Guppedanta Manasu September 29th: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు సెప్టెంబరు 29 ఎపిసోడ్
జగతి హాస్పిటల్లో ఉంటుంది..ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. పెదనాన్న మీరువెళ్లి రెస్ట్ తీసుకోండి అవసరం అయితే నేను చెబుతాను అంటాడు. కానీ ఫణీంద్ర అందుకు ఒప్పుకోడు..అవసరం అయితే శైలేంద్రతో భోజనం తెప్పిస్తానంటాడు. ఇక్కడకు భోజనాలు తెప్పించడం ఎందుకు మీరు వెళ్లండి పెదనాన్న అని నచ్చచెబుతాడు రిషి. సరే అన్న ఫణీంద్ర ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అని చెబుతాడు. అటు మహేంద్రని కూడా వెళ్లమని రిషి చెప్పినా..జగతి కోలుకునే వరకూ ఇక్కడినుంచి కదిలేదు లేదంటాడు. కాసేపు దేవయాని నటన చూపించి వెళ్లిపోతుంది. ఈ లోగా వసుధార తండ్రి భోజనం తీసుకొస్తాడు. రిషి-మహేంద్ర ఇద్దరూ ఆకలి లేదనేస్తారు.
వసు: మేడం కోలుకున్న తర్వాత తనతో మాట్లాడేందుకు అయినా శక్తి ఉండాలి కదా..ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ మీరు ఏమీ తినలేదు కదా రండి
చక్రపాణి: కొద్దిగా తినండి బావగారు
మహేంద్ర: ఇప్పుడు ఏమీ తినలేను
వసు: మీరు తినకపోతే రిషి సార్ తినరు..అసలే ఆయన ఆకలికి తట్టుకోలేరు
రిషి: నేను తినలేను
మహేంద్ర: ఈ పరిస్థితుల్లో నువ్వు నా పక్కన లేకుంటే నేను తినలేను నాన్నా..
చక్రపాణి: మీరు వెళ్లండి బాబూ..నేను టీచరమ్మ దగ్గరుంటాను
రిషి, వసు, మహేంద్ర భోజనానికి వెళతారు... చక్రపాణి..జగతి దగ్గరకు వెళ్లి నమస్కారం పెడతాడు..
చక్రపాణి: మీరు దేవత..కొంతమందిని భగవంతుడు పరుల కోసమే పుట్టిస్తారు..మిమ్మల్ని అలాగే పుట్టించారు. మీరు కాపాడింది మీ కొడుకుని మాత్రమే కాదు నా బిడ్డని కూడా..నా బిడ్డకి రిషి సార్ అంటే ప్రాణం..ఆ ప్రాణం నిలబెట్టారు..మీరు కచ్చితంగా కోలుకుంటారు తల్లీ
Also Read: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా
రిషి-మహేంద్ర ఇద్దరూ భోజనం చేస్తారు..ఆ తర్వాత రిషి..వసుని కూడా తినమని చెప్పి వడ్డిస్తాడు, వాటర్ గ్లాస్ ఇస్తాడు. జగతితో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుని వసు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాంటి మేడంని మీరు నాకు దూరమయ్యారని దూరం పెట్టాను ఎంత బాధపడి ఉంటారో అంటుంది. నువ్వు తినేసి రా నేను మా అమ్మ దగ్గరుంటా అని వెళ్లిపోతాడు రిషి.. వెళ్లి జగతిని చూసి ఎమోషన్ అవుతాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు
రిషి: సారీ అమ్మా అని చేయి పట్టుకుని ఏడుస్తాడు.. నేను బతికినంతకాలం నా చివరి శ్వాస వరకూ నిన్ను అమ్మా అని పిలుస్తాను ఒక్కసారి కళ్లు తెరు అమ్మా, లే అమ్మా..ఇలా చలనం లేకుండా పడుకుంటే ఎలా అమ్మా..నువ్వు త్వరగా కోలుకుంటే నిన్ను గుండెలకు హత్తుకుని ఏడవాలి అనిపిస్తోంది అమ్మా. నీలాంటి గొప్పతల్లి ప్రేమ పొందినందుకు నేను చాలా అదృష్టవంతుడిని కానీ ఆ ప్రేమని నీకు తిరిగి ఇవ్వలేకపోయాను. రియల్లీ వేరీ సారీ అమ్మా. చాలా బాధగా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ నీ మాట వినేందుకు కూడా ఇష్టపడలేదు..కానీ ఇప్పుడు వినడానికి వచ్చినప్పుడు ఇలా మౌనంగా ఉంటావేంటమ్మా, కళ్లు తెరువమ్మా, మాట్లాడమ్మా అని ఏమోషన్ అవుతాడు.
ఈ లోగా డాక్టర్ వచ్చి..మీరిలా లోపల కూర్చోకూడదు..మీరు ఈవిడకు ఏమవుతారని అడుగుతాడు.. తను మా అమ్మ అని సమాధానం చెబుతాడు డాక్టర్: ఆమెకి ఇంతకు ముందు కూడా బుల్లెట్ గాయం అయింది కదా
రిషి: అప్పట్లో రిషి ఇవన్నీ డ్రామాలు అన్న మాట గుర్తుచేసుకుని బాధపడతాడు..
డాక్టర్: అప్పటి బుల్లెట్ అలాగే ఉండిపోయింది..అది తీసేందుకు ప్రయత్నిస్తున్నాం..అది తీసినా - వదిలేసినా ప్రాబ్ల్.. ఎక్స్ పర్ట్ డాక్టర్స్ ని పిలుస్తున్నాం..మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం..మీరు ఎక్కువ సేపు లోపల ఉండొద్దని చెప్పేసి వెళ్లిపోతాడు..
Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం!
రిషి: డాక్టర్ నీకు ప్రమాదం అని చెబుతున్నప్పుడు ఒక్కసారిగా కాళ్లకింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది..నువ్వు కోలుకోవాలంటే నేను ఏం చేయాలో చెప్పు నీకు మాటిస్తున్నా అని చేయిపట్టుకుని ఏడుస్తాడు.
రిషి ఎక్కడ అని వసుని అడిగిన మహేంద్ర..జగతి దగ్గరకు వెళ్లాడని తెలుసుకుని ఇద్దరూ వెళతారు. జగతి చేయిపట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న రిషిని చూసి ...ఇన్నేళ్లు ఈ క్షణం కోసమే తపించిపోయింది..రిషి ప్రేమ కోసం ఎదురుచూసింది..రిషి తన పక్కన ఆప్యాయంగా కూర్చోవాలని తపన పడింది..కానీ చివరకు ఇలాంటి పరిస్థితుల్లో రిషి ప్రేమను పొందుతోంది..ఆ దుర్మార్గుడి ఆటలకు బలైపోయింది
వసు: ఈ సారి కచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది..
లోపలున్న రిషి లేచి బయటకు వచ్చేందుకు నిలబడతాడు..ఇంతలో వసు-మహేంద్ర వచ్చి ఏంటి రిషి వచ్చేస్తున్నావ్ పర్వాలేదు కాసేపు కూర్చో అంటాడు మహేంద్ర. డాక్టర్ ఎక్కువ సేపు ఉండొద్దన్నారంటూ బయటకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేస్తాడు రిషి..
ఇంతలో జగతి...రిషి అని పిలుస్తుంది... అమ్మా అని రిషి పిలిచిన పిలుపు విని జగతి సంతోషిస్తుంది...అమ్మా అని పిలిచావా అని ఏమోషన్ అవుతుంది..మళ్లీ పిలువు అని అడుగుతుంది..చాలు రిషి నా జీవితానికి ఈ ఒక్క పిలుపు చాలు..
జగతి: మహేంద్ర..నా కొడుకు నన్ను అమ్మా అని పిలిచాడు..
గుప్పెడంతమనసు సెప్టెంబరు 30 ఎపిసోడ్ (Guppedanta Manasu September 30th)
నేను ద్వేషించినా కానీ చివరకు నీ ప్రాణాలు అడ్డు వేసి నా ప్రాణాలు కాపాడావ్..నీకోసం ఏదైనా చేస్తాను..ఏం చేయాలి అంటాడు.. అప్పుడు జగతి నల్లపూసలు తీసి రిషికి ఇస్తుంది..మీ ఇద్దర్నీ పచ్చని పందిట్లో భార్య-భర్తలుగా చూడాలని ఉందని కోరుతుంది.. మంగళసూత్రం కట్టి ఈ నల్లపూసలు వసు మెడలో వేయాలని ఆశపడుతున్నా అని అడుగుతుంది...