అన్వేషించండి

Gruhalakshmi September 27th Update: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

సామ్రాట్ గతం బట్టబయలు అయింది. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

సామ్రాట్ తన చెల్లిని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. తులసి దృష్టిలో నువ్వు మొన్నటి వరకు హీరో అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు తన దృష్టిలో నువ్వు పిరికివాడివి, ఒక జీరో అని పెద్దాయన అంటూ ఉంటాడు. తన ఫ్యామిలీ ముందు తులసి సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది దానికి కారణం నువ్వే. ప్రెస్ వాళ్ళ ముందు తులసిని ఆహారంగా వేసి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నీకు అంత స్వార్థం అని నిలదీస్తాడు. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో నీకు తెలుసు కదా అని సామ్రాట్ అంటాడు. ప్రెస్ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతుంటే నోరు మూయించాల్సిన నువ్వు నది సంద్రంలో వదిలేయడంతో తను ధైర్యంగా మాట్లాడింది, ఒకవేళ మాట్లాడకపోతే తులసి జీవితం ఏమై ఉండేది అని పెద్దాయన కోపంగా అడుగుతాడు. ఆ సమయంలో నాకు హనీ తప్ప ఎవరు గుర్తుకు రాలేదని సామ్రాట్ ఎమోషనల్ అవుతాడు. ఎన్నాళ్ళు ఈ నిజం దాస్తావ్ అని అడుగుతాడు. నాకు తెలియదు కానీ నాకు వేరే దారి లేదని సామ్రాట్ అంటాడు.

Also Read: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ

అభి నిద్రపట్టక బయటకి వచ్చి కూర్చుంటాడు. అది చూసిన నందు, లాస్య అభి మైండ్ చెడగొట్టేందుకు ట్రై చేస్తారు. ఇక తులసి ఫ్యామిలీ మొత్తం ఇంటి నుంచి వెళ్లేందుకు బయటకి వస్తారు. వెళ్లొస్తాము సామ్రాట్ గారు అని తులసి అంటే వెళ్లొద్దు ఆంటీ అని హనీ బాధగా అడుగుతుంది. ఇలా అంటే నేను అసలు రాను అనేసరికి నవ్వుతూ బాయ్ చెప్పమని తులసి అంటుంది. రేపటి నుంచి ఆఫీసుకి వస్తాను అక్కడ కలుద్దాం అని సామ్రాట్ అంటే మా మామ్ రాదు అని అభి గట్టిగా అరుస్తాడు. ఇక నుంచి మీతో కలిసి పని చేయదు ఎవరికి ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం అని అభి అంటాడు. పెద్ద వాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని తులసి అంటే ఇక్కడ ఎవరు పెద్ద వాళ్ళు అని అభి సీరియస్ అవుతాడు.

ప్రెస్ మీట్ కి పిలిచి నిన్ను వదిలేసిన ఆ మనిషి నీకు పెద్దమనిశిలాగా కనిపిస్తున్నారా? ఎందుకు అలా చేశారు అని నువ్వు అడగవు, నన్ను అడగనివ్వవు అని అభి అంటాడు. ప్రెస్ వాళ్ళ ముందు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పమను అని అభి అంటే.. అసలు నువ్వు మా వాడి ముందు నిలబడే హక్కు కానీ అర్హత కానీ లేదని తెలుసుకో అని పెద్దాయన అంటుంటే సామ్రాట్ తనని కంట్రోల్ చేస్తాడు. కోట్ల ఆస్తి ఉండటం గొప్ప కాదు నిజాయితీ ఉండటం గొప్ప, మా మామ్ లో ఉన్న నిజాయితిలో వన్ పర్సెంట్ కూడా ఆయనలో లేదు, తన భార్య గురించి నిజం చెప్పమను, ప్రెస్ వాళ్ళ ముందు ఎందుకు తలదించుకున్నాడు తనవైపు తప్పు ఉండబట్టే కదా అని అభి అడుగుతాడు. ప్రతి మనిషి జీవితంలో పైకి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి అంత మాత్రాన నిజాయితీ లేనట్టు కాదని సామ్రాట్ అంటాడు.

Also Read: సా గు తు న్న వసంత్ ఎంగేజ్మెంట్- వేద, యష్ కీచులాట, చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పంతులు

ఆయన చెప్పాల్సింది చెప్పారు నువ్వు ఇంక ఏమి ప్రశ్నించకు అని తులసి అంటే అభి మాత్రం వినిపించుకోడు. మీ భార్య గురించి నిజం అందరి ముందు చెప్పండి.. లేచిపోయిందా, వదిలేశారా, చంపేశారా అని అభి అడిగేసరికి అందరూ షాక్ అవుతారు. ఏం కూశావ్ రా అని పెద్దాయన అభి కాలర్ పట్టుకుంటాడు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని తిడతాడు. అవును మా వాడు తప్పు చేశాడు అని పెద్దాయన నిజం చెప్పబోతుంటే సామ్రాట్ ఆపుతాడు. మీ వాడు హత్య చేశాడు కదా హంతకుడు కదా అని అభి అంటాడు. ‘అవును హంతకుడే తన జీవితాన్ని చంపుకున్న హంతకుడు.. కూతురు గాని కూతురు కోసం తన సంతోషాన్ని చంపుకున్న హంతకుడు. నీలాంటి వాళ్ళు వేసే నిందలు మోస్తూ హనీ తన కూతురు కాదు తన చెల్లెలి కూతురు అనే నిజాన్ని గుండెల్లో దాచుకున్న హంతకుడు. వాడిని ఉరికంభం ఎక్కించు రాళ్ళతో కొట్టి చంపించు వెళ్ళు’ అని పెద్దాయన కోపంగా అంటాడు.

ఆ నిజం విని తులసి షాక్ అవుతుంది. ఈ నిజం ప్రాణం పోయేంత వరకు తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు అందుకే ఎవరు ఎన్ని నిందలు వేసిన మౌనంగా వాటిని భరిస్తూ లోలోపలే బాధపడుతున్నాడు. అంతే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఈ మాట మీ వాడికి చెప్పు అని పెద్దాయన చెప్తాడు.

తరువాయి భాగంలో..

అనసూయ సామ్రాట్ ఇంటికి వస్తుంది. మా తులసి ఇక మీ ఆఫీసుకి రాకూడదు.. మీకు మీరుగా మా తులసిని దూరం పెట్టాలి, తనకి దూరంగా ఉండాలి, ఆఫీసుకి రాకుండా చెయ్యాలి అని అనసూయ అడుగుతుంది. తులసిగారికి అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తుందని సామ్రాట్ అంటాడు. నేను అన్నీ వైపుల నుంచి ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను ఇందులో ఎలాంటి మార్పు లేదని అంటుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget