అన్వేషించండి

Gruhalakshmi October 19th : నీ తప్పులు అయిపోయాయ్ క్షమించేదే లేదన్న తులసి- సామ్రాట్ ని ఏకిపారేసిన లాస్య

తులసి, సామ్రాట్ గురించి లాస్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

సామ్రాట్ లాస్యని కోపంగా ఆఫీసు నుంచి బయటకి వెళ్లిపొమ్మని చెప్తాడు. లాస్య తులసి దగ్గరకి వెళ్ళి తప్పు ఒప్పుకుంటున్నా క్షమించమని సామ్రాట్ గారికి చెప్పు నువ్వు చెప్తే నీ మాట వింటారని బతిమలాడుతుంది. కానీ తులసి మాత్రం అందుకు ఒప్పుకోదు. ఇప్పుడు జరిగిన గొడవ నాకు మాత్రమే సంబంధించినది అయితే నేను పట్టించుకునే దాన్ని కాదు కానీ నాతో పాటు సామ్రాట్ గారి మీద నిందలు వేసి ఆయన్ని అవమానించావు. ఇప్పటి వరకు నేను క్షమించాను కానీ ఇప్పుడు కూడా నిన్ను క్షమించమని సామ్రాట్ గారికి సిఫార్సు చేస్తే నేను తప్పు చేసినట్టే అని కఠినంగా చెప్పేస్తుంది. సామ్రాట్ మళ్ళీ లాస్యని తిడతాడు. దీంతో లాస్య రివర్స్ అవుతుంది.

తులసి కోసం నన్ను జాబ్ లోకి తీసుకున్నావ్ అని సామ్రాట్ ని అంటుంది. నువ్వు కూడా తెలివి మీరిపోయావు. నీ అవసరం కోసం సామ్రాట్ ని బుట్టలో వేసుకున్నావ్. కమ్మగా వండిపెడుతూ ప్రేమగా మాట్లాడుతున్నావ్. మగాడి బలహీనత కనిపెట్టడంలో నువ్వు ఛాంపియన్ వి. నువ్వు నా మీద ఎందుకు జాలి చూపించావో నాకు అర్థం అయ్యింది. ఈ జాబ్ అడ్డం పెట్టుకుని నందుకి నాకు మధ్య గొడవలు పెట్టాలని అనుకున్నావ్ నాకు బాస్ గా మారి నా నెత్తిన ఎక్కి ఆడాలని అనుకున్నావ్, మరో పక్క నన్ను క్షమించినట్టు నటించి త్యాగమూర్తిగా నిలవాలని అనుకున్నావ్ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.

Also read: మళ్ళీ కనిపించకుండా పోయిన దేవి- బిడ్డని ఆదిత్యకి ఇవ్వనన్న రుక్మిణి

సామ్రాట్ లాస్య మీద అరుస్తుంటే నీ మాట పట్టించుకోను, నందు చెప్పింది కరెక్ట్ నువ్వు తులసి చేతిలో కీలుబొమ్మవి అని అంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి శాపనార్థాలు పెట్టి ఆఫీసు నుంచి వెళ్ళిపోతుంది. ఈ లాస్య ఇక్కడితో వదిలిపెట్టదని సామ్రాట్, తులసి టెన్షన్ పడతారు. తులసి దిగులుగా ఇంటికి వస్తుంది. ఏమైందని ప్రేమ్ అడుగుతాడు. నన్ను అడుగు నేను చెప్తాను అని అనసూయ ఎంట్రీ ఇస్తుంది. తులసి మారిపోయింది కళ్ళ ముందు ఉంది మన తులసి కాదు. ఇప్పుడు తులసికి మాట అంటే పడదు, నందుకి అవమననం జరిగేలా చేశావ్, ఈరోజు లాస్యని ఆఫీసు నుంచి బయటకి పంపించావ్. సామ్రాట్ అండ చూసుకుని అందరి మీద పగ సాధిస్తున్నావ్ అని అంటుంది.

నా బతుకు నేను బతకాలని అనుకుంటున్నా. లాస్యని, మీ అబ్బాయిని ఆఫీసు నుంచి బయటకి పంపిస్తే నాకు వచ్చే లాభం ఏంటి. నేను పాత తులసినే ఏమి మారలేదు. మీ నోటి నుంచి ఇలా మాటలు రావడం చాలా బాధగా ఉందని తులసి బాధపడుతుంది. మారిపోయింది తులసి కాదు నువ్వు అని పరంధామయ్య అంటాడు. మీ అత్తయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నా అవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్తాడు. ఇలాంటి మాటలు అత్తయ్య నోటి నుంచి వినాల్సి వచ్చేసరికి చాలా బాధగా ఉందని అంటుంది. లాస్య కోపంగా ఇంటికి వస్తుంది. ఏ విషయంలో తులసి కంటే నేను తక్కువ అని కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఉన్న వాటిని అన్నీ విసిరేస్తుంది. నందు వచ్చి ఆపేందుకు ప్రయత్నిస్తాడు. నాకు జాబ్ చాలా అవసరం ఫైర్ చెయ్యొద్దు అని కన్నీళ్లతో బతిమలాడాను పట్టించుకోలేదు ఏమనుకోవాలి, నీ మాజీ భార్యని కూడా అడిగాను కానీ పట్టించుకోలేదని అరుస్తుంది.

Also Read: వేద జీవితంలోకి ఉపద్రవం- ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి కుమిలిపోతున్న యష్

ఇలాంటిది జరుగుతుందని నీకు ముందే చెప్పాను నువ్వే వినలేదని నందు అంటాడు. ఇదంతా తులసి వల్లే అని లాస్య అంటే వదిలేయ్ వేరే జాబ్ వెతుక్కుందామని అంటాడు. కానీ లాస్య మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని అంటుంది. ఎంతటి బలవంతుడుకి అయిన ఏదో ఒక బలహీనత ఉంటుంది నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతుంది. నా పరువు పోయేలా ఏదైనా చేస్తే మాత్రం ఊరుకోను అని నందు హెచ్చరిస్తాడు. తులసి గదిలో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అది బయటకి తీసుకొచ్చి ఇది ఎవరు పెట్టారని అందరినీ అడుగుతుంది. పరంధామయ్య నేనే పెట్టాను అని అంటాడు.   

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget