అన్వేషించండి

Krishna Mukunda Murari August 4th: కొడుకు చెంప పగలగొట్టిన రేవతి- కృష్ణని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ముకుంద ప్లాన్స్

కృష్ణ మరికొన్ని రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని రేవతికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రేవతి కృష్ణ వాళ్ళ కోసం గదికి వస్తుంది. అక్కడ క్యాలెండర్ లో ఒక డేట్ ని నోట్ చేసి ఉండటం గమనించి కంగారు పడుతుంది. అంటే కృష్ణ నిజంగానే వెళ్లిపోతుందా? అందుకే ఈ మధ్య ఇద్దరూ ముభావంగా ఉంటున్నారా? అంటే ఇద్దరూ ఇంకా అగ్రిమెంట్ కి కట్టుబడి ఉంటున్నారా? మా అందరినీ పిచ్చోళ్ళని చేసి దూరం అవాలని అనుకుంటున్నారా? అసలు వాళ్ళు ఎలా విడిపోతారో నేను చూస్తానని ఎమోషనల్ అవుతుంది. నందు మురారీ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ పైకి చెప్పుకోవడం లేదు. మీరిద్దరూ విడిపోతారని అంటే చాలా బాధగా ఉందని మనసులో అనుకుంటుంది. నందు డల్ గా ఉండటం చూసి ఏమైందని గౌతమ్ అడుగుతాడు. కృష్ణ, మురారీ విడిపోతున్నారని గౌతమ్ కి ఇన్ డైరెక్ట్ గా చెప్పడానికి చూస్తుంది. రేవతి మురారీని పక్కకి తీసుకొచ్చి పన్నెండు రోజుల్లో కృష్ణ మన ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా అని నిలదీస్తుంది.

మురారీ: అవును మమ్మీ తను వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. డాక్టర్ అయ్యి ఉచిత సేవలు చేస్తానని మాట ఇచ్చింది కదా. అది నిలబెట్టుకోవడం కోసం వెళ్తుంది

రేవతి: ఇద్దరూ కలిసి వెళ్తున్నారా

మురారీ: నేను వెళ్ళడం లేదు తను మాత్రమే వెళ్తుంది

Also Read: ఇంటిని కాపాడుకున్న కావ్య- అపర్ణ దగ్గర చెల్లిని అడ్డంగా బుక్ చేసిన స్వప్న

రేవతి: వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళండి లేదంటే ఇద్దరూ ఇక్కడే ఉండండి. కావాలంటే నిన్ను అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయిస్తాను

మురారీ: నువ్వు ఏంటి మమ్మీ మేము ఎప్పుడు కలిసి ఉండాలని అంటావ్ ఏంటి? నీకు ఎలా చెప్పాలి

రేవతి: మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించే కదా నాకు చెప్పాలని అనుకుంటుంది. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. మీరు కలిసి ఉండాలని హోమాలు, పూజలు చేయించాను. ఇష్టంలో కలిసి కూర్చుని చేశారనుకున్నా. ఇప్పుడు తను వెళ్తే ఇక తిరిగిరాదా?

మురారీ: కృష్ణ వాళ్ళ నాన్న చివరి మాట కోసం నన్ను పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్ళూ మీకోసమే మేంఇద్దరం భార్యాభర్తలుగా ఉన్నాం. అంతకమించి మా మధ్య ఏమి లేదని అనేసరికి లాగిపెట్టి పీకుతుంది.

రేవతి: పెళ్ళంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుంటున్నారా? మీరు ఇలా విడిపోవాలని అనుకుంటే అప్పుడే చెప్పొచ్చు కదా.

మురారీ: ఇందులో తన తప్పు లేదు పెద్ద రచ్చ చేయకు

రేవతి: పెళ్లి చేసుకుని ఇన్ని రోజుల తర్వాత ఇష్టం లేదంటే ఏం చెప్పాలి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నువ్వు అబద్దం చెప్తున్నావో తను అబద్దం చెప్తుందో నెనే తెలుసుకుంటాను

ఇక ఆవేశంగా రేవతి కృష్ణ దగ్గరకి వస్తుంది. కోపంగా చూస్తుంది.

రేవతి: క్యాలెండర్ లో 16 వ తేదీ మీద రౌండప్ ఎందుకు చేశావ్

కృష్ణ: నా సర్జన్ పూర్తయ్యే రోజుని అలా నోట్ చేశాను. ఆ డేట్ కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది

Also Read: ఊహించని ట్విస్ట్, మాళవిక హత్య- యశోధర్ అరెస్ట్

రేవతి: ఏంటి అది మీ అగ్రిమెంట్ పూర్తవడమా

కృష్ణ: అగ్రిమెంట్ గురించి మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు

రేవతి: అదంతా కాదు అగ్రిమెంట్ పూర్తయితే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావా? నాకు ఏమి తెలియదని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు అన్నీ తెలుసు(వీళ్ళ మాటలు అలేఖ్య వింటుంది)

కృష్ణ హోమం, పూజలు చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. అగ్రిమెంట్ విషయం తెలిసే హోమం చేయించి ఫామ్ హౌస్ కి పంపించింది. నా మనసు మీకు అర్థం అయ్యింది కానీ ఏసీపీ సర్ కి అర్థం కాలేదని మనసులోనే బాధపడుతుంది.

కృష్ణ: ఈ విషయం మీ దగ్గర దాచాలని అనుకోలేదు

రేవతి: అగ్రిమెంట్ అయిన తర్వాత అందరినీ వదిలేసి వెళ్లిపోతున్నావా

కృష్ణ: వెళ్ళక తప్పదు కదా

రేవతి: నీకు మురారీ అంటే ఇష్టం లేదా?

ఆయనంటే నాకు ప్రాణం. కానీ ఆయన మనసులో వేరే అమ్మాయి ఉందని ఎలా చెప్పాలి. నేను ప్రేమిస్తున్న విషయం చెప్తే మీరు మా అగ్రిమెంట్ ని పర్మినెంట్ చేస్తారు. ఆ అమ్మాయికి ద్రోహం చేసిన దాన్ని అవుతాను. అందుకే ఎప్పటికీ నా ప్రేమ సంగతి మీకు చెప్పను. మీకు నాపై ద్వేషం కలిగేలా చేయాలి అప్పుడే మీరు మురారీ మనసులో ఉన్న అమ్మాయిని ఒక్కటి చేస్తారని మనసులో అనుకుని బయటకి ప్రేమ లేదని చెప్తుంది.

కృష్ణ: నేను ప్రేమ పెళ్లి కంటే అమ్మానాన్నలకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను. నా జీవితాశయం నెరవేర్చడంలో నా ఫోకస్ ఉంచాను

రేవతి: లేదు మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget