Gruhalakshmi Serial Today January 5Th: ‘గృహలక్ష్మీ’ సీరియల్: పూజలో పాల్గొన్న లాస్య, నంద - దివ్యను కారుతో గుద్దిన రాజ్యలక్ష్మీ
Gruhalakshmi Today Episode: లాస్యతో కలసి నంద వ్రతంలో పాల్గొనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Gruhalakshmi Serial Today Episode: వ్రతంలో లాస్య పక్కన కూర్చోనని చెప్పి నంద లోపలికి వెళ్లడంతో లాస్య ఏడుస్తూ..పరంధామయ్యకు కంప్లైంట్ చేస్తుంది. దీంతో పరంధామయ్య తులసిని తిడతాడు. పరంధామయ్యను ఏమీ అనలేక అనసూయ నంద రూంలోకి వెళ్లి నందను తిడుతుంది. ఇంతలో తులసి కూడా లోపలికి వస్తుంది. నందాను కన్వీన్స్ చేసి బయటకు వెళ్లిపోతుంది. బయట ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న లాస్య నేను కూడా తెగేదాకా లాగొద్దు అని మనసులో అనుకుంటుంది.
పరంధామయ్య: లాస్య ఏక్కడమ్మా వాడు ఇంకా రాలేదు.
లాస్య: నాకు అదే అర్థం కావడం లేదు మామయ్య.
అని లాస్య అంటుండగానే నంద లోపలి నుంచి బయటకు వస్తాడు.
లాస్య: నందు వచ్చేశావా? వ్రతం మొదలుపెడదామా? రండి మామయ్యా..
అంటూ అందరూ కలిసి వ్రతం దగ్గరకు వెళ్తారు. పంతులు గారు పూజ మొదలు పడతారు. అన్యమనస్కంగానే నంద పూజలో పాల్గొంటాడు. తులసి, అనసూయ బాధగా చూస్తుంటారు. ఇంతలో తులసి బాధపడుతూ లోపలికి వెళ్తుంది. మరోవైపు విక్రమ్, దివ్య రెస్టారెంట్‌లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు.
దివ్య: విక్రమ్ ఏం ఆలోచిస్తున్నావ్
విక్రమ్: ఏం లేదు
దివ్య: ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా?
విక్రమ్: ఏం లేదని చెప్పాగా..?
దివ్య: ఈ పిచ్చిదాన్ని నమ్మటం ఎలా అని ఆలోచిస్తున్నావు కదా
విక్రమ్: అదేం లేదు దివ్య
అంటూ ఇంత కష్టపడి బొమ్మ వేయించాం అయినా ఎస్సై చాలా సింపుల్‌గా తీసిపడేశాడేమి అని ఆలోచిస్తున్నాను అంటాడు. కొద్ది రోజుల పాటు మనం ఆ అమ్మాయి గురించి మరిచిపోదాం అంటాడు విక్రమ్.
దివ్య: ఎందుకు మరచి పోవాలి. ఇంక ఆ అమ్మాయి గురించి వెతకవా? వదిలేస్తావా? నిజం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆరాటం చచ్చిపోయాయా? లేక నువ్వనుకున్నదే నిజం అనుకుంటున్నావా?
విక్రమ్: ఎలాంటి ఆధారం లేకుండా ఆ అమ్మాయిని వెతకడం టైం వేస్ట్ అనిపిస్తుంది.
అనగానే దివ్య బాధగా థాంక్స్ అని చెప్తుంది. ఇంతలో చందన రెస్టారెంట్ లోపలి నుంచి బయకు వెళ్లడం దివ్య చూస్తుంది. దీంతో షాకింగ్ గా లేచి బయటకు పరుగెడుతుంది దివ్య. విక్రమ్ కూడా దివ్య వెనకాలే పరుగెడతాడు. దివ్య పరుగెడుతూ రాజ్యలక్ష్మీ వస్తున్న కారుకు ఎదురుగా వెళ్తుంది. కారు ఆపి దిగిన రాజ్యలక్ష్మీ బుద్దుందా నీకు అంటూ తిడుతూ పిచ్చెక్కిందా? చచ్చిపోదామనుకున్నావా? అంటూ కారులోకి తీసుకెళ్తుంది. మరోవైపు నంద భోజనం చేస్తుంటే సైలెంట్‌గా వడ్డిస్తుంది తులసి.
నంద: ఎవరి మీద కోపమో నా మీద చూపిస్తే ఎలా చెప్పు. మాట్లాడొచ్చు కదా? కనీసం పలకరించొచ్చు కదా? నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా చెప్పుకునేది నీకే పరిష్కారం కోసం చూసేది నీ వైపే
తులసి: నాకే నా చుట్టూ లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేయాలో తెలియని ఆయోమయంలో ఉన్నాను. ఇంకొకరి ప్రాబ్లమ్స్ వినే ఓపిక కానీ పరిష్కారాలు చెప్పే మూడ్ కానీ నాకు లేవు.
నంద: నువ్వే అలా అంటే ఎలా తులసి. లాస్య నన్ను ఇరిటేట్ చేస్తుంది. నా సహనానాకి పరీక్ష పెడుతుంది. గీత దాటి ప్రవర్తిస్తోంది. వింటున్నావా తులసి
తులసి: నేను చేసిన కూరలు ఉప్పు తక్కువైతే చెప్పండి. పచ్చడిలో కారం ఎక్కువైతే చెప్పండి. ఏం చేయాలో చెప్తాను. అంతే కానీ నాకు సంబంధం లేని విషయాలు నాకు చెప్తే నేనెలా పట్టించుకుంటాను.
అంటూ ఏ విషయాలు మీరు నాతో మాట్లాడొద్దు. మామయ్యగారి కోసం ఆత్మాభిమానాన్ని దాచుకుని బతకాల్సి వస్తుంది. అంటూ తులసి బాధపడతుంది. ఇంతలో డైనింట్ టేబుల్ దగ్గరకు అనసూయ, పరంధామయ్య వస్తారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని పరంధామయ్య మళ్లీ తులసిని తిడతాడు. దీంతో కోపంగా నంద, పరంధామయ్యను తిడతాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?