Gruhalakshmi August 4th: తులసి మెడలో తాళి కట్టడానికి రెడీ అన్న నందు- విక్రమ్ ని ముగ్గులోకి దింపుతున్న దివ్య
దివ్య తిరిగి అత్తారింట్లో అడుగు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విక్రమ్ తన తప్పు తెలుసుకుని దివ్యని దగ్గరకి తీసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని తులసి అంటుంది. అది జరగాలంటే రాజ్యలక్ష్మి నిజస్వరూపం విక్రమ్ కి తెలియాలని, అది అంత తేలికైన పని కాదని నందు చెప్తాడు.
తులసి: నేను చేసిన తప్పు దివ్య చేయకూడదని అన్నారు. తనకి నచ్చజెప్పడం మొత్తం నేను విన్నాను. మీరు లాస్యతో తిరుగుతున్నప్పుడు మీ చొక్క పట్టుకుని నిలదీస్తే నాతో ఉండేవారా?
నందు: ఖచ్చితంగా ఉండేవాడిని భయంతో ఉంటాను
తులసి: నాకు భయంతో ఉండే భర్త కాదు ప్రేమతో ఉండే భర్త కావాలి. నేను నిలదీసి ఉంటే మొక్కుబడిగా నాదగ్గర ఉండి లాస్య గురించి ఆలోచించే వాళ్ళు
నందు: నెమ్మదిగా నా మనసు మారేది
Also Read: కొడుకు చెంప పగలగొట్టిన రేవతి- కృష్ణని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ముకుంద ప్లాన్స్
తులసి: మారకపోతే ఇద్దరం పిల్లల ముందు గొడవలు పడి విలువ పోగొట్టుకునే వాళ్ళం. విడాకులు తీసుకోబట్టి ఎవరి గౌరవం వాళ్ళం కాపాడుకోగలిగాము. రెండో పెళ్లి చెడిపోవడం వల్ల తప్పు తెలుసుకుని వేదాంతం మాట్లాడుతున్నారు. లాస్యతో బాగుండి ఉంటేమీరు నా గురించి ఆలోచించే వారా? మీ కారణంగా మన జీవితాలు ఇలా అయ్యాయి.. లేదంటే వేరే విధంగా ఉండేవి. దివ్యలో మీలా ఆవేశం ఉంది. ఆ ఇంట్లో పరిస్థితిని డీల్ చేసే ఆలోచన లేదు. తల్లిగా నా అనుభవం తనకి ఉపయోగపడేలా చేస్తానని ఏదో చెప్తుంది.
దివ్య ఏదో ప్లాన్ తోనే ఇంటికి తిరిగి వచ్చిందని రాజ్యలక్ష్మి, లాస్య మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని చప్పట్లు కొడుతూ కోడలు ఎంట్రీ ఇస్తుంది.
దివ్య: మొదటి సారి కోడలి మనసులో మాట బాగా గెస్ చేశావ్. నేను రావడం వెనుక మతలబు ఉంది అది ఏంటో చెప్పను.
రాజ్యలక్ష్మి: కోడలిగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే నన్ను ఏం చేయలేకపోయావ్. ఇప్పుడు డైవర్స్ దాకా వచ్చింది ఇప్పుడేం చేయగలవు
దివ్య: ఈ అహంకారం చాలు నీమీద గెలవడానికి.. పైగా దీనిలాంటి తెలివి తక్కువ దాన్ని పక్కన పెట్టుకున్నావ్. అది చాలులే. విక్రమ్ నా మీద చూపిస్తున్న ద్వేషం ఉత్తిత్తిదే.. తనని మళ్ళీ నా గుప్పిట్లోకి తీసుకుంటాను
లాస్య: కావాలని అది మనల్ని భయపెడుతుంది కంగారు పడకు రాజ్యలక్ష్మి
దివ్యకి తులసి ఫోన్ చేస్తుంది. భర్తతో ఎలా నడుచుకోవాలో చెప్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నాడు. నా మీద మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఇంట్లోకి రానిచ్చాడని చెప్తుంది. డివోర్స్ నోటీస్ వచ్చినాక కూడ ఎందుకు ఈ ఇంటికి వచ్చానోఅని జుట్టు పీక్కుంటున్నారు.
తులసి: రాజ్యలక్ష్మి వాళ్ళు రాక్షసులు.. అందుకే నిన్ను అడ్డం పెట్టుకుని నేను యుద్దం చేయాలని అనుకుంటున్నా.. నీ బలం నీ తెలివి సరిపోవు. ఇక నుంచి నువ్వు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోకు. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. దాన్ని బట్టి ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను అని కూతురికి ఏదో చెప్తుంది.
నందు మందు కొడుతూ ఉంటాడు. ఏంటి ఇంట్లో కూర్చుని తాగుతున్నావని తండ్రి చీవాట్లు పెడతాడు. కూతురికి బుద్ధి చెప్పి తన కాపురాన్ని నిలబెట్టానని సంతోషంగా చెప్తాడు. ఈసారి తాగి గొడవ పెడితే ఊరుకొనని పరంధామయ్య వార్నింగ్ ఇస్తాడు. లాస్య ఎంట్రీ ఇస్తుంది. నిన్ను తన్ని తరిమేశాను కదా అయినా ఎందుకు నా చుట్టు తిరుగుతున్నావని తిడతాడు.
Also Read: ఇంటిని కాపాడుకున్న కావ్య- అపర్ణ దగ్గర చెల్లిని అడ్డంగా బుక్ చేసిన స్వప్న
నందు: నేను ఉండగా దివ్య మీద ఈగ కూడా వాలనివ్వను. ఈసారి దివ్య మిమ్మల్ని ఆడిస్తుంది. విక్రమ్ తో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది చూస్తూ ఉండండి
నందు మాటలకి ఇంట్లో వాళ్ళందరూ బయటకి వస్తారు.
లాస్య: నాలుగు రోజుల్లో ఆ పిల్ల కాకి గిలగిలా కొట్టుకుంటూ ఈ ఇంటి మీద వాలుతుంది
నందు: దివ్య తులసి కూతురు తనలో ఎంత మంచితనం ఉందో దివ్యలో కూడా ఉంది. అనుకున్నది సాధించే దాకా నిద్రపోదు
లాస్య: ఏంటి తులసిని తెగ పొగుడుతున్నావ్.. మళ్ళీ తనకి లైన్ వేస్తున్నావా.. తనని దారిలో పెట్టుకుంటున్నావా
నందు: అవును లైన్ వేస్తున్నా. నా దారిలో పెట్టుకుంటున్నా, తనతో కలిసి బతుకుతాను నీకేంటి
లాస్య: అంటే ఆవిడ ఒకే అంటే తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నావా
నందు: మొహమాటం లేకుండా ఏ మాత్రం ఆలోచించకుండా కట్టేస్తాను. నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. అంతకంటే అదృష్టం లేదని అనుకుంటాను
లాస్య: అంత దాకా వస్తే నేను ఏంటో చూపిస్తా
దివ్య మొగుడ్ని బుట్టలో వేసేందుకు స్కెచ్ వేస్తుంది. అందంగా ముస్తాబై గదిలోకి వచ్చి విక్రమ్ ముందు వయ్యారాలు పోతుంది.