస్ట్ తీసుకోనీ రా అని పిలుస్తాడు.. ( అమ్మా అమ్మా నీ వెన్నెలా అంటూ బ్యాంగ్రౌండ్ సాంగ్ అదిరిపోయింది)

Also Read: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

మరోవైపు జగతిని కాల్చిన రౌడీ..శైలేంద్ర కోసం వెయిట్ చేస్తుంటాడు. శైలేంద్ర రాగానే డబ్బులిస్తాడనే ఆశతో లోపలకు రమ్మని పిలుస్తాడు. లోపలకు వెళ్లిన శైలేంద్ర డోర్ క్లోజ్ చేయడంతో.. ఏంటి సార్ బ్లాక్ మనీ ఇస్తారా అని అడుగుతాడు. డబ్బు తీసుకురాలేదా అని అడుగుతాడు. 
నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా వెళతానా అంటూ.. గన్ తీసి వాడిని పేల్చేస్తాడు.నేను చేసిన పాపాలకు ఈ భూమ్మీద ఏ సాక్ష్యాలూ ఉండకూడదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Embed widget