అన్వేషించండి

Devatha September 28th Update: నిజం తెలుసుకున్న రుక్మిణి- ఊహించని మాట అడిగిన సత్య, చిన్మయి మీద ఫోకస్ పెట్టిన మాధవ్

రాధని సొంతం చేసుకోవడానికి మాధవ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అడ్డు వచ్చిన తల్లిని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఆఫీసర్ అంకుల్ వాళ్ళతో మాట్లాడమని చిన్మయి దేవితో ఒట్టు వేయించుకుంటుంది. అది చూసి మాధవ్ షాక్ అవుతాడు. ఎప్పుడు అందరితో నవ్వుతూ సరదాగా గడపాలి లేదంటే నేను అన్నం కూడా తినను అని చిన్మయి అలుగుతుంది. ఎందుకక్కా పరేషన్ అవుతావ్ నేను అందరితో మంచిగా ఉండాలి అంతేగా ఉంటాను అని దేవి అనేసరికి చిన్మయి, రాధ సంతోషిస్తారు. ఏంటి చిన్మయి దేవిని వాళ్ళతో బాగుండాలని అంతగా బతిమలాడుతుంది, దేవిని వాళ్ళకి దగ్గర చెయ్యాలని ఎందుకు ఆలోచిస్తుంది? దేవి నేను వెళ్ళను అంటే చిన్మయి కూడా అదే మాట మీద ఉండాలి కదా మరి ఎందుకు మాట మారింది. చిన్మయి ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి అని మాధవ్ అనుకుంటాడు.

సత్య జానకమ్మని పరామర్శించడానికి వెళ్తున్నట్టు దేవుడమ్మకి చెప్తుంది. సరే వెళ్ళి దేవిని బుజ్జగించు అని చెప్తుంది. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే మా రాధక్కతో కూడా మాట్లాడి వస్తాను అని వెళ్తుంది. అది చూసి సత్య మనసులో ఏముందో అర్థం కావడం లేదే అని ఆదిత్య అనుమానపడతాడు. సత్య జానకి దగ్గరకి వచ్చి పలకరిస్తుంది. సత్య రాధ దగ్గరకి వచ్చినప్పుడే ఆదిత్య తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సత్య ఆదిత్య గురించి చెప్పుకుని చాలా బాధపడుతుంది. ‘మంచి భర్త చక్కగా ఇద్దరు పిల్లలు నా జీవితంలో అవేవీ లేవక్కా. అటు ఇంట్లో సంతోషం లేక పిల్లలు లేకపోతే ఆడదాని మనసు ఎంత అల్లాడిపోతుందో నీకు తెలియదా అక్కా. నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావో చెప్పు. ఆదిత్యతో అమెరికా వెళ్ళాలి అనుకున్నా అది కుదరలేదు. పిల్లలు కావాలని ఎంత ప్రయత్నిస్తున్న ఏదో శక్తి అడ్డుపడుతుంది. నలుగురు నన్ను గొడ్రాలులాగా చూస్తున్నారు’ అనేసరికి రుక్మిణి ఎమోషనల్ గా సత్యని వచ్చి కౌగలించుకుని ఏడుస్తుంది.

Also Read: ఊహించని ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన మాళవిక- వసంత్, చిత్రని కలిపిన యష్, అవధుల్లేని ఆనందంలో తేలిపోతున్న వేద

మీ అక్కలేక్క చెప్తున్న నీ జీవితానికి ఏ శక్తి అడ్డు రాదు, నీకు మాట ఇస్తున్నా నీ పెనిమిటి గురించి నువ్వేమి పరేషన్ అవకు అని రాధ ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళని చూసి దేవి వెళ్లిపోతుంటే సత్య వచ్చి ఆపుతుంది. ఏంటమ్మా పిన్నీతో మాట్లాడవా నిన్ను అలా అన్నందుకు కోపం వచ్చిందని తెలుసు ఆరోజు కోపంలో అనేశాను ఇంకెప్పుడు అలా అనను అని సోరి చెప్తుంది. కానీ దేవి మాత్రం బాధపడుతుంది. నువ్వు అన్నీ మర్చిపోయి మా ఇంటికి రావాలి అని సత్య అడుగుతుంది. దేవి మాట్లాడకుండా ఉండేసరికి చిన్మయి సర్ది చెప్తుంది. రుక్మిణి, ఆదిత్య ఒకచోట కలుసుకుంటారు. సత్య నన్ను రాధ అనుకుంటుందా తన అక్క రుక్మిణి అనుకుంటుందా అని ఆదిత్యతో అడుగుతుంది.

‘నా వల్ల సత్తవ్వకి నీకు  దూరం పెరుగుతుందని అన్నది. చెప్పు పెనీవీటి నన్ను చూసినాక ఏ పొద్దు నువ్వు మా అక్కవి అనలేదు. మా అక్కలాంటి దానివి అని అంటుంది. సత్యకి నిజం తెలియదు కదా’ అని రుక్మిణి అడిగితే ‘లేదు నువ్వు రుక్మిణి అని ఇంట్లో మా ఇద్దరికీ తెలుసు. అందుకే సత్య గురించి నువ్వేమి బాధపడొద్దు ఇంటికి వచ్చేయ్ అని చెప్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఇంటికి రా’ అని అడుగుతాడు. లేదు పెనిమిటి నీ జీవితంలోకి రాను అని మాట ఇచ్చానని రుక్మిణి చెప్తుంది. నాకు సత్తెవ్వ మంచిగా ఉంటే చాలు నాకోసం నువ్వు తనని బాధపెట్టకుండా మంచిగా చూసుకో చాలు అని చెప్పి రుక్మిణి వెళ్ళిపోతుంది.

Also Read: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget