(Source: ECI/ABP News/ABP Majha)
Gruhalakshmi December 20th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: దివ్యకు పిచ్చిపట్టిందన్న తాతయ్య – విక్రమ్ పాలలో విరోచనం మాత్రలు కలిపిన బసవయ్య
Gruhalakshmi Serial Today Episode: హాస్పిటల్ నుంచి వచ్చిన దివ్య కలలో విక్రమ్ కు ప్రమాదం ఉందని తెలిసి పరిగెత్తాననడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: తమ ఇంటికి వచ్చి పరంధామయ్యకు వచ్చిన జబ్బు గురించి ఆయనకే లాస్య చెప్పబోతుంటే లోపలి నుంచి తులసి, నంద, అనసూయ వచ్చి లాస్యను తిడతారు. మళ్లీ ఎందుకొచ్చామని నిలదీస్తారు. నీ బాధ పడలేకే వాడు నీకు దూరం అయ్యాడని అనసూయ తిడుతుంది. దీంతో లాస్య కోపంగా
లాస్య: ఎందుకు అత్తయ్య నావైపే ఎప్పుడూ వేలెత్తి చూపిస్తారు. మీ అబ్బాయిని భరించలేకే తులసి వదిలేసిందని నేను అంటే ఒప్పుకుంటారా? మీరు. వదిలేసినా మీ అబ్బాయి తులసి వెంట పడుతూ సతాయిస్తున్నాడంటే మీరు ఒప్పుకుంటారా?
నంద: లాస్య
లాస్య: అంత చీఫ్‌గా నేను మాట్లాడను నందు. విడిపోయినా నేను బంధాన్ని గౌరవిస్తాను. తేలిక చేసి మాట్లాడను. ఎక్కువగా మాట్లాడి బాధపెట్టి ఉంటే సారీ
అంటూ లాస్య వెళ్లిపోతుంది. తులసి, అనసూయ కూడా లోపలికి వెళ్లిపోతారు. నంద హాల్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. బసవయ్య బయటి నుంచి హడావిడిగా లోపలికి అక్కాయ్, అక్కాయ్ అంటూ పిలస్తూ వస్తాడు. రాజ్యలక్ష్మీ, ప్రసూనాంబ బయటకు వస్తారు.
బసవయ్య: అక్కాయ్ వాళ్లు హాస్పిటల్ నుంచి బయలుదేరారట. ఏ క్షణమైనా రావొచ్చు. మనం అనుకున్న డ్రామా అనుకున్నట్లు మొదలు పెట్టండి.
రాజ్యలక్ష్మీ: సరే
బసవయ్య: మరి నీ సంగతేంటి?
ప్రసూనాంబ: నేను రెడీగానే ఉన్నాను. కారు రానివ్వండి.
బసవయ్య: అదిగో వచ్చేసింది. కానీ స్టార్ట్ చేయండి.
అనగానే రాజ్యలక్ష్మీ కంగారు పడ్డట్లుగా దివ్య కోసం టెన్షన్ పడుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. రాజ్యలక్ష్మీకి సేవ చేస్తున్నట్లు ప్రసూనాంబ నటిస్తుంది. దివ్య రాగానే లేని ప్రేమను నటిస్తూ ఎక్కడికి వెళ్లావని కంగారుగా అడుగుతుంది. దీంతో దివ్య విక్రమ్‌కు ప్రమాదం అని తెలిసి వెళ్లానని చెప్తుంది. విక్రమ్‌కు ప్రమాదం అని ఎవరు చెప్పారని అడుగుతారు. తనకు కల వచ్చిందని దివ్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. తాతయ్యతో సహా అందరూ దివ్యను సైకియాట్రిస్ట్‌కు చూపించాలని విక్రమ్‌కు సలహా ఇస్తారు. దీంతో దివ్య అక్కడి నుంచి ఏడుస్తూ రూంలోకి వెళ్తుంది. బసవయ్య, రాజ్యలక్ష్మీ, సంజయ్, ప్రసూనాంబ సంతోషిస్తారు. మరోవైపు నంద డాబా మీద కూర్చుని తులసి, లాస్య అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
నంద: అసలే తులసి నామీద కోపంగా ఉంది. అవకాశం దొరికితే చాలు దులిపేస్తుంది. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతుంటే.. లాస్య వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు పోసి వెళ్లింది.
అని మనసులో అనుకుంటూ బాధపడుతూ మందు తాగబోతుంటే అక్కడికి తులసి వస్తుంది. తులసిని చూసిన నంద తాగడం ఆపేస్తాడు.
తులసి: ఆగిపోయారేం తాగండి. నేనేం వద్దనలేదు. మీ నోటికేం అడ్డుపడటం లేదు. జస్ట్ చూస్తున్నా అంతే.. మంచి, మర్యాద, గౌరవం గాలికి వదిలేసి ఎలా దిగజారచ్చో కళ్లారా చూస్తున్నా..
అంటూ తులసి నందాను తిట్టి కనీసం మామయ్య విషయంలోనైనా పద్దతిగా ఉండమని చెప్పి వెళ్తుంది. నందా ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు దివ్య బెడ్‌రూంలో కూర్చుని ఏడుస్తూ అందరూ తనను అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది.
దివ్య: నా ప్రవర్తనలో ఎలాంటి తప్పు లేదు. ఏ విషయంలోనూ భ్రమ పడటం లేదు. అలా అని అందరినీ నమ్మించడం ఎలా? అందరూ కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు.
అని మనసులో అనుకుంటూ బాధపడుతుంటే విక్రమ్ డోర్ దగ్గరకు వచ్చి దివ్యను చూసి దివ్య తెలియని మెంటల్ ప్రాబ్లమ్‌తో స్ట్రగుల్ అవుతుంది. తనని హ్యాపీ మూడ్‌లో ఉంచితే ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అనుకుని దివ్య దగ్గరకు వెళ్తాడు. దివ్యను హగ్ చేసుకోబోతుంటే విక్రమ్‌ను పక్కకు తోసేస్తుంది దివ్య. నేను నీ భర్తను నన్ను కూడా దగ్గరకు రానివ్వకపోతే ఎలా అంటూ విక్రమ్ అడగ్గానే.. ఇప్పుడు గుర్తొచ్చానా నేను అంటూ దివ్య బాధపడుతుంది. ఇంట్లో వాళ్లందరూ నన్ను కార్నర్ చేసినప్పుడు ఎందుకు పలకలేదని ప్రశ్నిస్తుంది. నాబాధ నన్ను పడనివ్వు మనసు కుదుటపడ్డాక మాట్లాడతాను అని చెప్పి దివ్య వెళ్లిపోతుంది. దివ్యను హ్యాపీగ చేయాలంటే ఆ టాబ్లెట్స్ కలిపిన పాలను దివ్యకు తాగించాలనుకుని బయటకు వెళ్తాడు. బయటి నుంచి దివ్య, విక్రమ్ గొడవ పడటాన్ని బసవయ్య దొంగచాటుగా వింటాడు. ఆ టాబ్లెట్ అంటే ఎంటి అని ఓహో ఆ టాబ్లెట్టా? అల్లుడూ నీ ప్లాన్ నా చెవిలో పడ్డాకా చెడగొట్టకుండా ఉంటానా? అని బసవయ్య మనసులో అనుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.